Skip to main content

Due To Heavy Rain Schools and Colleges Holidays 2023 : బ్రేకింగ్ న్యూస్‌.. అత్యంత భారీ వర్షాలు.. రేపు, ఎల్లుండి స్కూల్స్‌, కాలేజీల‌కు సెలవులు.. అలాగే ఆఫీస్‌ల‌కు కూడా..

సాక్షి ఎడ్యుకేష‌న్‌ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా.. భారీ నుంచి అతిభారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో.. ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో జూలై 26, 27 తేదీల్లో (రేపు, ఎల్లుండి) విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం కీల‌క ఉత్తర్వులు జారీ చేసింది.
Schools and Colleges Holidays Due to Rain 2023
Telangana Schools and Colleges Holidays Due to Rain 2023

అలాగే తెలంగాణకు వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ఇలాగే వ‌ర్షాలు జూలై 28వ తేదీ కూడా కొన‌సాగితే.. ఆ రోజుకూడా సెలవు ఇచ్చే అవ‌కాశం ఉంది. ఇప్ప‌టికే తెలంగాణ‌లో వ‌రుస‌గా నాలుగు రోజులు పాటు సెలువుల ఇచ్చిన విష‌యం తెల్సిందే. ఇంకా మూడు రోజులపాటు అత్యంత భారీ వర్షాలు కురవనున్నాయని, గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితేనే బయటకు రావాలని అధికారులు తెలిపారు.

☛ Schools and Colleges holidays 2023 Extended : భారీ వర్షం.. స్కూల్స్‌, కాలేజీల‌కు సెలవులు.. వివిధ పరీక్షలు వాయిదా.. ఇంకా ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు కూడా..

అలాగే ఆఫీల‌కు కూడా..
తెలంగాణ‌ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో అయితే భారీ వర్షాలు వణికిస్తున్నాయి. జూలై 25వ తేదీ (మంగళవారం) నుంచి మూడు రోజులపాటు అత్యంత భారీ వర్షాలు కురవనున్నాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఈ భారీ నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంతో.. తెలంగాణకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది ఐఎండీ. ఈ నేప‌థ్యంలో హైదరాబాద్‌లో భారీగా ట్రాఫిక్ జాం అవుతున్న విష‌యం తెల్సిందే. జూలై 25, 26వ తేదీలో (మంగళవారం, బుధవారం) ఐటీ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులకు 3 దశలవారీగా లాగ్ అవుట్ చేసుకోవాలని సైబరాబాద్ పోలీస్ శాఖ సూచించింది.

☛ July and August School Holidays 2023 list : ఈ నెల జూలై, వ‌చ్చే నెల‌ ఆగ‌స్టులో స్కూల్స్‌కు భారీగా సెల‌వులు.. ఎందుకంటే..?

ప‌నివేళ‌లు ఇలా..
☛ఫేజ్ 1 : ఐకియా నుంచి సైబరాబాద్ టవర్స్ వరకు ఉండే ఐటీ ఆఫీసులు సాయంత్రం 3 గంటలకు లాగ్ ఔట్ చేసుకోవాలని తెలిపింది. 
☛ ఫేజ్ 2 : ఐకియా నుంచి బయో డైవర్సిటీ, రాయదుర్గం వరకు ఉండే ఐటీ ఆఫీసులు సాయంత్రం 4:30 గంటలకు లాగ్ ఔట్ చేసుకోవాలని పేర్కొంది.
☛ ఫేజ్ 3 : ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఉండే ఐటీ ఆఫీసులు సాయంత్రం 3 నుంచి 6 గంటల వరకు లాగ్ ఔట్ చేసుకోవాలని చెప్పింది.

స్కూళ్లు, కాలేజీలు మ‌రో..

rain holidays schools telugu news

వారం నుంచి వదలని వానలతో కర్ణాటకలోని చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ కేంద్రం హెచ్చరికలతో రేపు (జులై 26న) రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటిస్తున్నట్టు విద్యాశాఖ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. కేరళలోనూ వానలు దంచికొడుతున్నాయి. కొన్ని జిల్లాల్లో ఎడతెరిపి లేని వర్షం జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. ఈక్రమంలోనే అతి భారీ వర్షాలకు అవకాశముందని వాతావరణ శాఖ రాష్ట్రంలోని కొన్ని జిల్లాలకు అలర్ట్‌ జారీ చేసింది. 

ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వయనాడ్‌, కోజీకోడ్‌, కన్నూర్‌, మళప్పురం జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలు తదుపరి ఆదేశాలు జారీ చేసేంత వరకు మూసి ఉంచాలని రాష్ట్ర విద్యాశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, వర్ష ప్రభావిత ప్రాంతాల్లోని విద్యాసంస్థలు ఇప్పటికే సెలవుల్లో ఉన్న సంగతి తెలిసిందే. తెరిపినివ్వని వర్షం కారణంగా కాసర్గాడ్‌ జిల్లాలోని వెళ్లరికుందు, హోస్‌దుర్గ్‌ తాలుకాలు జలమయమయ్యాయి. ఆయా ప్రాంతాల్లోని విద్యాసంస్థలకు కూడా సెలవులు ఇస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

➤☛ టిఎస్ టెన్త్ క్లాస్ : మోడల్ పేపర్స్ 2023 | టైం టేబుల్ 2023 | ముఖ్యమైన ప్రశ్నలు | స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్

వానలు, వరదల కారణంగా కేరళలలో ముగ్గురు ప్రాణాలు విడిచినట్టు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఇడుక్కి, వయనాడ్‌, కాసర్గాడ్‌ జిల్లాలో సహాయక శిబిరాలను ఏర్పాటు చేసినట్టు వెల్లడించింది. పలు చోట్ల చెట్లు కూలి ఇళ్లు ధ్వంసమయ్యాయని, భారీ వృక్షాలు ఉన్న చోట్ల జనం జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. కాగా, జులై 27 వరకు దక్షిణ భారతానికి భారీగా వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. 

తెలంగాణ‌లో 2023-24 అకడమిక్ ఇయర్‌లో ప‌రీక్ష‌లు- సెల‌వులు ఇవే..

schools holidays

☛ 2023-24 అకడమిక్‌ ఇయర్‌కు సంబంధించి మొత్తం 229 పనిదినాలు ఉన్నాయి.
☛ బడుల్లో ప్రతి రోజూ ఐదు నిమిషాల పాటు యోగా ధ్యానం చేయించాలి
☛ 2024 జనవరి పదవ తేదీ వరకు  పదో తరగతి సిలబస్ పూర్తి చేయాలి
☛ 2024 మార్చిలో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి 
☛ అక్టోబర్ 14 నుంచి 25 వరకు దసరా సెలవులు
☛ జనవరి 12 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు
☛ ఒకటి నుంచి తొమ్మిది తరగతుల వరకు ఏప్రిల్ 8 నుంచి 18 వరకు ఎస్ఏ 2 పరీక్షలు
☛ 2024 ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులుగా అకడమిక్‌ ఇయర్‌ క్యాలెండర్‌లో పేర్కొంది తెలంగాణ ప్రాథమిక విద్యాశాఖ.

☛ Civils Toppers: రెండేళ్ల‌పాటు మంచంలోనే... ప‌ట్టుద‌ల‌తో చ‌దివి సివిల్స్‌లో మెరిసింది... ఈమె కథ వింటే క‌న్నీళ్లే

Published date : 26 Jul 2023 12:19PM

Photo Stories