MANUU: దూరవిద్య కోర్సులకు ప్రవేశాలు.. చివరి తేదీ ఇదే..
ఈ విద్యా సంవత్సరం నుంచి MA History, MA Hindi, MA Arabic కోర్సులను నిర్వహించడానికి యూజీసీ అనుమతించిందన్నారు. UGC మార్గదర్శకాల ప్రకారం విద్యార్థులు ఇప్పుడు ఏకకాలంలో ఏదైనా రెండు కోర్సుల ప్రోగ్రామ్‌లలో నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించారన్నారు. ప్రస్తుతం ఎంఏ (ఉర్దూ, హిందీ, అరబిక్, ఇంగ్లీష్, హిస్టరీ, ఇస్లామిక్ స్టడీస్) బీఏ బికామ్, డిప్లోమో( ఇంగ్లిష్ అండ్ జర్నలిజమ్, మాస్ కమ్యూనికేషన్ టీచ్)లో ప్రవేశాలు అందుబాటులో ఉన్నాయన్నారు. 2022–23 సెషన్‌కు జూలై 2022లో ఇంగ్లిష్ అండ్ ఫంక్షనల్ ఇంగ్లిష్ ద్వారా ఉర్దూలో ప్రావీణ్యం సర్టిఫికెట్ కోర్సును కూడా అందుబాటులో ఉంచామన్నారు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను సమర్పించడానికి అక్టోబర్ 20 చివరి తేదీగా నిర్దారించినట్లు పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు స్టూడెంట్ సపోర్ట్ యూనిట్ హెల్ప్‌లైన్ 040–23008463, 23120600లో సంప్రదించవచ్చని ఆయన పేర్కొన్నారు.
చదవండి: