Skip to main content

Pamela Satpathy, IAS : నాడు ఎన్నో అవమానాలు.. నేడు ఎందరికో ఆదర్శంగా..!

ఆమె ఓ జిల్లాకు పాలనాధికారి. తాను తలుచుకుంటే.. తన పిల్లలకు నంబర్ వన్ కార్పొరేట్ స్కూళ్లో సీటు లభిస్తుంది. కానీ ఆమె తన అధికారాన్ని అలా ఉపయోగించుకోవాలనుకోలేదు.
Pamela satpathy ias
పమేలా సత్పతి, యాదాద్రి భువనగిరి కలెక్టర్‌

తన ముద్దుల కుమారుడిని అందరి పిల్లల్లా.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలోని ఓ అంగ్​వాడీ కేంద్రానికి పంపించేందుకు సిద్ధమయ్యారు. 36 నెలల వయసున్న కుమారుడు పేరు నైతిక్ సత్పతి. త‌న కొడుకు పేరును అంగన్​వాడీ కేంద్రంలో కూడా నమోదు చేయించారు. అలాగే ఇందుకుకుగాను త‌న‌కు అంగన్ వాడీ కేంద్రం నుంచి 16 గుడ్లు, బాలామృతాన్ని కలెక్టర్‌కు అందజేశారు. ఇంతకీ ఆ కలెక్టర్ ఎవరు? త‌న గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ ప్ర‌త్యేక‌ కథనం చదవాల్సిందే.

కుటుంబ నేపథ్యం :

Pamela satpathy IAS Family


పమేలా సత్పతి ఒడిస్సాలో కోరాపుట్ జిల్లాలోని సునాబెడలో పుట్టి పెరిగారు. ఆమె డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ ఆఫీసర్ ఆర్‌కే. సతపతి కూతురు. తన తల్లి నుంచి స్ఫూర్తిని పొంది ఉన్నత చదువులు చదవాలని నిర్ణయించుకుంది. వృత్తిరీత్యా డాక్టర్‌గా ఉంటూ ఉమ్మడి కుటుంబంలో జీవిస్తున్న దీపాంకర్‌తో ఆమె పెళ్లి చేసుకుంది పమేలా.

ఎన్నో అవమానాలు ఎదుర్కొని.. నేడు

Pamela satpathy ias Husband


పమేలా సత్పతి అత్తమామలు, భర్త అందించిన ప్రోత్సాహంతో ముందుకు సాగింది. “ఆమె IPS అధికారి అయిన తర్వాత ‘నీ ప్రాధాన్యం బాగా తగ్గిపోతుంది’ అని స్నేహితులు, పరిచయస్తుల నుంచి ఎన్నో అవహేళనలు ఎదుర్కొన్నాడు పమేలా భర్త. కానీ అతను అలాంటి వాటిని ఎప్పుడూ పట్టించుకోలేదు. ‘‘నేను పరీక్షలకు సిద్ధం కావడానికి ఇంట్లో పాత్రలను శుభ్రం చేయడంతో సహా అన్ని ఇంటి పనులను చేశాడు” అని పమేలా చెప్పారు. ఈ సమయంలో ఆమె తల్లిదండ్రులు, భర్త, అత్తమామలు ఆమెకు చాలా మద్దతు ఇచ్చారు.

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా...
కంప్యూటర్ సైన్స్‌లో బిటెక్ పూర్తి చేసిన తర్వాత, ఆమె ఇన్ఫోసిస్‌లో మొదటి క్యాంపస్ ప్లేస్‌మెంట్ పొందింది. పమేలా సత్పతి ఇన్ఫోసిస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేశారు. ఆ తర్వాత దేశంలో అభివృద్ధి చెందుతున్న పరిశోధనా రంగాలలో ఒకటైన కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR)లో తోటి శాస్త్రవేత్తగా చేరాలని నిర్ణయించుకుంది. ఆమె శిక్షా ఓ అనుసంధన్ యూనివర్సిటీ (SOAU)లో స్కూల్ ఆఫ్ నర్సింగ్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా కూడా పనిచేశారు.

అనేక సార్లు ఆమెను రాజ‌కీయ ఒత్తిళ్లకు..

Pamela satpathy


పమేలా సత్పతి కొన్నాళ్లు వరంగల్ మున్సిపల్ కమిషనర్ గా పనిచేశారు. 2019 డిసెంబ‌ర్‌లో వరంగల్ క‌మిష‌న‌ర్‌గా బాధ్యత‌లు చేప‌ట్టిన స‌త్పతి న‌గ‌రాభివృద్ధిపై చెర‌గ‌ని ముద్రవేశార‌ని చెప్పాలి. ఆమె ముక్కుసూటిత‌నం అనేక సార్లు ఆమెను రాజ‌కీయ ఒత్తిళ్లకు గురయ్యారు. 2015 సంవ‌త్సరంలో ఐఏఎస్ పూర్తి చేసుకున్న ప‌మేలా స‌త్పతి తొలి పోస్టింగ్‌ భద్రాచలం సబ్‌ కలెక్టర్‌గా నియమితులయ్యారు. అక్కడ ఆమె 19 నెలల పాటు పనిచేశారు. మూడు నెలల పాటు భద్రాచలం దేవస్థానం కార్యనిర్వాహణాధికారిగానూ కొన‌సాగ‌డం గ‌మ‌నార్హం. ఆ త‌ర్వాత 11నెల‌లు భూసేకరణ శాఖలో పని చేశారు. 

యాదాద్రి భువనగిరి కలెక్టర్‌గా.. 
యాదాద్రి భువనగిరి కలెక్టర్ గా పమేలా సత్పతి ని నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవ‌లే నిర్ణయం తీసుకుంది. ఒడిస్సాకు చెందిన పమేలా సత్పతి 2019 డిసెంబ‌ర్‌లో వరంగల్ క‌మిష‌న‌ర్‌గా బాధ్యత‌లు చేప‌ట్టిన స‌త్పతి న‌గ‌రాభివృద్ధిపై చెర‌గ‌ని ముద్రవేశార‌ని చెప్పాలి. ఆమె ముక్కుసూటిత‌నం అనేక సార్లు ఆమెను రాజ‌కీయ ఒత్తిళ్లకు గురయ్యారు. 

కింది స్థాయి సిబ్బంది కోసం..

Work


కొందరు అధికారులు పరిపాలనను సమర్థవంతంగా నిర్వహిస్తారు.. మరికొందరు పనిచేస్తూ, చేయిస్తూనే కింది స్థాయి సిబ్బంది శ్రేయస్సు కోసం కృషి చేసి వారిపై చెరగని ముద్ర వేస్తారు. ఆ కోవలోకే వస్తారు.. క‌లెక్ట‌ర్ పమేలా సత్పతి! బల్దియా సిబ్బంది కార్మికుల సంక్షేమానికి తన స్నేహితుల ద్వారా రూ.20లక్షలు సేకరించి ప్రత్యేక నిధిగా ఏర్పాటు చేసి ఆపదలో ఉన్న వారిని ఆదుకుని ఆమె మనసున్న మహారాణిలా నిలిచారు. రూ.వెయ్యి ఇస్తేనే ఫొటోలు పేపర్లలో వేయించుకునే వారు ఉన్న ఈ రోజుల్లో ఏకంగా భారీ మొత్తాన్ని సాయమందించేందుకు వెచ్చిస్తున్న ఆమెపై ఉద్యోగులు, సిబ్బంది నుంచి  ప్ర‌త్యేక ప్రశంసలు కురిపించారు.

క‌రోనా స‌మ‌యంలో సిబ్బందికి.. 

Covid Time


కరోనా వైరస్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో.. క్షేత్ర స్థాయిలో విధులు నిర్వర్తిస్తున్న కార్మికులు, సిబ్బంది సేవలు వెలకట్టలేనివన్నారు. అలాగే కార్మికుల ఆరోగ్యం, శ్రమను దృష్టిలో పెట్టుకుని తన మిత్రులు, శ్రేయోభిలాషుల సహకారంతో వ్యక్తిగతంగా ప్రత్యేక నిధి ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. విధినిర్వహణలో ఎవరికైనా ప్రమాదం జరిగితే ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందడంలో ఆలస్యమైనా ఈ నిధులను వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు రూ.11లక్షలను ఆపదలో ఉన్న ఉద్యోగులు, కార్మికులు సహాయార్థం ఖర్చు చేయగా మరో రూ.9లక్షలు నిధులు అందుబాటులో ఉన్నాయని వివరించారు.

ఒక‌సారి..

IAS


ఈ క‌లెక్ట‌ర్ తన పనేదో తాను చేసుకుని ఇంటికి చేరుకునే రకం కాదు. పనిలో ఎంత నిక్కచ్చిగా ఉంటారో ఉద్యోగులు, సిబ్బంది సంక్షేమం విషయంలోనూ అంతే శ్రద్ధ చూపిస్తారు. చిన్నాపెద్దా తేడా లేకుండా సిబ్బందిలో ఎవరికి కష్టమొచ్చినా అండగా నిలుస్తారు. తన క్యాంపు కార్యాలయంలో వంట మనిషిగా పనిచేసే తాళ్లపల్లి కమల కుమారుడు, బల్దియాలో తాత్కాలిక కార్మికుడు నాగరాజు(32) అనారోగ్యం బారిన పడి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న క‌లెక్ట‌ర్‌.. మేయర్‌ గుండు సుధారాణితో కలసి హన్మకొండలోని వారి ఇంటికి వెళ్లి నాగరాజు మృతదేహం వద్ద నివాళులర్పించారు. తర్వాత మృతుడి తల్లి, భార్యను ఓదార్చారు. ఈ సందర్భంగా నాగరాజు భార్య తన రెండు నెలల పసిగుడ్డును పట్టుకుని రోదిస్తుండగా..సత్పతిలోని తల్లి హృదయం మేల్కొంది. పసిగుడ్డును తన చేతిలోకి తీసుకున్న ఆమె కూడా కన్నీరు మున్నీరుగా రోదించారు.

Published date : 09 Feb 2022 02:15PM

Photo Stories