IGNOU: జూన్–23 టర్మ్ ఎండ్ పరీక్ష ఫీజు గడువు పెంపు
Sakshi Education
వన్‌టౌన్ (విజయవాడ పశ్చిమ): ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) జూన్ – 2023 టర్మ్ ఎండ్ పరీక్షకు రూ.1,100 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 30 వరకు గడువును పొడిగించినట్లు ఇగ్నో విజయవాడ ప్రాంతీయ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ సుమలత తెలిపారు.
జూన్–23 టర్మ్ ఎండ్ పరీక్ష ఫీజు గడువు పెంపు
అసైన్‌మెంట్ సమర్పించే తేదీని 30 వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. ఇగ్నో స్నాతకోత్సవానికి సంబంధించి ఒరిజినల్ డిగ్రీని స్వయంగా తీసుకోవటానికి రూ.600 ఇగ్నో విజయవాడ పేరున డీడీ, ఐడీ కార్డ్ తీసుకొని, ప్రాంతీయ కార్యాలయం పని వేళల్లో సంప్రదించాలని తెలిపారు. పూర్తి వివరాలకు విజయవాడ కొత్తపేటలోని ఇగ్నో ప్రాంతీయ కేంద్రాన్ని, లేదా 0866–2565253 ఫోన్ నంబర్‌లో సంప్రదించాలన్నారు.