Skip to main content

Rushikesh Reddy, IPS : నా ల‌క్ష్యాన్ని నిజం చేసుకున్నానిలా.. దీని కోసం..

సివిల్స్ పరీక్షలలో జాతీయ స్థాయిలో రిషికేశ్ రెడ్డి 95వ ర్యాంక్ సాధించడం పట్ల చాలా సంతోషంగా ఉందని ఆయన తండ్రి సుబ్బారెడ్డి అన్నారు.
Rushikesh Reddy
Rushikesh Reddy With Family

ఈ మేరకుఆయన సాక్షిటీవీతో మాట్లాడుతూ.. ’చిన్నప్పటి నుంచి రిషి చదువులో ముందుండే వాడు. మొదటి ప్రయత్నంలోనే ఇంటర్వూ వరకు వెళ్లాడు. నాలుగో ప్రయత్నంలో అనుకున్న ర్యాంకు సాధించాడు. వైఎస్సార్ కడప జిల్లాలోని పులివెందుల నియోజకవర్గం నుంచి సివిల్స్ సాధించిన రెండో వ్యక్తి మా అబ్బాయి కావడం సంతోషంగా ఉంది. గతంలో ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీసెష్ సాధించినప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జగన్ అభినందించారు. ఆ స్ఫూర్తితోనే సివిల్స్‌లో 95వ ర్యాంకు సాధించాడని’ సుబ్బారెడ్డి తెలిపారు.

ఉన్న‌త స్థాయిలో..

IPS Rushikesh Reddy


కష్టపడి చదివి ఉన్నత స్థానాలను అధిరోహించాలి.. పది మందికి సేవ చేసే భాగ్యం దక్కించుకోవాలనే లక్ష్యంతోనే చదివాడు. ఆ ఆశయం సాధించేవరకు విశ్రమించకుండా తల్లిదండ్రుల మాటను తప్పకుండా పాటించి విజయం సాధించారు. ప్రణాళికాబద్ధంగా చదివి సివిల్స్ పరీక్షలలో జాతీయస్థాయిలో 95వ ర్యాంక్ సాధించారు. చిన్న నాటి నుంచి మంచి ఉద్యోగం సాధించాల‌నే కలను నెరవేర్చుకున్నారు. నాలుగుసార్లు పట్టు వదలకుండా సివిల్స్‌కు ప్రిపేర్ అయి  తన కలను నెరవేర్చుకున్నారు వేంపల్లెకు చెందిన సింగారెడ్డి రిషికేశ్‌రెడ్డి. వేంపల్లెకు చెందిన సింగారెడ్డి సుబ్బారెడ్డి, సుజాత దంపతుల కుమారుడు రిషికేశ్‌రెడ్డి.

చ‌దువు..: 

Father and Mother


ప్రస్తుతం వీరు కడప నగరం హౌసింగ్ బోర్డు కాలనీలో ఉంటున్నారు. ఇతడు ఒకటవ తరగతి నుంచి 5వ తరగతి వరకు వేంపల్లెలోని శ్రీచైతన్య ఉన్నత పాఠశాలలో చదివాడు. 6, 7 తరగతులు తిరుపతి విద్యానికేతన్ స్కూల్‌లోనూ, 8వ తరగతి నుంచి ఇంటర్ వరకు హైదరాబాద్‌లో చదివాడు. 10వ తరగతిలో 537మార్కులు సాధించాడు. ఇంటర్ ఎంపీసీ విభాగంలో 961మార్కులు సాధించారు. ఎంసెట్, జేఈఈ పరీక్ష రాసి ఎంసెట్‌లో 116వ ర్యాంక్, జేఈఈలో జాతీయస్థాయిలో 153వ ర్యాంక్ సంపాదించాడు. జేఈఈ ర్యాంక్‌లో రిషికేశ్ ఢిల్లీ ఐఐటీలో సీటును దక్కించుకున్నాడు.

ఇంజినీరింగ్ చదువుతూనే..

Education


సివిల్ సర్వీసెస్‌లో విజయం సాధించాలని రిషికేశ్‌రెడ్డి తపన పడేవాడు. ఢిల్లీ ఐఐటీలో ఇంజనీరింగ్ కోర్సు చేరాక.. ఎలాగైన ఉన్న‌త స్థాయి ఉద్యోగం సాధించాల‌నే.. తపన అతనిలో మొదలైంది. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు చెబుతున్న మాటలు నిరంతరం గుర్తు పెట్టుకునేవాడు. ఉన్నత స్థానం చేరాలని కలలుకనేవాడు. ఇంజినీరింగ్ చదువుతూనే సివిల్స్‌కు సిద్ధమయ్యాడు. సివిల్స్ సాధించాలనే లక్ష్యంతో రోజుకు 8గంటలపాటు ప్రణాళికాబద్ధంగా చదివాడు. మానసిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు టీవీల్లో వచ్చే వివిధ ఆటల పోటీలను చూస్తుండేవాడు. 2015లో మొదటిసారి సివిల్స్ పరీక్ష రాసి ఇంటర్వ్యూ వరకు వెళ్లాడు.

లోపాలను..
2016లో రెండవసారి పరీక్ష రాయగా ఎంపిక కాలేదు. తర్వాత ఎక్కడ మార్కులు తగ్గాయని.. వాటి లోపాలను విశ్లేషించుకుని అధిగమించే ప్రయత్నం చేశాడు. 2017లో సివిల్స్ పరీక్ష రాసి జాతీయస్థాయిలో 374వ ర్యాంక్ సాధించారు. ఇండియన్ రైల్వే సర్వీస్‌లో ఉద్యోగం పొందారు. ఏడాదిపాటు ట్రైనింగ్‌లో ఉంటూ పట్టువదలని విక్రమార్కుడిలా చదివి నాల్గవసారి సివిల్స్ పరీక్షను రాసి జాతీయస్థాయిలో 95వ ర్యాంక్ సాధించాడు. జిల్లా ఖ్యాతిని నిలిపి విజేతగా నిలిచాడు. మూడుసార్లు ప్రయత్నించి ర్యాంక్ రాలేదని నిరుత్సాహపడి ప్రయత్నాలను ఆపేయకూడదని.. మళ్లీ పట్టుదలతో ప్రయత్నం చేసి విజయం సాధించారు. ఇటీవ‌లే మ‌హారాష్ట్ర కేడ‌ర్‌కు ఐపీఎస్‌గా కేటాయించారు.

Biodata of Rushikesh Reddy:
Name: Rushikesh Reddy
Age: 26
Name of the Exam and Year: Civil services examination, 2019
Rank: 95
Roll number: 1011683
Category (General/OBC/SC/ST): General
☛  Graduation Background and College: Btech in Electrical Engineering at IIT Delhi.
☛  UPSC Optional Subject: Electrical Engineering
☛  UPSC Mains Medium: English
☛  UPSC Interview Medium: English
☛  The number of attempts taken to achieve this feat: 5
☛  Performance in previous attempts (if any): 374 Rank in CSE, 2017
☛  State and Place of Residence (Permanent): Andhra Pradesh
☛  Percentage of Marks in 10th and Board: 89.5%
☛  Percentage of Marks in 12th and Board: 96.1%
☛  Percentage of Marks in Graduation and Board/University: 7.2 GPA
  Service Preference (Top 5): IAS, IPS, IFS, IRS (IT), IRS(C&CE)
☛  Cadre Preference (Top 5): AP, Maharashtra, Odissa, UP.

Ramesh Gholap,IAS officer: మాది నిరుపేద కుటుంబం.. పొట్ట కూటి కోసం గ్రామాల్లో గాజులు అమ్మి..

IAS Lakshmisha Success Story: పేపర్‌బాయ్‌ టూ 'ఐఏఎస్‌'..సెలవుల్లో పొలం పనులే...

Success Story: తొలి ప్రయత్నంలోనే..ఎలాంటి కోచింగ్‌ లేకుండా..22 ఏళ్లకే సివిల్స్‌..

Civils Ranker Srija Success Story: ఈ ఆశయంతోనే సివిల్స్‌ వైపు..నా స‌క్సెస్‌కు కార‌ణం వీరే..

IAS Officer, IAS : నిత్యం పాలమ్మితే వ‌చ్చే పైసలతోనే ఐఏఎస్‌ చ‌దివా..ఈ మూడు పాటిస్తే విజయం మీదే :యువ ఐఏఎస్‌ డాక్టర్‌ బి.గోపి

Veditha Reddy, IAS : ఈ సమస్యలే న‌న్ను చదివించి..ఐఏఎస్ అయ్యేలా చేశాయ్‌...

Srijana IAS: ఓటమి నుంచి విజయం వైపు...కానీ చివరి ప్రయత్నంలో..

Chandrakala, IAS: ఎక్క‌డైనా స‌రే..‘తగ్గేదే లే’

Published date : 14 Feb 2022 06:36PM

Photo Stories