Skip to main content

దూరవిద్య అభ్యర్థులకు టీఎస్‌పీఎస్సీ ఓటీఆర్‌ కష్టాలు

TSPSC OTR difficulties for distance education candidates
దూరవిద్య అభ్యర్థులకు టీఎస్‌పీఎస్సీ ఓటీఆర్‌ కష్టాలు

దూరవిద్య (ఓపెన్)లో టెన్త్, ఇంటర్‌ చదివిన అభ్యర్థులను టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో వన్ టైమ్‌ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్‌) కష్టాలు వెంటాడుతున్నాయి. ఓటీఆర్‌లో ‘ఓపెన్’కు సంబంధించిన ఆప్షన్ కనిపించకపోవడంతో ఈ అభ్యర్థులకు రిజ్రిస్టేషన్ ప్రక్రియ కష్టమైపోయింది. అభ్యర్థి ఆధార్‌ కార్డు వివరాలతో వెబ్‌సైట్‌లో ఎంట్రీ చేయగానే పాఠశాల, కళాశాల విద్యకు సంబంధించిన వివరాలను నమోదు చేయాలని సూచిస్తోంది. కానీ దూరవిద్యలో కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులకు పాఠశాలలో, కళాశాలలో చదివిన నేపథ్యం లేకపోవడంతో నిర్దేశించిన ఆప్షన్లను పూరించలేని పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో ఓటీఆర్‌ ప్రక్రియలో ముందు కు సాగలేకపోతున్నారు. నోటిఫికేషన్లు వెలువడితే ఓటీఆర్‌ లేని అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండదు. మరోవైపు ఓపెన్ అభ్యర్థులూ ఓటీఆర్‌కు అర్హులేనని టీఎస్‌పీఎస్సీ వర్గాలు చెబుతున్నాయి. వివరాల నమోదు సమయంలో వచ్చే పేజీని కొనసాగిస్తే సరిపోతుందంటున్నారు. కానీ రిజ్రిస్టేషన్ సాగట్లేదని అభ్యర్థులు చెబుతున్నారు.

చదవండి: 

గ్రూప్‌-1,2,3,4 ప్రీవియ‌స్ కొశ్చన్‌ పేప‌ర్స్ కోసం క్లిక్ చేయండి​​​​​​​

పోటీ ప‌రీక్ష‌ల బిట్‌బ్యాంక్ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి

​​​​​​​టీఎస్‌పీఎస్సీ సిలబస్

టీఎస్‌పీఎస్సీ ప్రివియస్‌ పేపర్స్

టీఎస్‌పీఎస్సీ ఆన్‌లైన్ క్లాస్

టీఎస్‌పీఎస్సీ ఆన్‌లైన్ టెస్ట్స్

Published date : 12 Apr 2022 05:25PM

Photo Stories