డిగ్రీ ఏదైనా.. ఇతర పీజీ కోర్సులు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. National Education Policy (NEP–2020) అమలులో భాగంగా ఈ నిర్ణయం తీసుకు న్నట్లు డైరెక్టర్ ప్రొ.జీబీ రెడ్డి తెలిపారు. ఇంజనీరింగ్, టెక్నాలజీ, మెడికల్, సైన్స్, ఫార్మసీ, బీఈడీ, బీపీడీ, ఎల్‌ఎల్‌బీ, బీఏ, బీబీఏ, బీకాం తదితర డిగ్రీలు పూర్తి చేసిన విద్యార్థు లకు ఎంఏ (సైకాలజీ, ఇంగ్లిష్, సంస్కృతం, తెలుగు) కోర్సులతోపాటు సోషల్ సైన్సెస్ (చరిత్ర, ఎకానమిక్స్, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, ఫిలాసఫీ, పబ్లిక్ అడ్మిస్ట్రేషన్ వంటి కోర్సులు) లో ప్రవే శాలు కల్పించనున్నట్లు వివరించారు.