IPS inspirational Story : ఈ ఐపీఎస్ స్టోరీ చదవగానే కంటతడి తప్పదు.. చిన్న వయస్సులోనే..
కొందరి స్టోరీలు చదవగానే.. కంటతడి తప్పదు. సరిగ్గా ఇలాంటి స్టోరీనే అపరాజితా రాయ్ ఐపీఎస్. ఈ నేపథ్యంలో మనం ఈ రోజు సిక్కిం తొలి మహిళా ఐపీఎస్‌గా ఘనత సాధించిన అపరాజితా రాయ్ సక్సెస్ జర్నీ తెలుసుకుందాం..
కుటుంబ నేపథ్యం :
అపరాజిత రాయ్.. తండ్రి జ్ఞానేంద్ర రాయ్. ఈయన సిక్కింలో డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్. కానీ అపరాజితకు 8 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడే తండ్రి మరణించారు. ఆమె తల్లి పేరు రోమా రాయ్. అపరాజిత రాయ్... చిన్నప్పటి నుంచి ప్రభుత్వ ఉద్యోగుల్ని చూస్తూ పెరిగిన ఆమె..ఆ వ్యవస్థలో భాగం కావాలని నిర్ణయించుకుంది. ఆ నిర్ణయం తీసుకున్న రెండు దశాబ్దాల తర్వాత తొలి మహిళా ఐపీఎస్‌గా అవతరించింది.
ఎడ్యుకేషన్ :
అపరాజితా రాయ్.. చిన్నప్పటి నుంచి చదువులో చాలా చురుకైనది. 2004లో జరిగిన ఐసీఎస్ బోర్డు పరీక్షలో 95 శాతం మార్కులతో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఆమె తన పాఠశాల దశలోనే తాషి నామ్‌గ్యాల్ అకాడమీలో ఉత్తమ ఆల్ రౌండర్ విద్యార్థిగా ఫౌండర్స్ మెడల్ అందుకుంది. మాధ్యమిక తర్వాత, ఆమె నేషనల్ అడ్మిషన్ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధించింది. 2009లో నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ జ్యుడిషియల్ సైన్సెస్ నుంచి BA LLB (ఆనర్స్) డిగ్రీని పొందింది. ఇక్కడ ఆమె న్యాయశాస్త్రం, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ రెండింటిలోనూ బంగారు పతకాన్ని పొందింది. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షను తొలిసారిగా 2009లోనే ప్రయత్నించినా దానిని క్లియర్ చేయలేకపోయింది.
☛ IAS Officer Success Story : ఒక వైపు కరోనాతో తండ్రి మరణం.. మరో వైపు సివిల్స్ ఇంటర్వ్యూ.. చివరికి..
అపరాజిత రాయ్ మరోసారి 2010లో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షకు హాజరైంది. ఈసారి 768వ ర్యాంక్ సాధించింది. అయితే దీంతో ఆమె సంతృప్తి చెందలేదు. 2011 సంవత్సరంలో వరుసగా మూడోసారి యూపీఎస్సీ పరీక్షను రాసింది. ఈసారి ఆమె ఆల్ ఇండియా ర్యాంక్ 358వ స్థానంలో నిలిచింది. ఇలా మూడో ప్రయత్నంలో ఐపీఎస్‌గా అవతరించింది.
11 లక్షలకు పైగా దరఖాస్తులు.. కానీ..
అది.. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2022. 11 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఖాళీలు 1105 మాత్రమే. దరఖాస్తులు, ఖాళీల సంఖ్య ప్రతి సంవత్సరం దాదాపు ఒకే విధంగా ఉంటుంది. అపరాజిత రాయ్ సిక్కిం తొలి మహిళా ఐపీఎస్ అధికారిణి. ఆమె 2010, 2011లో వరుస సంవత్సరాలలో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు.
ఉద్యోగంలోనూ.. ఎక్కడ కూడా..
ఐపీఎస్ అపరాజిత రాయ్, పశ్చిమ బెంగాల్ కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. డాషింగ్ పోలీస్ ఆఫీసరే కాదు మంచి క్రీడాకారిణి కూడా. ఆమె ఆల్ ఇండియా పోలీస్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో రన్నరప్‌గా కూడా నిలిచింది. ఇది కాకుండా, డ్రగ్స్, బంగారం వంటి వస్తువులను స్మగ్లింగ్ చేసిన అనేక కేసులను ఛేదించడం ద్వారా ఆమె హెడ్ లైన్స్‌లో నిలిచింది. ఒకసారి ఆమె కార్పొరేట్ తరహా స్మగ్లింగ్ సిండికేట్‌ను ఛేదించారు. కోల్‌కతా నుంచి సిలిగురికి వెళ్తున్న బస్సులో 8 కిలోల బంగారం, 74 కిలోల వెండి, సుమారు మూడు కిలోల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.
☛ IAS Achievement : ఎటువంటి శిక్షణ లేకుండానే.. రెండో ప్రయత్నంలోనే ఐఏఎస్ కొట్టానిలా..
అవార్డులు..
ఆమె తన ఐపీఎస్ శిక్షణ సమయంలో పోలీసు అకాడమీలో అనేక అవార్డులను గెలుచుకున్నారు. వాటిలో బెస్ట్ లేడీ అవుట్‌డోర్ ప్రొబేషనర్‌గా 1958 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్స్ ట్రోఫీ, ఫీల్డ్ కంబాట్ కోసం శ్రీ ఉమేష్ చంద్ర ట్రోఫీ, బెస్ట్ టర్న్ అవుట్ కోసం 55వ బ్యాచ్ సీనియర్ ఆఫీసర్స్ ట్రోఫీ, బెంగాలీకి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ట్రోఫీ సాధించారు.
Tags
- aparajita rai ips success story
- aparajita rai ips real story
- aparajita rai ips education
- aparajita rai ips motivational story
- Success Story
- Ias Officer Success Story
- Women
- women ips Inspirational success stories in telugu
- UPSC
- women ips officers
- women ips success stories in telugu
- women ips Inspirational success stories
- Civil Services Success Stories
- Success Stories
- upsc civils rankers interview videos telugu
- upsc civils rankers success stories in telugu
- upsc civils rankers success stories
- upsc civils ranker Aparajita Rai
- upsc civils ranker Aparajita Rai success story in telugu
- upsc civils ranker Aparajita Rai real story in telugu
- sakshi education successstories