Skip to main content

IGNOU Admission: ఇగ్నో దరఖాస్తుల గడువు పొడిగింపు

ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) అందించే వివిధ కోర్సులకు సంబంధించి జనవరి–2022 విద్యా సంవత్సరానికి సంబంధించి దరఖాస్తులు పంపేందుకు ఫిబ్రవరి 10వ తేదీ వరకు గడువును పొడిగించినట్లు ఇగ్నో విజయవాడ ప్రాంతీయ కేంద్రం ఇన్ ఛార్జి రీజనల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కె.సుమలత పేర్కొన్నారు.
IGNOU Admission
ఇగ్నో దరఖాస్తుల గడువు పొడిగింపు

తమ రీజియన్ పరిధిలోని కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని స్టడీ సెంటర్లకు సంబంధించి జనవరి–2022 నుండి ప్రారంభమయ్యే విద్యా సంవత్సరానికి ఆన్ లైన్ ద్వారా పోస్ట్‌ గ్రాడ్యుయేషన్, డిగ్రీ, పీజీ డిప్లొమో, డిప్లొమో, సర్టిఫికెట్‌ కోర్సులకు దరఖాస్తుల స్వీకరణ కోసం ఫిబ్రవరి 10వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు ఆమె పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు ఆయా జిల్లాల్లో ఉన్న స్టడీ సెంటర్లలో కానీ, విజయవాడ కొత్తపేట హిందూ హైస్కూల్‌ ప్రాంగణంలో ఉన్న ఇగ్నో విజయవాడ ప్రాంతీయ కేంద్రంలో కానీ సంప్రదించాలని కోరారు. అలాగే 0866–2565253 ఫోన్ నంబర్‌ ద్వారా కూడా సంప్రదించవచ్చని తెలిపారు.

చదవండి: 

Non-Teaching posts: ఇగ్నోలో నాన్‌టీచింగ్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

IGNOU: కొత్త కోర్సును ప్రారంభించిన ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ

Published date : 03 Feb 2022 02:50PM

Photo Stories