Skip to main content

IAS Varun Kumar Story: ఒకప్పుడు సైకిల్‌ మెకానిక్‌.. ఇప్పుడు ఐఏఎస్‌ వరుణ్‌ కుమార్‌..! ఇదే తన స్టోరీ

మనం గమ్యానికి చేరాలంటే ఎంచుకున్న గమ్యంతోపాటు కావాల్సిన ఓర్పు సహనం పట్టుదల ఉండాలి. ఎటువంటి క్లిష్ట  పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా ఎదురుకోవాలి. ఎవరు ఏం అనుకున్నా మనం చేయాలనుకున్నది చేసి చూపించాలి.
Journey to Success Concept   Inspiring and Motivational journey of Successful IAS officer Varun Baranwal

ఒక సైకిల్‌ మెకానిక్‌ ఇప్పుడు ఐఏఎస్‌ వరుణ్‌ కుమార్‌ యూపీఎస్‌సీ ర్యాంకర్‌గా నిలిచాడు... అసలు ఊహించని విధంగా తన జీవిత ప్రయాణం సాగింది. చదువులో ఎప్పుడూ ముందే ఉంటాడు. ఎప్పుడూ టాపరే.. అటువంటిది టెన్త్‌ తరువాత తన చదువును ఆపాల్సి వచ్చింది. అలాంటి సమయంలో ఇతనికి ఐఏఎస్‌ లక్ష్యం ఎలా అయింది? ఐఏఎస్‌ వరుణ్‌ కుమార్‌ ప్రయాణం మీకోసం..

IPS inspirational Story : ఈ ఐపీఎస్ స్టోరీ చ‌ద‌వ‌గానే కంటతడి తప్పదు.. చిన్న వ‌య‌స్సులోనే..

ఎవరు వరుణ్‌..?

తన పూర్తి పేరు వరుణ్‌ కుమార్‌ బరన్‌వాల్‌.. తన తండ్రి ఒక సైకిల్‌ మెకానిక్‌. తన కొడుకు చదువుకోసం ఎంతో కష్టపడేవారు. వరుణ్‌ తన క్లాస్‌లో ఎప్పుడు టావర్‌గా నిలిచేవాడు. అంతా బాగానే సాగుతున్న సమయంలో తన తండ్రి కన్నుమూసారు. అప్పుడే వరుణ్‌ తన టెన్త్‌ పూర్తి చేసుకున్నాడు. ఈ సమయంలో తన తల్లికి సహాయపడేందుకు తనకు ఎంతో ఇష్టమైన చదువును మధ్యలోనే ఆపేసాడు.

IAS

అనంతరం, తన తండ్రి అప్పటి వరకు నడిపిన ఒక సైకిల్‌ మెకానిక్‌ షాపులో పనిచేయడం ప్రారంభిచాడు. ఇదిలా ఉంటే తన తల్లి వేరే ఇళ్లల్లో పనిమనిషిగా చేసేవారు. ఈ విధంగా వారి జీవితాన్ని సాగించేవారు. ఇలా వచ్చే డబ్బులతో అయినా తన చదువును తిరిగి ప్రారంభించాలనుకున్నాడు వరుణ్‌ కానీ, వారికి వచ్చే డబ్బులు ఏమాత్రం సరిపోయేవికాదు. ఎంత పొదుపు చేయాలనుకున్నా అయ్యేవి కావు. 

UPSC Civils Ranker Success Story : ఈ కోరికతోనే.. ఎలాంటి కోచింగ్ లేకుండానే సివిల్స్ సాధించానిలా.. కానీ..

ఈయన ప్రోత్సాహంతోనే..

తన తండ్రి స్నేహితుడైన డాక్టర్‌ కంప్లీ అనే వ్యక్తి వారికి ఎంతో సహాయపడ్డారు. ఆయన సహకారంతో బడి ఫీజులు కట్టి ఆపై రెండు తరగతులను కూడా పూర్తి చేసుకోగలిగాడు. అలా ఇంటర్‌ పూర్తి అయ్యాక అన్ని బాధ్యతలను తన అమ్మ తన భుజాన వేసుకొని వరుణ్‌ను ఆపై చదువులు చదివించాలనుకుంది. అందుకోసం తన కొడుకును దగ్గరలోని నగరానికి పంపింది. ఇక్కడ వాళ్ళ అమ్మ వారి జీవితాల కోసం బిడ్డ చదువు కోసం కష్టపడేది.

IAS

వరుణ్‌కు డాక్టర్‌ చదవాలన్న ఆశ ఉన్నప్పటికీ అంత ఫీజును వారు చెల్లించలేమనుకొని ఇంజనీరింగ్‌ చేసేందుకు సిద్ధపడ్డాడు. పూనెలోని ఎంఐటీ కళాశాలలో సీటు వచ్చింది. స్కూల్‌లో వచ్చిన స్కాలర్‌షిప్‌ సహాకరంతో కాలేజీలో చదువుకున్నాడు. అక్కడ పుస్తకాలకు ఇబ్బంది పడుతుండగా తన స్నేహితులు తమ వంతు సహాయం అందించారు.

Arati Kadav Success Story : ఈ జీవితానికి అర్థం ఏమిటి..? పుట్టడం, గిట్టడమేనా ఇంకేదైనా ఉందా..? అనే ఆలోచ‌న నుంచే..

ఉద్యోగం వద్దు.. కానీ..

అలా, తనూ కష్టపడి తన చదవును పూర్తి చేసుకున్నాడు. తన పై చదువులు పూర్తి అయ్యాక తనకు ఎంఎన్‌సీక్ష ఉద్యోగం వచ్చింది. అందరూ సంతోషిస్తుండగా వరుణ్‌ మాత్రం యూపీఎస్‌సీ రాయాలని నిర్ణయించుకున్నాడు. ఇదే దారిలో నడిచి దేశానికి సహాయపడాలనుకున్నాడు.  ఇందులో కూడా డాక్టర్‌ సలహాలు వరుణ్‌కు ఎంతో మేలు చేసాయి. ఆయన మాటలు, విధాం తనకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చాయి. ఐఏఎస్‌ రాయడం ఏమాత్రం చిన్న విషయం కాదని దాని గురించి చెప్పి, పరీక్షకు సిద్ధపడేందుకు ఎంతో సహకరించారు.

Successful Business Woman Story : ఈ ఒక్క ఆలోచనతో.. రూ.8300 కోట్లు సంపాదించానిలా.. కానీ..

ప్రయాణం స్నేహితుల తోడు..

IAS

ఒక ఏడాదిపాటు తను చాలా కష్టపడి చదివాడు. వారి ప్రోత్సాహం, సహకారంతోనే ముందుకు సాగాడు వరుణ్‌. ఇలా తన యూపీఎస్‌సీకి చదవడం ప్రారంభించాడు. తన సమయానుసారం రోజుకు 18 గంటలపాటు తన చదువు ఉంటే కేవలం ఒక్క పూట మాత్రమే తినేవాడు. ఎటువంటి కోచింగ్‌ తీసుకోలేని పరిస్థితి ఉన్నప్పటికీ తన స్నేహితులు, తన తండ్రి స్నేహితుడైన డాక్టర్‌ సహాకారం తనకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చింది.  తన చదువుకొని అన్ని విధాలుగా పరీక్షకు సిద్ధమయ్యేలా చర్యలు తీసుకున్నాడు. తన ప్రయత్నం విఫలం అవుతుందా..? ఫలితాన్ని ఇస్తుందా..? అని ఆలోచించలేదు. తన ప్రయాణాన్ని సాగిస్తూ ముందుకే నడిచాడు. తను అనుకున్న గమ్యాన్ని చేరుకునేందుకు చేయాల్సిన కృషి చేశాడు.

Motivational Story : మాది నిరుపేద కుటుంబం.. ఏడాది కాలంలో ఈ మూడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల‌ను కొట్టానిలా.. కానీ..

దేశంలోనే..

2016లో నిర్వహించిన ఈ యూపీఎస్‌సీ పరీక్షలో వరుణ్‌ నిలబడ్డాడు. తన పట్టుదలను, విశ్వాసాన్ని ఎటువంటి పరిస్థితిలోనూ వీడకుండా నిలిచాడు. ఇలా ఏడాదిపాటు శ్రమతో ప్రయాణించిన వరుణ్‌కు పరీక్షలో దేశంలోనే 32వ ర్యాంకు దక్కింది. ఈ విషయం తెలుసుకున్న తన తల్లి ఎంతో సంతోషించారు.

IAS

తన కొడుకు విజయాన్ని అందరితోనూ పంచుకొని జరుపుకున్నారు. ఇందులో వరుణ్‌కు తన స్నేహితులతోపాటు ముఖ్యంగా అన్ని విధాలుగా సహకరించిన వారు డాక్టర్‌ కంప్లీ.

Success Stories of government employees : కష్టమైనా.. ఇష్టపడే ప్ర‌భుత్వ ఉద్యోగాలు సాధించామిలా.. కానీ..

ఈ కథనంతో సందేశం..

వరుణ్ కుమార్ ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన యువకుడు. అతను తన పట్టుదలతోపాటు కృషి తోడైంది. అలా, ఐఏఎస్ ర్యాంకర్ అయ్యాడు. అతని విజయం ఒక సందేశాన్ని ఇస్తుంది, అదేంటంటే.. ఏదైనా సాధించడానికి కష్టపడి పనిచేస్తే, అది సాధ్యమే.

గెలవాలన్న పట్టుదల ఉండడం ఎంత ముఖ్యమొ.. పరీక్ష రాసేందుకు మన ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. అందుకు ఎంత సమయం పాటు చదువుకున్న ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. 

Government Job : ఇదే మొదటి ప్ర‌భుత్వ‌ ఉద్యోగం కావడంతో సవాలుగా తీసుకున్నాను.. కానీ

Published date : 20 Jan 2024 02:45PM

Photo Stories