Skip to main content

OU: ఆర్ట్స్‌ కాలేజీలో బీఏ కోర్సు!

Osmania University క్యాంపస్‌ ఆర్ట్స్‌ కాలేజీలో బీఏ డిగ్రీ కోర్సును ప్రవేశ పెట్టనున్నారు.
BA Course in OU Arts College
ఓయూ ఆర్ట్స్‌ కాలేజీలో బీఏ కోర్సు!

సెంట్రల్‌ యూనివర్సిటీ మాదిరి Integrated Master of Arts (IMA) ఐదేళ్ల బీఏ డిగ్రీ కోర్సులను పెట్టేందుకు ఇటీవల జరిగిన డీన్ల సమావేశంలో వీసీ ప్రొఫెసర్‌ రవిందర్‌ చర్చించారు. మొదటి మూడేళ్ల బీఏ డిగ్రీ చదివే విద్యార్థులు ఆసక్తి ఉంటే ఎంఏ కోర్సును లేదంటే డిగ్రీతోనే సరిపెట్టుకునేలా కోర్సును రూపొందించనున్నారు. గతేడాది కోఠి మహిళా కాలేజీ, నిజాం కాలేజీలో ప్రవేశపెట్టిన బీఏ ఆనర్స్‌ కోర్సు విజయవంతంగా కొనసాగడంతో యూనివర్సిటీ క్యాంపస్‌ కాలేజీల్లో సైతం ఐదేళ్ల డిగ్రీ కోర్సులను ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నారు. ఆర్ట్స్‌ కాలేజీతో పాటు యూనివర్సిటీ క్యాంపస్‌ కామర్స్‌ అండ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ కాలేజీలో బీబీఏ+ఎంబీఏ, న్యాయకళాశాలలో బీఏ లేదా బీకాం+ఎల్‌ఎల్‌బీ ఐదేళ్ల కోర్సులను ప్రవేశపెట్టాలని డీన్ల సమావేశంలో చర్చించారు. 

చదవండి: 

OU PG కోర్సుల పరీక్షల ఫీజు చెల్లింపు గడువు పెంపు

800 మంది పూర్వ విద్యార్థుల పీహెచ్‌డీలు రద్దు?

Published date : 28 Sep 2022 03:38PM

Photo Stories