Orange Alert.. Schools Holidays Extended 2023 : అలెర్డ్.. స్కూల్స్, కాలేజీలకు సెలవులు పొడిగించే అవకాశం.. అలాగే ఆఫీస్‌లకు కూడా..?
హైదరాబాద్ నగరంలో భారీ వర్ష సూచన నేపథ్యంలో ఐటీ కారిడార్‌లో ఆగస్టు 1 వరకు లాగౌట్‌ను పొడిగిస్తూ సైబరాబాద్ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పరకుండా.. 3 దశలుగా విధుల ముగింపు వేళలు ఉండాలని పేర్కొంది.
పని వేళలు ఇలా..
☛ఫేజ్ 1 : ఐకియా నుంచి సైబరాబాద్ టవర్స్ వరకు ఉండే ఐటీ ఆఫీసులు సాయంత్రం 3 గంటలకు లాగ్ ఔట్ చేసుకోవాలని తెలిపింది.
☛ ఫేజ్ 2 : ఐకియా నుంచి బయో డైవర్సిటీ, రాయదుర్గం వరకు ఉండే ఐటీ ఆఫీసులు సాయంత్రం 4:30 గంటలకు లాగ్ ఔట్ చేసుకోవాలని పేర్కొంది.
☛ ఫేజ్ 3 : ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఉండే ఐటీ ఆఫీసులు సాయంత్రం 3 నుంచి 6 గంటల వరకు లాగ్ ఔట్ చేసుకోవాలని చెప్పింది.
నగరాలు, పట్టణాలు, గ్రామాలనే తేడా లేకుండా..
యాదాద్రి, మంచిర్యాల, పెద్దపల్లి, ఆదిలాబాద్, భద్రాద్రి, జగిత్యాల, కరీంనగర్, వనపర్తి జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్ ప్రకటించింది. ఎడతెరిపిలేని వానలతో రాష్ట్రం తడిసి ముద్దవుతోంది. ఆకాశం చిల్లులు పడిందా అన్నట్టుగా వానలు పడుతున్నాయి. నగరాలు, పట్టణాలు, గ్రామాలనే తేడా లేకుండా ఎక్కడ చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. ఇప్పుడీ వానలు మరింత ముదురుతున్నాయి.
➤☛ టిఎస్ టెన్త్ క్లాస్ : మోడల్ పేపర్స్ 2023 | టైం టేబుల్ 2023 | ముఖ్యమైన ప్రశ్నలు | స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్
మరో మూడు రోజులు వానలు..సెలవులు పొడిగించే అవకాశం..?
రాష్ట్రవ్యాప్తంగా మరో మూడు రోజులు కుండపోత వానలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో.. ప్రభుత్వం ఇప్పటికే కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో జూలై 26, 27 తేదీల్లో (నేడు, రేపు) విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే స్కూల్స్, కాలేజీలకు కూడా సెలవులు పొడిగించే అవకాశం ఉంది. ఇప్పటికే తెలంగాణలో వరుసగా నాలుగు రోజులు పాటు సెలువుల ఇచ్చిన విషయం తెల్సిందే. ఈ భారీ వర్షాలతో ఇప్పటికే కేరళ, కర్నాటకలో స్కూల్స్‌లకు అక్కడి ప్రభుత్వం సెలవులను ప్రకటించింది.
ఈ మేరకు రాష్ట్రమంతా రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఉమ్మడి నిజామాబాద్, వరంగల్, మెదక్, నల్లగొండ జిల్లాల పరిధిలో పలుచోట్ల అతి భారీ వర్షాలు కురిశాయి. నిజామాబాద్ జిల్లాలో అయితే రికార్డు స్థాయిలో వానలు పడ్డాయి. ఇక రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌నూ వాన వణికిస్తోంది. రోడ్లపై నీళ్లు నిలవడంతో వాహనాల ట్రాఫిక్ ఇబ్బందిగా మారింది.
Tags
- Telangana Rain News
- office holidays due to rain 2023
- telangana schools holidays due to rain
- holidays extension in telangana 2023 due to rain
- school holidays
- heavy rain due school holidays
- Heavy rains
- heavy rain due to it office timings changes
- due to heavy rain schools holidays
- Schools and Colleges Closed 2023
- Schools and Colleges Holiday due rain