Skip to main content

Success Story : కూలీ కొడుకు.. వందల కోట్ల‌కు అధిప‌తి.. ఎలా అంటే..?

ఉన్నత చదువులు వదిలి కుబేరులైన వారి గురించి.., అమెరికా వదిలి ఇండియాలో బిజినెస్ చేసి కోట్లు సంపాదించిన వ్యక్తుల గురించి తెలుసుకున్నాము. అయితే ఇప్పుడు కాఫీ తోటలో పని చేసే ఒక కూలీ కొడుకు ఏడాదికి వందల కోట్లు సంపాదించే స్థాయికి ఎదిగాడు.
Mustafa Success Story In Telugu  Former Student Finds Success Entrepreneur's Journey to Crorepati

ఈయ‌నే 'ముస్తఫా'. ఇంతకీ ఇంత గొప్ప విజయం సాధించిన ఆ వ్యక్తి ఎవరు? అయన చేసే బిజినెస్ ఏమిటి..? 'ముస్తఫా' స‌క్సెస్ స్టోరీ కింది క‌థ‌నంలో చ‌ద‌వండి.. 

తండ్రితో పాటు కూలి పనులు చేస్తూ..
జీవితంలో విజ‌యం సాధించాలంటే.. పేద‌రికం అడ్డురాద‌ని నిరూపించాడు ఈ యువ‌కుడు. నువ్వు చేయాలనుకున్న ఈపైననా కొత్తగా ఆలోచించి ఆచరణలో పెడితే తప్పకుండా స‌క్సెస్ అవుతారంటున్నాడు ముస్తఫా'. కేరళలో నిరుపేద కుటుంబంలో జన్మించిన 'ముస్తఫా' తండ్రితో పాటు కూలి పనులకు కూడా వెళ్ళేవాడు. చిన్న చిన్న పనులు చేస్తూనే స్కూలుకు వెళ్ళేవాడు. అతని తల్లి నిరక్షరాస్యురాలు. పనులకు వెల్తూ చదువుకోవడం కొంత కష్టంగా ఉండటంలో చిన్నప్పుడు చదువులో ఆరవ తరగతి వరకు పెద్దగా రాణించలేకపోయాడు, కానీ పట్టు వదలకుండా చదివి పదవ తరగతిలో క్లాస్ టాపర్ అయ్యాడు. 

➤ Success Story: ఒక‌ప్పుడు ఇంటి అద్దె కూడా క‌ట్ట‌లేని ప‌రిస్థితి.. నేడు కొన్ని వేల‌ కోట్ల సంపాద‌న‌.. ఎలా అంటే..

ప్రతి రోజూ టిఫిన్ చేయడానికి ఎక్కువ ఖర్చు అవుతుందని..

Mustafa Success story

సాధారణంగా కష్టపడే గుణమున్న ముస్తఫా ఎన్ఐటిలో ఇంజనీరింగ్ సీటు సంపాదించాడు. ఆ తరువాత ఒక మల్టీనేషనల్ కంపెనీలో పనిచేశాడు. ఆ తరువాత యూరప్, అమెరికా వంటి దేశాలలో కూడా పనిచేసి అక్కడ సంతృప్తి చెందలేక మళ్ళీ ఇండియా వచ్చేసాడు. 2005లో బెంగళూరు నగరంలో ఉన్నప్పుడు ప్రతి రోజూ టిఫిన్ చేయడానికి ఎక్కువ ఖర్చు అవుతుందని భావించేవాడు. అప్పుడే అతని మనసులో ఒక ఆలోచన పుట్టింది. ఇడ్లీ, దోశ పిండి విక్రయించి తప్పకుండా లాభాలు పొందవచ్చని అనుకున్నాడు. అనుకున్న విధంగానే ఐడి ఫ్రెష్ (ID) పేరిట దోశ, ఇడ్లీ పిండి విక్రయించడం మొదలెట్టాడు.

రూ.300 కోట్లకు..

Mustafa Success news in telugu

ఐడి ఫ్రెష్ ప్రారంభించిన మొదట్లో ఒక చిన్న ప్రదేశంలో 100 ప్యాకెట్లు విక్రయించాలని టార్గెట్ పెట్టుకున్నాడు. ఈ టార్గెట్ అతి తక్కువ కాలంలోనే వెయ్యి ప్యాకెట్లకు చేరింది. ఇది క్రమంగా వ్యాపిస్తూ మెట్రో నగరాలకు సైతం పాకింది. ప్రస్తుతం దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో ముస్తఫా తన వ్యాపారాన్ని విస్తరించాడు. ప్రారంభంలో ఐడి ఫ్రెష్ ఫుడ్ 5000 కేజీల బియ్యంతో 15,000 కేజీల ఇడ్లీ, దోశ పిండి మిశ్రమం తయారు చేశారు. ప్రస్తుతం అనేక నగరాల్లో వందలాది స్టోర్లను ప్రారంభించాడు. మొత్తానికి ముస్తఫా బ్రేక్‌ఫాస్ట్ కింగ్‌గా ప్రసిద్ధి చెందాడు. 2015-16లో కంపెనీ టర్నోవర్ రూ.100 కోట్లు. కాగా ఇప్పుడు ఇది రూ.300 కోట్లకు చేరినట్లు సమాచారం. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

 Success Story : చ‌దువులో ఫెయిల‌య్యా.. కానీ రూ.1,843 కోట్లు సంపాదించానిలా.. ఎలా అంటే..?

ఇడ్లీ, దోశ పిండి అమ్ముకోవడం ఏమిటి అని..
నిజానికి ఉన్నత చదువులు చదివి ఇడ్లీ, దోశ పిండి అమ్ముకోవడం ఏమిటి అని చాలామంది అనుకోవచ్చు. ప్రారంభంలో ముస్తఫా కూడా ఇలా ఆలోచించి ఉంటే వందల కోట్ల సామ్రాజ్యాన్ని స్థాపించేవాడు కాదు. కావున చేసే పని ఏదైనా కానీ నిజాయితీగా, నిబద్దతో చేస్తే తప్పకుండా విజయ శిఖరాలను అధిరోహించవచ్చు అనటానికి ముస్తఫా నిలువెత్తు నిదర్శనం. ఈ యువ‌కుడు స‌క్సెస్ జ‌ర్నీని నేటి  యువ‌త‌రంకు స్ఫూర్తిగా తీసుకోవ‌చ్చును.

Success Story : ఊహించని విజ‌యం.. ఆఫీసు బాయ్ నుంచి రెండు కంపెనీలకు సీఈవో స్థాయికి వ‌చ్చానిలా.. కానీ..

Published date : 04 Dec 2023 03:15PM

Photo Stories