Anganwadi Employees: అంగన్‌వాడీలకు వేరే బాధ్యతలు వద్దు
జిల్లా అంగనవాడి ఉద్యోగుల సంఘం అధ్యక్షురాలు అంజినమ్మ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలకు ఇంటింటికి వెళ్లి లబ్ధిదారుల సమాచారాన్ని సేకరించే బాధ్యతలను అంగనవాడీ కార్యకర్తలకు అప్పగిస్తున్నందున వారిపై పని భారం పెరుగుతోందన్నారు. విధి నిర్వహణలో ఒత్తిళ్లతో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. విధుల నుంచి సస్పెండు చేసిన అంగన్‌వాడీ కార్యకర్తలను తిరిగి విధుల్లోకి తీసుకోవాలన్నారు.
Also read: Diet Cet – 2023: అర్హత సాధించిన విద్యార్థులకు మరో అవకాశం
రాష్ట్రంలో పిల్లల్లో అపౌష్టికత, రక్తహీనత నివారణకు అంగన్‌వాడీ కార్యకర్తలకు వేరే బాధ్యతలను అప్పగించడాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయ సిబ్బంది ద్వారా ప్రభుత్వానికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ ఉద్యగుల సంఘం ప్రముఖులు సరోజమ్మ, గాంధీనగర నారాయణస్వామి, సరోజమ్మ , లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు.
Also read: kids health tips: పిల్లల్లోనూ ఫ్యాటీ లివర్!