కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధి దూర విద్యాకేంద్రం బీఎల్‌ఐస్సీ పరీక్షలు అక్టోబర్ 31 నుంచి నిర్వహించనున్నారు.
కేయూ దూరవిద్య బీఎల్‌ఐఎస్సీ పరీక్షలు తేదీలు ఇవే..
ఈమేరకు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య పి.మల్లారెడ్డి టైంటేబుల్‌ను విడుదల చేశారు. అక్టోబర్ 31న పేపర్–1, నవంబర్ 2న పేపర్–2, 4న పేపర్–3, 6న పేపర్–4, 8న పేపర్ –5, 10న పేపర్–6, 14న పేపర్–7 పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో పరీక్షలు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా బీఎల్‌ఐఎస్సీ పరీక్షలు, ప్రాక్టికల్స్ నవంబర్ 15, 16, 17 తేదీల్లో నిర్వహిస్తారని ఆయన తెలిపారు. చదవండి: