Due to Rain AP Schools and Colleges Holidays 2023 : అలర్ట్.. ఆంధ్రప్రదేశ్‌లో స్కూల్స్, కాలేజీలకు సెలవులు.. ఈ జిల్లాల్లో మాత్రమే..
అలాగే ఆంధ్రప్రదేశ్‌లో కూడా స్కూల్స్,కాలేజీలకు సెలవులు ఇచ్చారు.ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పలు జిల్లాల్లో(విశాఖ, నంద్యాల, ఏలూరు, ఎన్టీఆర్) విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది.
మిగిలిన జిల్లాల్లోనూ విస్తారంగా..
కుండపోత వర్షాలతో రాష్ట్రం తడిసి ముద్దయింది. ప్రధానంగా కోస్తా జిల్లాల్లో ఆకాశానికి చిల్లు పడినట్లు ఎడతెగని వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. మిగిలిన జిల్లాల్లోనూ విస్తారంగా వానలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారడంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా సగటున 2.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
ఈ జిల్లాలకు రెడ్..
అల్పపీడనం ప్రభావం జూలై 27వ తేదీ (గురువారం) వరకు ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాలు ఈ జాబితాలో ఉన్నందున, అక్కడి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉండడంతో ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది.
వర్షాలతోపాటు గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. శనివారం వరకు అల్పపీడనం ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉంది. సముద్రం అలజడిగా ఉన్నందున రానున్న మూడు రోజులు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం హెచ్చరించింది.
ఆగస్టు 2వ తేదీ కూడా..
అల్పపీడనం కేంద్రీకృతమైన బంగాళాఖాతం నుంచి కోస్తా జిల్లాల వైపు నిరంతరాయంగా మేఘాలు వస్తూనే ఉండడం వల్ల భారీ వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. దీంతో తీవ్ర అల్పపీడనం ఉత్తరాంధ్ర–దక్షిణ ఒడిశా తీరాల మీదుగా వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతోంది.
మరోవైపు నైరుతి రుతుపవనాలు కూడా చురుగ్గా ఉన్నాయి. కాగా, బంగాళాఖాతంలో వచ్చే నెల 2వ తేదీ నాటికి మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇది ఉత్తరాంధ్ర, ఒడిశా తీరం మధ్య కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న అల్పపీడనం బలహీనపడిన తర్వాత ఈ అల్పపీడనంపై స్పష్టత వస్తుందని ఏపీఎస్‌డీపీఎస్ అధికారులు చెబుతున్నారు.అలాగే, భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది.
జూలై 29, 30 తేదీల్లో స్కూల్స్, కాలేజీలకు సెలవులు.. ఎందుకంటే..?
ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల్లో స్కూల్స్, కాలేజీలకు భారీగా సెలవులు వస్తున్నాయి. ఇటీవలే తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో.. స్కూల్స్, కాలేజీలకు ఆరు రోజులు పాటు సెలవులు వచ్చాయి. అలాగే ఈ నెలలోనే స్కూల్స్, కాలేజీలకు రెండు రోజులు బంద్‌తో సెలవులు వచ్చాయి.
➤☛ టెన్త్ క్లాస్ : మోడల్ పేపర్స్ 2023 | టైం టేబుల్ 2023 | ముఖ్యమైన ప్రశ్నలు | స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్
అలాగే ఆగస్టు నెలలో కూడా వచ్చే సెలవుల పూర్తి వివరాలు ఇవే..
ఆగస్టు 5వ తేదీన శనివారం, కొన్ని పాఠశాలలకు సెలవు ఉండవచ్చు. ఆగస్టు 6వ తేదీ ఆదివారం కాబట్టి స్కూల్స్‌కి సాధారణంగా సెలవు ఉంటుంది. ఆగస్టు 12 నెలలో రెండవ శనివారం స్కూల్స్‌కు సెలవు. ఆగస్టు 13 ఆదివారం సెలవు ఉంటుంది. ఆగస్టు 15వ తేదీ (మంగళవారం) స్వాతంత్య దినోత్సవం సందర్భంగా పాఠశాలలకు, కాలేజీలకు సెలవు ఉంటుంది. ఆగస్టు 16, పార్సీ న్యూ ఇయర్, కొన్ని పాఠశాలలకు సెలవు ఉండవచ్చు.
ఆగస్టు 20వ తేదీ ఆదివారం హాలిడే. ఆగస్టు 27వ తేదీ ఆదివారం. ఆగస్టు 29వ తేదీ ఓనం, కొన్ని పాఠశాలలకు సెలవు ఉండవచ్చు. ఆగస్టు 30వ తేదీ(బుధవారం) రక్షా బంధన్ సందర్భంగా పాఠశాలలకు సెలవు ఇస్తారు. అయితే విద్యార్థులు నివసిస్తున్న రాష్ట్రం లేదా ప్రాంతంను బట్టి పైన పాఠశాలను సెలవులు ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు.
ఆంధ్రప్రదేశ్‌లో 2023 ఏడాదిలో సెలవులు పూర్తి వివరాలు ఇవే..
పండుగ/పర్వదినం |
తేదీ |
వారం |
భోగి |
14–01–2023 |
శనివారం |
మకర సంక్రాంతి |
15–01–2023 |
ఆదివారం |
కనుమ |
16–01–2023 |
సోమవారం |
రిపబ్లిక్ డే |
26–01–2023 |
గురువారం |
మహాశివరాత్రి |
18–02–2023 |
శనివారం |
హోలి |
08–03–2023 |
బుధవారం |
ఉగాది |
22–03–2023 |
బుధవారం |
శ్రీరామనవవిు |
30–03–2023 |
గురువారం |
బాబు జగజ్జీవన్‌రామ్ జయంతి |
05–04–2023 |
బుధవారం |
గుడ్ ప్రైడే |
07–04–2023 |
శుక్రవారం |
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి |
14–04–2023 |
శుక్రవారం |
రంజాన్ |
22–04–2023 |
శనివారం |
బక్రీద్ |
29–06–2023 |
గురువారం |
మొహర్రం |
29–07–2023 |
శనివారం |
స్వాతంత్య్ర దినోత్సవం |
15–08–2023 |
మంగళవారం |
శ్రీకృష్ణాష్టమి |
06–09–2023 |
బుధవారం |
వినాయకచవితి |
18–09–2023 |
సోమవారం |
ఈద్ మిలాదున్ నబీ |
28–09–2023 |
గురువారం |
మహాత్మాగాంధీ జయంతి |
02–10–2023 |
సోమవారం |
దుర్గాష్టమి |
22–10–2023 |
ఆదివారం |
విజయదశమి |
23–10–2023 |
సోమవారం |
దీపావళి |
12–11–2023 |
ఆదివారం |
క్రిస్‌మస్ |
25–12–2023 |
సోమవారం |
సాధారణ సెలవులు ఇవే..
భోగి |
14–01–2023 |
రెండో శనివారం |
మకర సంక్రాంతి |
15–01–2023 |
ఆదివారం |
దుర్గాష్టమి |
22–10–2023 |
ఆదివారం |
దీపావళి |
12–11–2023 |
ఆదివారం |
2023లో ఐచ్ఛిక సెలవులు ఇలా..
కొత్త ఏడాది |
01–01–2023 |
ఆదివారం |
హజ్రత్ అలీ పుట్టినరోజు |
05–02–2023 |
ఆదివారం |
షబ్–ఇ–బారత్ |
07–03–2023 |
శుక్రవారం |
మహావీర్ జయంతి |
04–04–2023 |
మంగళవారం |
షబ్–ఇ–ఖాదర్ |
18–04–2023 |
మంగళవారం |
జుమాతుల్ వాడ |
21–04–2023 |
శుక్రవారం |
బసవజయంతి |
23–04–2023 |
ఆదివారం |
షహద్ హజ్రత్ అలీ |
24–04–2023 |
సోమవారం |
బుద్ధపూర్ణిమ |
05–05–2023 |
శుక్రవారం |
రథయాత్ర |
20–06–2023 |
మంగళవారం |
ఈద్–ఇ–గదీర్ |
06–07–2023 |
గురువారం |
9వ మొహర్రం |
28–07–2023 |
శుక్రవారం |
పార్సీ నూతన సంవత్సరం డే |
16–08–2023 |
బుధవారం |
వరలక్ష్మీవ్రతం |
25–08–2023 |
శుక్రవారం |
అర్బయిన్ (చాహల్లమ్) |
05–09–2023 |
మంగళవారం |
హజ్రత్ సయ్యద్ మహమ్మద్ జువాన్‌పురి మెహదీ పుట్టినరోజు |
09–09–2023 |
శనివారం |
మహాలయ అమావాస్య |
14–10–2023 |
శనివారం |
విజయదశమి (తిధిద్వయం) |
24–10–2023 |
మంగళవారం |
యాజ్–దహుమ్–షరీఫ్ |
26–10–2023 |
గురువారం |
కార్తీకపూర్ణీమ/గురునానక్ జయంతి |
27–11–2023 |
సోమవారం |
క్రిస్మస్ ఈవ్ |
24–12–2023 |
ఆదివారం |
బాక్సింగ్ డే |
26–12–2023 |
మంగళవారం |