Skip to main content

Distance Education: ‘మనూ’ దూర విద్యాకోర్సుల గడువు పొడిగింపు

రాయదుర్గం: మౌలానా ఆజాద్‌ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయంలోని డైరెక్టరేట్‌ ఆఫ్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించే ఫాలో–ఆన్‌ కోర్సు నమోదు కోసం చివరి తేదీని పొడిగించినట్లు ఇన్‌చార్జి డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ మహ్మద్‌ రజావుల్లాఖాన్‌ గురువారం తెలిపారు.
‘manuu’ distance education
‘manuu’ distance education

గడువు తేదీని నవంబర్‌ 30 వరకు పొడింగించినట్లు ఆయన పేర్కొన్నారు. 2019 బ్యాచ్‌ సెమిస్టర్‌ ప్రోగ్రామ్‌ 1,3,4 సెమిస్టర్‌లలో మాత్రమే ఫీజు చెల్లించవలసి ఉంటుందని, రిజి్రస్టేషన్‌ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. రిజిస్ట్రేషన్, ఫీజు వివరాల కోసం విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌లో చూడవచ్చు.  
 

ఎడ్యుకేషన్‌ న్యూస్‌  ఎడ్యుకేషన్‌ న్యూస్‌

Published date : 19 Nov 2021 04:02PM

Photo Stories