సీపెట్ ప్లాస్టిక్ డిప్లొమా కోర్సుల్లో అడ్మిషన్లు.. చివరి తేదీ ఇదే..
మూడేళ్ల కాలపరిమితి ఉండే డిప్లమా ఇన్ ప్లాస్టిక్స్ టెక్నాలజీ (డీపీటీ), డిప్లమా ఇన్ ప్లాస్టిక్స్ మౌల్డ్ టెక్నాలజీ (డీపీఎంటీ) కోర్సుల్లో పదో తరగతి ఉత్తీ్తర్ణులైనవారు, ప్రస్తుతం చదువుతున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. రెండేళ్ల వ్యవధి గల పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లమా ఇన్ ప్లాస్టిక్స్ ప్రాసెసింగ్ అండ్ టెస్టింగ్ (పీజీడీ–పీపీటీ) కోర్సులకు బీఎస్సీ ఉత్తీర్ణత లేదా చివరి సంవత్సరం చదువుతున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ లో దరఖాస్తుకు జూన్ 5 చివరి తేదీగా నిర్ణయించారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు విజయవాడ, అనంతపురం కేంద్రాల్లో జూన్ 19న సీపెట్ అడ్మిషన్ టెస్ట్ జరుగుతుంది. 6300147965, 9440531978 నంబర్లలో సంప్రదించాలి.
చదవండి:
Skill Development: కొలువులకు నిచ్చెన.. అప్రెంటీస్ శిక్షణ!
జర్నలిజంలో మూడు నెలల సర్టిఫికెట్ కోర్సు అందిస్తున్న ఏపీ ప్రెస్ అకాడమీ