Inspirational Civil Rankers: సివిల్స్ కోసం ఈ ఇద్దరు యువకులు చేసిన మూడు ప్రయత్నాలు విఫలమే.. కాని!
'పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతూ పట్టుదలతో చదివితే ఏ పోటీ పరీక్ష అయినా సాధించొచ్చు.. అందుకు పేద, ధనిక భేదం లేదు.. ప్రతిభ, ప్రజ్ఞ ఉన్న ప్రతిఒక్కరూ విజయతీరాలకు చేరుకోవచ్చు' అని నిరూపించాడు కొత్తగూడెం జిల్లాకేంద్రానికి చెందిన గ్రందే సాయికృష్ణ.
యూపీఎస్సీ ప్రకటించిన ఫలితాల్లో 293 ర్యాంక్ సాధించి జిల్లాఖ్యాతిని ఇనుమడింపజేశాడు.
సివిల్స్‌లో సత్తాచాటిన ఉమ్మడి ఖమ్మం జిల్లా యువకులు సాయికృష్ణకు 293, సత్యసాయి మనోజ్‌కు 559 ర్యాంకు సాధించారు.
UPSC Rankers: ఈ ఆశతోనే సివిల్స్‌లో సత్తా చాటారు విద్యార్థులు
వీరు కొత్తగూడెంకు జిల్లాకు చెందిన యువకులు వారి కృషీ పట్టుదలతో ఈ విజయాన్ని దక్కించుకున్నారు. వారి గెలుపు ప్రయాణాన్ని తెలుసుకుందాం..
'పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతూ పట్టుదలతో చదివితే ఏ పోటీ పరీక్ష అయినా సాధించొచ్చు.. అని తన విజేతతో నిరూపించాడు కొత్తగూడెం జిల్లాకేంద్రానికి చెందిన గ్రందే సాయికృష్ణ. యూపీఎస్సీ విడుదల చేసిన ఫలితాలానుసారం తను 293 ర్యాంక్ సాధించి జిల్లాఖ్యాతిని ఇనుమడింపజేశాడు.
మొదటి ప్రయత్నంలో ఫలితం దక్కించుకోలేకపోయినా తన విశ్వాసంతో పట్టుదల వీడకుండా ప్రయత్నాలు చేశాడు. గతంలో మూడుసార్లు సివిల్స్ అటెంప్ట్ చేసి విఫలాన్ని అందుకున్నారు. అయినప్పటికీ నిరాశచెందకుండా చదివి తానేంటో ఫలితాల ద్వారా చాటి చెప్పాడు నలుగురికీ ఆదర్శంగా నిలిచాడు.
Success Story : వంటలు చేస్తూ.. రూ.750 కోట్లు సంపాదించానిలా.. కానీ..
కొత్తగూడెంలోని శ్రీనగర్‌కాలనీలో నివసిస్తున్న సాయి కృష్ణ తండ్రి శ్రీనివాస్ పట్టణంలోని ఓ లాడ్జి మేనేజర్ గా పని చేస్తున్నారు. తల్లి నాగలక్ష్మి గృహిణి. మధ్యతరగతి కుటుంబమైనా గొప్ప విజయాలను అందుకోవాలన్న ఆశ సాయి కృష్ణను ఈ స్థాయికి తెచ్చింది. వారు ఇప్పటికీ అద్దె ఇంట్లోనే నివాసం ఉంటున్నారు. కుమారుడు సాయికృష్ణ ఇప్పుడు ఆ కుటుంబ స్థితిగతులను మార్చే స్థాయికి ఎదిగాడు.
Success Story : మా అమ్మ ఇచ్చిన ఆ డబ్బుతోనే.. కోట్లు సంపాదించానిలా.. కానీ..
విద్యాభ్యాసం ఇలా..
సాయికృష్ణ మూడు నుంచి పదోతరగతి వరకు కొత్తగూడెంలోని సూర్యోదయ పబ్లిక్ స్కూల్లో, ఇంటర్మీడియట్ విజయవాడలోని శ్రీగాయత్రి జూనియర్ కాలేజీలో, బీటెక్ కేరళలోని ఎన్‌ఐటీలో పూర్తి చేశాడు. ఆ తర్వాత ఎల్‌అండ్‌టీ కంపెనీలో రెండేళ్ల పాటు ఉద్యోగం చేసి బయటకు వచ్చాడు. ఉద్యోగం వీడిన తరువాత తాను యూపీఎస్సీ సాధించాలని నిర్ణయించుకున్నాడు. ఇతరుతో శిక్షణ తీసుకోకుండా రోజుకు సుమారు 10 గంటల చొప్పున తానే పరీక్షకు సిద్ధమడ్డాడు. మూడేళ్లు కష్టపడి చదివాడు. యూపీఎస్సీ పాత ప్రశ్నపత్రాలు, ఆన్‌లైన్‌లో మోడల్ పేపర్స్‌తో స్వయంగా మాక్ టెస్ట్‌లు పెట్టుకునేవాడు. తానే ఏయే అంశాల్లో వెనుకబడ్డాడో గుర్తించి తిరిగి ప్రిపరేషన్ ప్రారంభించేవాడు. మొదటి సారి 2019లో సివిల్స్ రాసి మెయిన్స్‌కు అర్హత సాధించాడు. కానీ మెయిన్స్‌లో ఫలితం దక్కలేదు.
తరువాత రెండేళ్లు పరీక్షల్లో కావాల్సిన ఫలితం దక్కలేదు. అయినా సాయికృష్ణ కుంగిపోలేదు. రెట్టింపు కసితో చదివాడు. 2022లో సివిల్స్‌కు దరఖాస్తు చేశాడు. మే నెలలో ప్రిలిమ్స్ రాసి 200కి 120 మార్కులు సాధించి మెయిన్స్‌కు తిరిగి అర్హత సాధించాడు. ఇదే ఏడాది అక్టోబర్‌లో మెయిన్స్ రాసి ఫలితం దక్కించుకున్నాడు. అలా, ఇంటర్వ్యూకు ఎంపికయ్యాడు. ఇంటర్వ్యూలో సెలక్ట్ అయి చివరకు సివిల్స్ సాధించాడు. ఏకంగా 293వ ర్యాంకు సాధించి సత్తా చాటాడు. అనుకున్న విధంగా ర్యాంకు సాధించి గొప్ప విజయాన్ని అందుకున్న సాయికృష్ణను కొత్తగూడెంకి చెందిన భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఫెల్లోషిప్ సంస్థ ప్రతినిధులు సన్మానించారు. అందరి అభినందనలు పొందాడు.
Success Story : కూలీ కొడుకు.. వందల కోట్లకు అధిపతి.. ఎలా అంటే..?
సత్యసాయి మనోజ్‌కు 559 ర్యాంక్
యూపీఎస్సీ ప్రకటించిన ఫలితాల్లో అనంతారం గ్రామానికి చెందిన వినుకొండ ఈశ్వర సత్యసాయి మనోజ్ 559వ ర్యాంకు సాధించాడు. గతేడాది సివిల్స్ ఫలితాల్లో 615వ ర్యాంక్ సాధించిన సత్యసాయిమనోజ్ ప్రస్తుతం మహారాష్ట్రలోని నాగపూర్‌లో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఇన్‌కం ట్యాక్స్ ఆఫీసర్‌గా శిక్షణ పొందుతున్నాడు. ఈ ఏడాది మరోసారి సివిల్స్ రాసి మరో అడుగు ముందుకేసాడు. 559వ ర్యాంకు సాధించాడు. తండ్రి వెంకటేశ్వర్లు పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో డీఎస్పీగా పని చేసి ఉద్యోగ విరమణ పొందారు. ప్రస్తుతం వారి కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడింది. సత్యసాయి మనోజ్ సివిల్స్‌లో ఉత్తమ ర్యాంక్ సాధించినందుకు అనంతారం గ్రామస్తులు అభినందనలు తెలిపారు.
success story: చదువుతూనే క్రీడల్లో సాధించింది ఎన్నో పతకాలు.. ఎలా అంటే..
తాను గెలుచుకున్నా ఈ ర్యాంకు వెనుక ఉన్న కృషి గురించి మాట్లాడాడు మనోజ్..
సివిల్స్ సాధించడం నా జీవితాశయం. వరుసగా మూడుసార్లు ఫెయిల్ అయినప్పటికీ ఆశ వదులుకోలేదు. నిరాశ పడలేదు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, సహకారంతో చదివాను. నాలుగోసారి ఇంటర్వ్యూకు సెలక్ట్ అయి సక్సెస్ అయ్యాను. సివిల్స్ కోసం నేను నెలకు రూ.50 వేల జీతం వచ్చే కొలువును వదిలేశాను. అందుకు తగిన ప్రతిఫలం దక్కింది. నా కల నెరవేరింది.
– సాయికృష్ణ, యూపీఎస్సీ 293 ర్యాంకర్