Successful Business Woman Story : ఈ ఒక్క ఆలోచనతో.. రూ.8300 కోట్లు సంపాదించానిలా.. కానీ..
ఇలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు సునీర, ఆమె సోదరుడు సాల్ రెహ్మెతుల్ల. ఇంతకీ వీరు ఎవరు, వీరు చేస్తున్న వ్యాపారం ఏంటి..? మొదలైన వివరాలు కింది స్టోరీలో చూడొచ్చు.
సుమారు 12 బ్యాంకులను..
ఫ్లోరిడాలో నివసిస్తున్న 'సునీర' జన్మస్థలం పాకిస్తాన్. కరాచీలో పుట్టిన ఈమె ఫ్లోరిడా యూనివర్సిటీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత, ఫస్ట్ డేటాతో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించింది. ఉద్యోగం చేస్తున్న సమయంలో ఏదైనా కొత్తగా చేయాలని ఆలోచించి తమ్ముడు రెహ్మెతుల్లతో కలిసి 2014లో స్టాక్స్ (Stax) ప్రారంభించింది. స్టాక్స్ అనేది ఇతర ప్లాట్‌ఫామ్‌ల మాదిరిగానే విక్రయాల శాతం మాదిరిగా కాకుండా నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ప్రాతిపదికన చార్జెస్ వసూలు చేసే ఆల్ ఇన్ వన్ పేమెంట్ ప్లాట్‌ఫామ్. ఈ ప్లాట్‌ఫామ్ అభివృద్ధి కోసం ఈమె సుమారు 12 బ్యాంకులను సంప్రదించింది. అయినా ఫలితం లేకుండా పోయింది.
రూ. 145 కోట్ల డీల్ ఆఫర్..
సునీర తన ఆలోచనలను తల్లిదండ్రులతో పంచుకుంది, వారు ఆమె ఆలోచనపై పని చేయమని ప్రోత్సహించారు. నెలవారీ చందా ప్రాతిపదికన వసూలు చేసే ప్లాట్‌ఫారమ్‌లో వారు కూడా పని చేయడం ప్రారంభించారు. ఆ తరువాత ఆమె ఓర్లాండోకు వెళ్లి తన ఆలోచనను మరింత విస్తరించింది.సునీర, రెహ్మెతుల్ల చేస్తున్న ఈ తరహా బిజినెస్ అభివృద్ధి చెందుతున్న సమయంలో వారి స్టాక్‌ను కొనుగోలు చేయడానికి రూ. 145 కోట్ల డీల్ ఆఫర్ వచ్చింది. దీనిని వారు సున్నితంగా తిరస్కరించారు. ఆ తరువాత తోబుట్టువులిద్దరూ తమ ఉద్యోగాలను వదిలిపెట్టి స్టాక్‌లోనే పూర్తిగా పనిచేయడం ప్రారంభించారు. దీంతో వారికి ఆర్ధిక సమస్యలు ఎదురయ్యాయి.
ఫోర్బ్స్ ప్రకారం రూ.8,308 కోట్లని..
ఆర్థిక సమస్యలను అధిగమించడానికి వారిరువురు.. కుటుంబం, స్నేహితుల నుంచి 50000 డాలర్లు అప్పుగా తీసుకుని, ఆ డబ్బుని కంపెనీలో పెట్టుబడి పెట్టారు. ప్రస్తుతం ఈ సంస్థలో ఏకంగా 300 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నట్లు, కంపెనీ విలువ.. ఫోర్బ్స్ ప్రకారం రూ.8,308 కోట్లని తెలుస్తోంది.
Tags
- suneera madhani success story
- suneera-and-stax
- suneera-and-stax success story
- suneera and stax success story
- suneera and stax success story real story in telugu
- suneera and stax inspire story
- suneera madhani biography
- suneera madhani biography in telugu
- suneera madhani ceo
- sakshi education successstories
- EntrepreneurshipJourney
- women empowerment