IGNOU: బీఎడ్, బీఎస్సీ నర్సింగ్ ప్రవేశ పరీక్ష దరఖాస్తుకు చివరి తేదీ ఇదే.. కొత్త కోర్సు ప్రారంభం..
ఇంది రాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవి ద్యాలయం (ఇగ్నో) బీఎడ్, బీఎస్సీ న ర్సింగ్ కోర్సుల ప్రవేశపరీక్షకు ఏప్రిల్ 17లోగా ఆన్ లైన్ లో దరఖాస్తులు ఆహా్వనిస్తున్నట్లు ఇగ్నో విజయవాడ ఇన్ చార్జ్ సంచాలకులు కె.సుమలత తెలిపారు.
కొత్త కోర్సును ప్రారంభించిన ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ
ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (IGNOU) బ్యాంకింగ్, ఫైనాన్స్‌లో మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (MBA) కోర్సును ప్రారంభించింది.ఈ కోర్సును AICTE ఆమోదించింది. అర్హులైన అభ్యర్థులు జూలై సెషన్ కోసం ఇగ్నో అధికారిక వెబ్‌సైట్ http://ignou.ac.in/లో అడ్మిషన్ తీసుకోవచ్చు. ఇగ్నో ప్రత్యేకంగా MBA కోర్సును ప్రవేశపెట్టింది. ప్రస్తుత పరిశ్రమ-విద్యా అవసరాలకు అనుగుణంగా ఈ కోర్సును పొందించారు. 50 శాతం మార్కులు ఉన్న జనరల్ కేటగిరీ అభ్యర్థులు, 45 శాతం మార్కులు ఉన్న రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులు ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చు.
కోర్సులో ప్రవేశం కోసం యూనివర్సిటీ ద్వారా ఎటువంటి ప్రవేశ పరీక్ష ఉండదు. MBA కోర్సు ఐదు స్పెషలైజేషన్‌లను అందిస్తుంది. మానవ వనరుల నిర్వహణ, ఆర్థిక నిర్వహణ, మార్కెటింగ్ నిర్వహణ, సేవా నిర్వహణ, ఫైనాన్స్ నిర్వహణ ఉన్నాయి. ప్రోగ్రామ్ కనీస వ్యవధి 2 సంవత్సరాలు గరిష్టంగా 4 సంవత్సరాలు ఉంటుంది.