Skip to main content

BRAOU: అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీకి న్యాక్ గుర్తింపు

హైద‌రాబాద్‌లోని డా.బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కమిటీ నుంచి గుర్తింపు లభించింది.
BRAOU
అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీకి న్యాక్ గుర్తింపు

 జూలై  నెలలో యూనివర్సిటీని సందర్శించిన న్యాక్ కమిటీ 2.96 గ్రేడ్ పాయింట్లతో బీ2 ప్లస్ గ్రేడ్‌ను కేటాయించింది. అయితే న్యాక్ అసెస్‌మెట్‌కు మొదటిసారిగా దరఖాస్తు చేసుకున్న అంబేడ్కర్ వ‌ర్సిటీకి 0.04 పాయింట్ల తేడాతో ఏ గ్రేడ్ ను కోల్పోయింది.

ఓపెన్‌ డిగ్రీ అడ్మిషన్‌ గడువు పెంపు

డాక్టర్‌ బీఆర్‌.అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్‌ పొందుటకు ఆగ‌స్టు 16వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు నల్లగొండలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలోని దూరవిద్య కోఆర్డినేటర్‌ డాక్టర్‌ సుంకరి రాజారాం ఆగ‌స్టు 3న‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్‌ సమాన అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు సెల్‌ : 7382929758, 8919436579 నంబర్లను సంప్రదించాలని కోరారు.

Published date : 04 Aug 2023 05:22PM

Photo Stories