Skip to main content

ఎక్కడా కోచింగ్‌ తీసుకోలేదు..సొంతం ప్రిప‌రేషన్‌తోనే ఐపీఎస్..

‘విద్యతోనే దేశాభివృద్ధి సాధ్యం.. బాలికలు చదువుకుంటే ఆ కుటుంబంతో పాటు సమాజం అభివృద్ధి చెందుతుందని, పోలీస్‌ శాఖలో మరింత మంది మహిళలు రావాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం పోలీస్‌శాఖలోకి మహిళలు రావడానికి వెనుకంజ వేస్తున్నారు.
Bhishma Qazi, IPS
Bhishma Qazi, IPS

అలాంటి వారిని ప్రోత్సహించేందుకే నేను ఐపీఎస్‌ ఎంచుకున్నా’ అని జమ్ము కాశ్మీర్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారిణి బిస్మాఖాజీ అన్నారు. జమ్మూకాశ్మీర్‌ నుంచి ఐపీఎస్‌కు ఎంపికైన మహిళల్లో బిస్మా రెండోవారు ప్రస్తుతం ఆ రాష్ట్రం నుంచి షీమా నబి అనే మహిళ ఐపీఎస్‌ అధికారిణి ఉన్నారు.

ఇంట్లోనే శిక్షణ...
నేను ఎక్కడా కోచింగ్‌ తీసుకోలేదు. ఇంట్లోనే చదువుకునేదాన్ని. ఎక్కువగా పత్రికలు చూసే దాన్ని. టీవీ చూసే అలవాటు లేదు. పరీక్షలకు సిద్ధమవుతున్న సమయంలో సెల్‌ఫోన్‌ కూడా పక్కనపెట్టేశాను. సినిమాలు చూసే అలవాటు లేదు.

కాశ్మీర్‌ యూనివర్సిటీలో గోల్డ్‌మెడలిస్ట్‌...
కాశ్మీర్‌ యూనివర్సిటీలో ఇంజినీరింగ్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించా. గ్రూప్స్‌లో మొదటిసారి 115 వ ర్యాంకు వచ్చింది. ఐఏఎస్‌ కావాలని కలలు కన్నా. అయితే రెండో ప్రాధాన్యం ఐపీఎస్‌ తీసుకున్నాను. ప్రస్తుతం ఐపీఎస్‌ కావడమే ఆనందంగా ఉంది. నా తండ్రి షఫిఖాజీ వ్యాపారి, తల్లి హలీమా గృహిణి. చెల్లెలిని ఐఏఎస్‌ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాను.

స్నేహితులు తక్కువే...
నాకు పెయింటింగ్స్‌ వేయడం ఇష్టం. సమాజిక సేవాకార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నాను. ప్రస్తుతం రెండు స్వచ్ఛంద సంస్థలకు పని చేస్తున్నాను. స్నేహితులు చాలా తక్కువ.కుటుంబంతో ఎక్కువ గడుపుతాను. ఐపీఎస్‌కు ఎంపికైన తర్వాత ఎక్కువగా సామాజిక సేవా కార్యక్రమాల్లోనే పాల్గొంటాను.

ఒక ముస్లిం యువతి ఐపీఎస్ కావ‌డం...
మహిళలు పోలీస్‌శాఖలోకి రావడమే చాలా అరుదు. అందులోనూ జమ్మూకాశ్మీర్ ‌నుంచి ఒక ముస్లిం యువతి ఐపీఎస్‌ చేయడం మామూలు విషయం కాదు. మొదట్లో అందరూ నిరుత్సాహపరిచారు. అయితే శిక్షణ పొందుతున్న కొద్దీ దీని విలువ తెలుస్తోంది.

Published date : 11 Nov 2021 05:52PM

Photo Stories