Women Success Story in Civils: జిల్లా స్థాయిలో యువతి.. సివిల్స్‌లో సాధించాలన్న ఆశయంతోనే..
దేశంలోనే అత్యున్నత సర్వీస్‌గా భావించే సివిల్ సర్వీసెస్ పరీక్షా ఫలితాల్లో జాతీయ స్థాయిలో షాద్‌నగర్ విద్యార్థిని సత్తా చాటింది. పట్టణానికి చెందిన ఇప్పలపల్లి శ్రీశైలం, లక్ష్మి దంపతుల కూతురు సుష్మిత ఆమె పదో తరగతి వరకు షాద్‌నగర్ పట్టణంలోని హెరిటేజ్ వ్యాలీలో చదివింది. అనంతరం హైదరాబాద్‌లోని పేజ్ కళాశాలలో ఇంటర్, అండర్ గ్రాడ్యుయేషన్‌ను వరంగల్‌లోలోని నిట్‌లో పూర్తి చేసింది. పబ్లిక్ సర్వీస్‌పై ఆసక్తి పెంచుకున్న ఆమె సివిల్స్‌లో నెగ్గాలనే పట్టుతో ప్రయత్నాలను ప్రారంభించింది.
UPSC Rankers: ఈ ఆశతోనే సివిల్స్‌లో సత్తా చాటారు విద్యార్థులు
ఎంతో ఇష్టంగా తన సివిల్స్ కోర్సును ప్రారంభించింది. పరీక్షల్లో మంచి ఫలితాలు తెచ్చుకున్నా, ఈ తరువాత నిర్వహించే ఇంటర్య్వూలో మెప్పించలేకపోయింది. అలా, గతంలో మూడుసార్లు ఇంటర్వ్యూకు చేరుకున్న ఈ యువతి.. తన గమ్యాన్ని చేరుకోలేకపోయింది. తాను చేసిన మూడు ప్రయత్నాలు విఫలం కాగా, మరింత రెట్టింపు ఉత్సాహంతో కృషి చేసి తిరిగి ప్రయత్నించింది. ఈ రకంగా ఆమె లక్ష్యాన్ని చేరే క్రమంలో నాలుగోసారి ప్రయత్నానికి సిద్ధపడింది.
ఇక నాలుగోసారి పరీక్షను రాసే సమయంలో శ్రమించి తనకు తానుగానే చదువుకొని, అనుకున్నది సాధించాలనే తపనతో పట్టుదల వీడలేదు. ఇక ఈ సారి పరీక్షల్లో నెగ్గడమే కాకుండా మంచి ర్యాంకు సాధించి. ఇంటర్య్వూలో కూడా మంచి విజయం పొందింది. మొత్తానికి అత్యుత్తమ ప్రతిభ కనబరిచి 384 ర్యాంకు సాధించింది. తన సివిల్స్ గమ్యాన్ని సాధించింది.
Tags
- latest civils success stories in telugu
- Success Stories
- inspirational success story in telugu
- upsc rankers success stories
- civils stories latest
- inspirational stories
- women success in civils
- Civils Rankers
- civils rankers in telangana
- CivilServicesPreparation
- civils success stories
- motivational story
- women inspiring story
- sakshi education success story