అంగన్‌వాడీ కేంద్రాలు అప్‌గ్రేడ్
తొలగనున్న ఇబ్బందులు
మినీ అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో తక్కువ కుటుంబాలు ఉండడం, సెంటర్లు రెవెన్యూ గ్రామాలకు దూరంగా ఉండడంతో లబ్ధిదారులకు పౌష్టికాహారం అందించడం సిబ్బందికి కష్టంగా మారింది.సాధారణంగా ఒక మినీ అంగన్‌వాడీ కేంద్రం పరిధిలో ఆయా, టీచర్ బాధ్యతలు ఒక్కరే నిర్వర్తించాలి.
దీంతో కేంద్రాల పరిధిలో కుటుంబాల సంఖ్య పెరుగుతూ వస్తున్న కొద్దీ టీచర్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మినీ అంగన్‌వాడీ కేంద్రాల స్థాయి పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సమస్యలు తీరనున్నాయి. లబ్ధిదారులకు మెరుగైన సేవలు అందనున్నాయి.
చదవండి: Anganwadi Employees: అంగన్‌వాడీలకు వేరే బాధ్యతలు వద్దు
టీచర్లు, హెల్పర్లకు శుభవార్త
అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు ప్రభుత్వం శుభవార్త వినిపించింది. వీరి ఉద్యోగ విరమణ వయస్సు 65 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగ విరమణ తర్వాత టీచరుకు రూ.లక్ష,, ఆయాకు రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం ప్రభుత్వం అందించనుంది. జిల్లా పరిధిలో భువనగిరి, ఆలేరు, రామన్నపేట, మోత్కూర్ ఐసీడీఎస్ సర్కిళ్ల పరిధిలో 844 ప్రధాన కేంద్రాలు, 57 మినీ కేంద్రాలు ఉన్నాయి.
ఆయా సెంటర్లలో పని చేస్తున్న టీచర్లు, హెల్పర్లందరికీ ఉద్యోగ విరమణ వయస్సు వర్తించనుంది. అధికారులు వారి నుంచి వయస్సు, ధ్రువీకరణ పత్రాలను కూడా స్వీకరించారు. ప్రభుత్వం నుంచి రెండు, మూడు రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నాయి.
చదవండి: Padma Basavanthappa, IAS: స్కూళ్లు, అంగన్‌వాడీల్లో తనిఖీ