Lady IPS Success Story : ఐపీఎస్ కనిపించగానే వీళ్లకు వణుకు.. ప్రాణభయంతో
బీహార్ నుంచి ఐపీఎస్‌కు ఎంపికైన తొలి మహిళగా..
చరిత్రను తిరగరాయాలంటే ఓర్పు ఉండాలి, నేర్పు కావాలి. అవరోధాలను జయించే శక్తి అవసరం. అవన్నీ.. మంజరిలో పుష్కలం. కాబట్టే, బీహార్ నుంచి ఐపీఎస్‌కు ఎంపికైన తొలి మహిళగా రికార్డు సృష్టించారు. తన సుదీర్ఘ కెరీర్‌లో పోలీసు వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. ‘మేడమ్ సర్’ పేరుతో రాసుకున్న ఆత్మకథలో ఆ సంఘటనలన్నీ ప్రస్తావించారు మంజరి.
Success Story : మాది నిరుపేద కుటుంబం.. మా ఇంట్లో ఆకలి బాధలు చూసే.. సివిల్స్ వైపు నడిచానిలా..
మంజరి కనిపించగానే నేరగాళ్లలో..
వేటగాడు వస్తున్నాడు.. పారిపోండి.. మంజరి కనిపించగానే నేరగాళ్లలో వణుకు మొదలయ్యేది. ప్రాణభయం కనిపించేది. తలో దిక్కు పారిపోయేవారు. అయినా వదిలేవారు కాదు. జింకను తరిమే పులిలా.. వెంటాడి వేటాడి ఊచల వెనక నెట్టేవారు. ఎక్కడ అన్యాయం జరిగినా క్షణాల్లో వాలిపోయేవారు. బాధితులకు న్యాయం జరిగేవరకూ విశ్రమించేవారు కాదు.
బీహార్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో..
ఆమె హయాంలో ప్రవేశపెట్టిన సంస్కరణలు బీహార్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో నేటికీ అమలులో ఉన్నాయి. ఐపీఎస్ అధికారిగా మంజరి అందుకోని శిఖరాలు లేవు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్) స్పెషల్ డైరెక్టర్ జనరల్ హోదాలో ఆమె పదవీ విరమణ చేశారు. భారతదేశంలో తొలి ఐదుగురు మహిళా ఐపీఎస్‌లలో ఆమె ఒకరు. బీహార్ నుంచి ఎంపికైన మొట్టమొదటి మహిళా ఐపీఎస్ కూడా తనే.
ఇలా ఎన్నో సున్నిత అంశాలకు..
బీహార్, ఝార్ఖండ్ రాష్ట్రాల పోలీసు శాఖలు, నేషనల్ పోలీస్ అకాడమీ (ఎన్‌పీఏ), సీఐఎస్‌ఎఫ్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్)లో కీలక పదవులు చేపట్టారు. పదవీ విరమణ తర్వాత.. తన సుదీర్ఘ కెరీర్‌లో ఎదురైన సవాళ్లు, వాటిని అధిగమించిన తీరు, సంక్లిష్ట సమయాల్లో తీసుకున్న కఠిన నిర్ణయాలు.. ఇలా ఎన్నో సున్నిత అంశాలకు అక్షర రూపం ఇచ్చారు. ‘మేడమ్ సర్’ పేరుతో ఆ పుస్తకం ఇటీవలే మార్కెట్‌లో విడుదలైంది. ఇందులో 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లు, బీహార్‌లో లాలు ప్రసాద్ హయాంలో జరిగిన అవినీతి.. తదితర ఆసక్తికర ఘట్టాలూ ఉన్నాయి.
వచ్చిన ఏడాది కాలంలోనే..
బొకారో (ఝార్ఖండ్) ఎస్పీగా మంజరి బాధ్యతలు చేపట్టే నాటికి అక్కడ అరాచకం రాజ్యమేలేది. విద్రోహక శక్తులు పాలన వ్యవస్థను నిర్వీర్యం చేశాయి. దోపిడి ముఠాలకు అంతే లేదు. వీటికి తోడు వామపక్ష తీవ్రవాదం. యువత ఆయుధ సంస్కృతివైపు అడుగులు వేస్తున్న ప్రమాదకర దశ అది. వచ్చీరాగానే మంజరి లోపాలను సరిచేశారు, పాపాలను కడిగేశారు. ఏడాది కాలంలోనే బొకారోను నేర రహిత జిల్లాగా రికార్డులకు ఎక్కించారు.
బొకారో ప్రజలు ట్రాఫిక్ నిబంధనలను పాటించేవారు కాదు. దీంతో ప్రతినిత్యం రోడ్డు ప్రమాద వార్తలే. తన హోదాను పక్కనపెట్టి కూడళ్ల దగ్గర నిలబడ్డారు. ట్రాఫిక్ నిబంధనలు కఠినంగా అమలు చేశారు. ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరి చేశారు. మాట వినని ఉద్యోగులను మెమోలతో హెచ్చరించారు. దీంతో పోలీసు శాఖలో క్రమశిక్షణ మెరుగుపడింది. ట్రాఫిక్ సమస్య కూడా పరిష్కారమైంది.
Inspiring Success Story: ఆ రైతు ఇంట ఐదుగురు అక్కాచెల్లెళ్లు.. అందరూ కలెక్టర్లే.. కానీ..
ఆమె దూకుడు నచ్చే..
మంజరి పట్టుదలను చూసి.. పోలీసు శాఖలో ఆమెను ‘హంటర్‌వాలీ’ అని పిలిచేవారు. ఆ దూకుడు నచ్చే ఝార్ఖండ్ ఆర్మ్‌డ్ పోలీస్ (జేఏపీ) వింగ్‌కు అధినేత్రిని చేసింది సర్కారు. జవాన్ల కుటుంబాల సంక్షేమానికి, ఆరోగ్య సంరక్షణకు, అమరుల పిల్లల చదువులకు అనేక పథకాలు ప్రారంభించారామె. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌లో నేర్చుకున్న విషయాలు ఎంతో ఉపయోగపడ్డాయి. హైదరాబాద్‌లోని నేషనల్ పోలీస్ అకాడమీలో పనిచేసిన ఐదేళ్ల కాలాన్ని తన కెరీర్‌లో అత్యుత్తమ సమయమని చెబుతారు.
UPSC Civils Results 2022: పరీక్ష రాయలేని స్మరణ్‌ను.. అమ్మ గెలిపించిదిలా.. గంటకు 40 పేజీలు..
నా విజయ రహస్యం ఇదే..
ఝార్ఖండ్ ఆర్మ్‌డ్ పోలీస్ విభాగంలో ఉన్నప్పుడు జవాన్ల కుటుంబాలతో పెట్రోలు బంకులు నడిపించారు. ఆ లాభాలతో సిబ్బంది పిల్లలకు కంప్యూటర్ శిక్షణ ఇప్పించారు. పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించారు. జేఏపీ దవాఖానను పునరుద్ధరించి నాణ్యమైన వైద్యాన్ని అందించారు. శుభ్రమైన పడకలను, తాగునీటి సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. ‘ఎక్కడా రాజీపడకపోవడమే నా విజయ రహస్యం, నా ఆనంద రహస్యం, ఆరోగ్య రహస్యమూ’ అంటూ ముక్తాయిస్తారు మంజరి జరుహర్.
నా తల్లిదండ్రులు నా నిర్ణయాన్ని వ్యతిరేకించారు.. కానీ
సివిల్ సర్వీస్ పరీక్షలలో ఉత్తమ ర్యాంకు సాధించిన మంజరి ఏరికోరి ఐపీఎస్ ఎంచుకున్నారు. కానీ తల్లిదండ్రులు ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. అయినా, మంజరి వెనకడుగు వేయలేదు. బిడ్డ పట్టుదలకు తలొగ్గి కన్నవారే మనసు మార్చుకున్నారు.
సివిల్ సర్వీసు పరీక్షలో విజయం సాధించాలంటే..?
‘నేటికీ, దేశంలో కొద్దిమందే మహిళా ఐపీఎస్ అధికారులు ఉన్నారు. వృత్తిపై అపోహలు, సామాజిక పరిస్థితులే ఇందుకు కారణం. మీకు పోలీసు అధికారి కావాలనే బలమైన ఆకాంక్ష ఉంటే, ఈ రోజు నుంచే సాధన ప్రారంభించండి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. ప్రణాళిక ప్రకారం చదువుకొని సివిల్ సర్వీసు పరీక్షలో విజయం సాధించండి’ అని యువతులకు సూచిస్తారు మంజరి.
Ramesh Gholap,IAS officer: మాది నిరుపేద కుటుంబం.. పొట్ట కూటి కోసం గ్రామాల్లో గాజులు అమ్మి