Indian Forest Services Exam Results 2022 : ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఫలితాలు విడుదల.. ఫస్ట్ ర్యాంక్ మన తెలుగు విద్యార్థికే.. పూర్తి వివరాలు ఇవే..
Sakshi Education
సాక్షి ఎడ్యుకేషన్ : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్(ఐఎఫ్‌ఎస్) ఎగ్జామినేషన్-2022 తుది ఫలితాలను జులై 1వ తేదీ (శనివారం) విడుదల చేశారు.
దేశవ్యాప్తంగా మొత్తం 147 మందిని ఐఎఫ్ఎస్‌కు యూపీఎస్సీ ఎంపిక చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్లకు చెందిన కొల్లూరు వెంకట శ్రీకాంత్ మొదటి ర్యాంకు సాధించాడు. హైదరాబాద్‌కు చెందిన సాహితిరెడ్డికి 48, తొగరు సూర్యతేజకు 66వ ర్యాంకు వచ్చింది. జనరల్ క్యాటగిరీలో 39 మంది, ఈడబ్ల్యూఎస్- 21, ఓబీసీ 54, ఎస్సీ-22- ఎస్టీ 11.. మొత్తం 147 మంది అభ్యర్థులను ఎంపిక చేసింది.
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఫలితాలు-2022 పూర్తి వివరాలు ఇవే..
Published date : 01 Jul 2023 09:52PM
PDF