Skip to main content

Success Story: ఒక‌ప్పుడు ఇంటి అద్దె కూడా క‌ట్ట‌లేని ప‌రిస్థితి.. నేడు కొన్ని వేల‌ కోట్ల సంపాద‌న‌.. ఎలా అంటే..

ఎవ‌రైనా జీవితంలో సక్సెస్ సాధించారంటే దాని వెనుక ఎంతో సాహసం చేసి ఉంటార‌ని అర్థం.
Success story   person on the road to success  person on the road to success

జీవితంలో ఎన్నో కష్ట, నష్టాలను ఎదుర్కొని నిలబడగలిగితే క‌చ్చితంగా విజయం వారి సొంతమవుతుంది. ఇలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు చందూభాయ్ విరానీ. క్యాంటిన్లో పనిచేసే స్థాయి నుంచి వేల కోట్ల సామ్రాజ్యాన్ని ఎలా సృష్టించాడు..? దాని వెనుక అతని కృషి ఎలా ఉందనే వివరాలను తెలుసుకుందాం.

చందూభాయ్ గుజరాత్‌లోని జామ్నగర్ రైతు కుటుంబంలో జన్మించాడు. ఆయ‌న కేవలం ప‌దో తరగతి వ‌ర‌కు మాత్రమే చదువుకున్నాడు. ఆ తరువాత సొంతంగా ఏదైనా చేయాలనే తపనతో తన సోదరులతో కలిసి తండ్రి వద్ద రూ.20000 తీసుకుని ఉన్న ఊరు వదిలి రాజ్‌కోర్టుకు వెళ్లారు. అక్కడ వ్యవసాయ సామాగ్రిని విక్రయించే వ్యాపారం మొదలుపెట్టి, సక్సెస్ కాలేకపోయారు. వ్యాపారం దివాళాతీసింది. దీంతో ఆ వ్యాపారాన్ని వదిలేయాల్సి వచ్చింది.

Chandubhai Virani

రూ.90 జీతంతో.. క్యాంటీన్‌లో ఉద్యోగం..
వ్యాపారంలో నష్టపోయామని దిగులు చెందక ఇంకా ఏదో చేయాలనే తపనతో ఒక సినిమా క్యాంటీన్‌లో ఉద్యోగం సంపాదించాడు. అక్కడ అతని జీతం రూ.90 మాత్రమే. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ.. ఎదగాలన్న ఆశను మాత్రం కోల్పోలేదు. దీంతో క్యాంటీన్లో ఉద్యోగం చేస్తూనే పార్ట్ టైమ్ జాబ్స్ చేసేవాడు.

 Success Story : చ‌దువులో ఫెయిల‌య్యా.. కానీ రూ.1,843 కోట్లు సంపాదించానిలా.. ఎలా అంటే..?

ఆ సమయంలో చందూభాయ్, అతని కుటుంబ సభ్యులు తమ అవసరాలను తీర్చుకోవడానికి కూడా చాలా ఇబ్బందులు పడేవారు. తాను ఉంటున్న రూమ్ రెంట్ రూ.50 చెల్లించలేక గది ఖాళీ చేయాల్సి వచ్చింది. ఇది అతని జీవితాన్ని ఒక్కసారిగా మలుపు తిప్పింది.

Chandubhai Virani

చిప్స్ తయారీ మొద‌లు.. 
క్యాంటీన్‌లో పనిచేసుకుంటున్న సమయంలో చందూభాయ్, అతని సోదరులకు నెలకు రూ.1000 విలువ చేసే కాంట్రాక్ట్ ఒకటి లభించింది. దీంతో వారు ఒక చిన్న షెడ్ నిర్మించి, అక్కడ నుంచే చిప్స్ తయారు చేయడం ప్రారంభించి 'బాలాజీ వేఫర్స్' అనే పేరుతో విక్రయించడం స్టార్ట్ చేశారు. సినిమా థియేటర్, చుట్టుపక్కల వేఫర్లను విక్రయించడం ప్రారంభించారు. ప్రారంభంలో అనుకున్నంత ఆదరణ పొందలేకపోయింది. కానీ క్రమంగా బాగా పాపులర్ అయింది. ఆ తరువాత ఈ బాలాజీ వేఫర్స్ విస్తరణ ప్రారంభమైంది. 1995లో ఇది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా అవతరించింది.

Chandubhai Virani


దేశంలో అతిపెద్ద వేఫర్ బ్రాండ్‌గా..  
ఓ చిన్న గదిలో ప్రారంభమైన వ్యాపారం గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ల‌లో అతి పెద్ద స్నాక్స్ మ్యానుఫ్యాక్చరర్‌గా అవతరించి భారతదేశంలో అతిపెద్ద వేఫర్ బ్రాండ్‌గా నిలిచింది. 2021 ఆర్ధిక సంవత్సరం కంపెనీ విలువ ఏకంగా రూ.4000 కోట్లు అని తెలుస్తోంది.

Success Story : ఊహించని విజ‌యం.. ఆఫీసు బాయ్ నుంచి రెండు కంపెనీలకు సీఈవో స్థాయికి వ‌చ్చానిలా.. కానీ..

Published date : 04 Dec 2023 08:13AM

Photo Stories