ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) దూర విద్యా విభాగం పలు కోర్సులకు ఆహ్వనం పలుకుతోంది.
దూరవిద్య కోర్సులకు ఆహ్వానం
ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నత విద్య పూర్తి చేసేందుకు (డిస్టెన్స్ ఎడ్యుకేషన్) అవకాశం కల్పిస్తోంది. ఇందులో ఎంబీఏ, ఎంసీఏ, ఎంకాం, ఎంఏ, ఎంఎస్సీ (మేథమెటిక్స్, స్టాటిస్టిక్స్)తో పాటు బీఏ, బీకాం, కొన్ని డిప్లొమా కోర్సులను అందిస్తున్నట్లు ఓయూ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ జీబీ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి దశ అడ్మిషన్లకు డిసెంబర్ 15 చివరి తేదీగా పేర్కొన్నారు. http://www.oucde.net/ ద్వారా పూర్తి వివరాలు పొందవచ్చని చెప్పారు.