Success Story: ఫస్ట్ అటెంప్ట్‌లోనే.. గురి తప్పకుండా ఐపీఎస్ కొట్టానిలా.. కానీ..
నాలుగు సింహాల్లో అరుదుగా కనపడే ఒక సివంగి రూపా మొద్‌గిల్. ఆడపిల్లలు ఐపీఎస్ చేయడం తక్కువ.అందుకే ఐపీఎస్‌లలో మహిళలు తక్కువే. ఆ తక్కువలో అతి అరుదు రూప. తను నమ్మిన సిద్ధాంతానికి... భారత రాజ్యాంగం తనకిచ్చిన శక్తిని కలుపుతూ, ఖాకీటోపీని కిరీటంలా ధరించింది... రూపా మొద్‌గిల్.
Veditha Reddy, IAS : ఈ సమస్యలే నన్ను చదివించి..ఐఏఎస్ అయ్యేలా చేశాయ్...
ఆ మాట మరిచిపోలేదు..
‘అమ్మా.. నేను పెద్దాయ్యాక ఏమవ్వాలి?’ అమాయకంగా అడిగింది ఓ అయిదేళ్ల పాప వాళ్లమ్మను. ఆ పాప బుగ్గ మీద ముద్దుపెట్టుకుంటూ ‘డాక్టర్ కావాలి’ అని చెప్పింది అమ్మ. ఆమె చేతుల్లోంచి తుర్రుమని పారిపోయి నాన్న ఒళ్లో కూర్చుని అడిగింది ‘నేను పెద్దయ్యాక ఏమవ్వాలి?’ అని.చదువుతున్న న్యూస్ పేపర్‌ను పక్కన పెట్టేసి.. ‘ఎందుకు నాన్నా..’ ముద్దు చేస్తూ అడిగాడు తండ్రి. ‘రేపు మా టీచర్ చెప్పమంది’ అన్నది ఆ పాప. ‘పోలీస్ ఆఫీసర్ అవుతానని చెప్పు’ పాపను గాల్లోకి ఎగరేసి పట్టుకుంటూ సమాధానం ఇచ్చాడు కూతురికి. ‘యెస్ నాన్నా..’ కిందకి దింపగానే సెల్యూట్ చేస్తూ చెప్పి పరిగెత్తి పోయింది.మరుసటిరోజు బడిలో.. టీచర్‌కు చెప్పింది.. ‘నేను పెద్దాయ్యక పోలీస్ ఆఫీసర్ అవుతా’ అని. ఇంక ఆ రోజుకి ఆ మాట అప్పచెప్పేసి మరిచిపోలేదు ఆ అమ్మాయి.
Chandrakala, IAS: ఎక్కడైనా సరే..‘తగ్గేదే లే’
ఈ ఘటనతో ముఖ్యమంత్రి ఉలిక్కిపడ్డాడు..
నాన్న చెప్పిన మాటను ఓ మంత్రంలా జపించింది. ఓ తపస్సులా భావించింది. ముప్పైఏడేళ్లు గడిచాయి.. ఇటీవల.. బెంగుళూరులోని పరప్పన అగ్రహార జైలులో.. జయలలితకు అత్యంత సన్నిహితురాలు, ఏఐఏడిఎమ్‌కే నేత ‘శశికళ ఒక ఖైదీలా కాకుండా.. కోర్టు తీర్పుకి, ఆర్డర్‌కు వ్యతిరేకంగా సర్వభోగాలు అనుభవిస్తోంది.. తనకు నచ్చిన వంటకాలను చేయించుకుని తింటోంది..’ అని చెప్పడమే కాక.. సాక్ష్యంగా వీడియో క్లిప్పింగ్స్‌ను చూపించింది ఓ పోలీస్ ఆఫీసర్. ‘శశికళ ఇలా సొంత కిచెన్ మెయిన్‌టైన్ చేసుకునేలా డీజీపి (డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, జైళ్లు) సత్యనారాయణ రావు ఆమె దగ్గర రెండుకోట్ల రూపాయలు లంచం తీసుకున్నాడు’ అన్న రిపోర్టూ ఇచ్చింది. ఈ విషయం అన్ని భాషల వార్తాపత్రికల్లో, అన్ని టీవీ చానళ్లలో ప్రధాన వార్త అయింది. కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఉలిక్కిపడ్డాడు. వెంటనే ఆ పోలీస్ ఆఫీసర్‌ను బదిలీ చేసేశాడు.. డిఐజీ (డిప్యుటీ ఇన్‌స్పెక్టర్ జనరల్, జైళ్లు)గా ఉన్న ఐపీఎస్‌ను ఐజీగా, ట్రాఫిక్ అండ్ రోడ్‌సేఫ్టీ కమీషనర్‌గా బదిలీ చేశారు.
Srijana IAS: ఓటమి నుంచి విజయం వైపు...కానీ చివరి ప్రయత్నంలో..
ఇవి నాకు..
‘ప్రభుత్వ అధికారులను బదిలీ చేసే హక్కు ప్రభుత్వానికి ఉంది. బదిలీలు నాకు కొత్త కాదు.. నా పదిహేడేళ్ల సర్వీసులో యేడాదికి రెండు ట్రాన్స్‌ఫర్స్ అవుతూనే ఉన్నాయి’ అంటూ చిరునవ్వుతో బదులిచ్చింది ఆ పోలీస్ ఆఫీసర్!ఈ ఐపీఎస్ సంచలనం ఎవరో కాదు.. చిన్నప్పుడు పోలీస్ ఆఫీసర్ అవుతానని చెప్పిన చిన్నారే.కర్నాటక కేడర్ తొలి మహిళా ఐపీఎస్ అధికారిణి.. దివాకర్ రూపా మొద్‌గిల్. ఇప్పుడు వార్తల్లో ఉన్న వ్యక్తి.అన్యాయం చేస్తున్న వాళ్లు ఎంత పెద్దవాళ్లయినా ఆమె లెక్క చేయరు. సాక్ష్యత్తూ ముఖ్యమంత్రి అయినా.. తన ఇమ్మిడియెట్ బాస్ అయినా.. తన సబార్డినేట్ అయినా.. చివరకు పరాయి రాష్ట్రం ముఖ్యమంత్రి అయినా సరే.. కళ్ల ముందు అన్యాయం కనిపించినా.. న్యాయస్థానం ఆర్డరేసినా.. ఆ తీర్పులకు, కర్తవ్యానికి కట్టుబడి ఉంటుంది. సంకెళ్లు వేసేస్తుంది. అందుకే ఆమె కన్నడ అమ్మాయిలకు ఆదర్శం.. యూత్‌కి ఆరాధన, స్ఫూర్తి! సీనియర్ సిటిజన్స్‌కు ముచ్చట. కిరణ్‌బేడీ లాంటి వెటరన్ పోలీస్ ఆఫీసర్స్‌కు ఉత్సాహం! కాబట్టే.. ‘రూపలాంటి ఆఫీసర్స్ మరింత మంది కావాలి.. రావాలి’అంటూ కితాబూ ఇచ్చారు.
Ramesh Gholap,IAS officer: మాది నిరుపేద కుటుంబం.. పొట్ట కూటి కోసం గ్రామాల్లో గాజులు అమ్మి..
తొలి ప్రయత్నంలోనే..
చదువు, అందం, కళలు.. ఈ మూడు ఆమెకు రెండుసార్లు మిస్ దావణగెరె కిరీటాన్ని పెట్టాయి. మిస్ దావణగెరె అనే ఆ కిరీటం ఆమెకు కొత్త కెరీర్ అవకాశాలనే తెచ్చిపెట్టింది. కాని రూప మనసు మార్చుకోలేదు. లక్ష్యాన్ని నిర్లక్ష్యం చేయలేదు. సైకాలజీ, సోషియాలజీ ఐచ్ఛికాలుగా సివిల్స్‌కు ప్రిపేర్ అయింది. ఫస్ట్ అటెంప్ట్‌లోనే 43వ ర్యాంకుతో సివిల్స్ సాధించింది. ఆ ర్యాంక్‌తో ఆమెకు ఐఏఎస్సే వచ్చేది ఈజీగా. రూప దరఖాస్తు చేసుకుంది ఐపీఎస్‌కే. అలా 2000లో ఐపీఎస్ అయింది దివాకర్ రూపా మొద్‌గిల్.
IAS Lakshmisha Success Story: పేపర్‌బాయ్ టూ 'ఐఏఎస్'..సెలవుల్లో పొలం పనులే...
ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడానికి..
ఐపీఎస్ కావాలనే కల కన్నప్పుడు, ఆ కలను నెరవేర్చుకోవడానికి కష్టపడుతున్నప్పుడు, నెరవేరాక కర్తవ్య నిర్వహణలో నిమగ్నమైనప్పుడూ.. ఎందుకు ఐపీఎస్ కావాలనుకుందో ఆ ఆశయాన్ని మర్చిపోలేదు. శాంతిభద్రతలను కాపాడి, కళ్లముందు జరుగుతున్న అన్యాయాలను కట్టడి చేయాలన్న మాటను మరుగున పర్చలేదు. ఈ ప్రయాణంలో ముఖ్యమంత్రులు, నేతలు, అధికారులు, గుమాస్తాలు ఎవరు ఎదురైనా.. ఒకటే తీరుగ స్పందించింది. 1994లో కర్నాటక లోని హుబ్లీలో ఉమాభారతి మీద కేస్ నమోదు అయింది. దానికి సంబంధించిన తీర్పు 2004లో వెలువడింది. ఉమాభారతిని అరెస్ట్ చేయాలని కోర్ట్ తీర్పు ఇచ్చింది. అప్పటికి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన ఆమెను అరెస్ట్ చేసి తీసుకురావడానికి మహామహులైన అధికారులు కూడా జంకుతున్నారు. అప్పుడు హుబ్లీకి ఎస్పీగా ఉన్న రూప బయలుదేరింది ఉమాభారతిని అరెస్ట్ చేయడానికి.
Success Story: తొలి ప్రయత్నంలోనే..ఎలాంటి కోచింగ్ లేకుండా..22 ఏళ్లకే సివిల్స్..
తన పదవికి రాజీనామా ..
ఈ అరెస్ట్ వల్ల ఉమాభారతి తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. తన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యెడ్యూరప్ప పట్లా అదే తీరు రూపది. ఆమె బెంగుళూరు డిసీపి (సిటీ అర్మ్‌డ్ రిజర్వ్)గా ఉన్న సమయంలో అనుమతి లేకుండా పోలీస్ వాహనాలను లోకల్ లీడర్స్, తన పై అధికారులు సైతం ఉపయోగిస్తుండడం.. వాటిని మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఊరేగింపులో తిప్పటం గమనించింది. అంతే క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆ వాహనాలన్నిటినీ తెప్పించేసింది రూప. తాను నమ్మినదానికి కట్టుబడి ఉండడం ఆమె నైజం. తన డిపార్ట్‌మెంట్‌లో అవినీతి పరులను ఎంత ధైర్యంగా ఎండగడుతుందో అవతల వాళ్లు తన డిపార్ట్‌మెంట్‌వైపు వేలెత్తినప్పుడు అంతే అసర్టివ్‌నెస్‌ను చూపిస్తుంది. ఈ మధ్య మైసూరు కొడగు ఎంపి ప్రతాప్ సింహ ట్విట్టర్‌లో ఒక కామెంట్ పెట్టాడు ‘రాష్ట్రంలోని సిన్సియర్ పోలీస్ ఆఫీసర్స్ ఇక్కడ ఇమడలేక సెంట్రల్ గవర్నమెంట్ పోస్టింగ్స్ పట్ల ఆసక్తి చూపిస్తున్నారు’ అని. దీనికి తక్షణమే జవాబు చెప్పింది రూప ట్విట్టర్‌లోనే.. ‘బ్యూరోక్రసీని దయచేసి రాజకీయం చేయొద్దు’ అని. అంటే దిస్ ఈజ్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ మిస్టర్ ఎంపీ...అని చెప్పకనే చెప్పిందన్నమాట. బ్రేవో రూపా!
కుటుంబం :
రూప పుట్టింది, పెరిగింది అంతా కర్నాటక లోని దావణగెరెలోనే. తల్లి హేమవతి. పోస్టల్ డిపార్ట్‌మెంట్ ఉద్యోగిగా రిటైరయ్యారు. తండ్రి జెహెచ్ దివాకర్. బీఎస్‌ఎన్‌ఎల్‌లో ఇంజనీర్‌గా పనిచేసేవారు. ప్రభుత్వ ఉద్యోగులు. రూపా వాళ్లు ఇద్దరు అక్కచెల్లెళ్లు. ఆమె సోదరి పేరు రోహిణి. ఇన్‌కమ్‌టాక్స్ కమిషనర్. రూప చిన్నప్పటినుంచి చురుకే. చదువులోనే కాదు ఆటపాటల్లోనూ ఫస్టే. హిందుస్థానీ సంగీతం నేర్చుకుంది. భరతనాట్య కళాకారిణి కూడా. చిన్నప్పుడు తండ్రి చెప్పిన పోలీస్ ఆఫీసర్ కావాలనే మాట ఆమె మెదడులో అచ్చయిపోయింది. అదే లక్ష్యంగా పెరిగింది. స్కూల్‌డేస్‌లో ఎన్‌సీసీలో జాయిన్ అయింది. దావణగెరెలోని ఏవీకే విమెన్స్‌కాలేజ్‌లో బీఏ చదివింది. గోల్డ్‌మెడల్ తెచ్చుకుంది. బెంగుళూరు యూనివర్శిటీ నుంచి ఎమ్మే సైకాలజీ చేసింది. అందులోనూ యూనివర్శటీ థర్డ్ ర్యాంకర్.
Shiva Kumar goud, DSP: ఆ ఒకే ఒక్క మార్కే..నా జీవితాన్ని మార్చిందిలా..
పెళ్లి :
రూప జలంధర్‌కు చెందిన మునిష్ మొద్‌గిల్‌ను పెళ్లి చేసుకుంది. ఆయన ఒడిషా కేడర్ ఐఏఎస్. రూపతో పెళ్లాయక కర్నాటక కేడర్‌కు మారాడు. వీళ్లకు ఇద్దరు పిల్లలు.. పాప.. అనఘ.. పదకొండేళ్లు. బాబు.. రోషిల్. ఎనిమిదేళ్లు.
Inspiring Story: ఎన్నో అవమానాలు.. అవహేళనలు ఎదుర్కొన్ని తహశీల్దార్ అయ్యానిలా..
గురి తప్పకుండా..
రూపది మంచి గురి. చదువులో అయినా.. కెరీర్ అయినా.. ఒక లక్ష్యం పెట్టుకుందంటే తప్పదు. ఇది రుజవైన సత్యం కూడా. ఏపీఎస్ ట్రైనింగ్‌లోనూ గురి తప్పలేదు ఆమె. షూటింగ్‌లో గురి చూసి కొట్టడంలో ఆమె తర్వాతే ఎవరైనా. నేషనల్ పోలీస్ అకాడమీలో 2000 బ్యాచ్‌లో షార్ప్ షూటర్‌గా పేరు తెచ్చుకుంది. మొత్తం ట్రైనింగ్‌లో అయిదో ర్యాంక్ పొందింది. 2002లో ఉడిపిలో అసిస్టెంట్ సూపిరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా బాధ్యతలతో కెరీర్ ప్రారంభించింది. అనతికాలంలోనే తన శక్తేంటో నిరూపించుకుంది. ఏ జిల్లాలో పోస్ట్ చేస్తే ఆ జిల్లాలో శాంతిభద్రతలను అద్భుతంగా అదుపులో ఉంచింది. లా అండ్ ఆర్డర్‌ను కంట్రోల్ చేస్తూ ఇటు రౌడీ షీటర్స్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. ఇటు లంచగొండులకు వణుకు పుట్టించి లేడీ సింగంగా పేరు తెచ్చుకుంది.
Y.Obulesh, Group 1 Ranker : ప్రభుత్వ స్కూల్‌లో చదివా...ప్రభుత్వ ఉద్యోగం కొట్టానిలా..
డిప్రెషన్‌కు లోనయ్యాను..
మొదటిసారి జైల్ విజిట్ చేసినప్పుడు అక్కడున్న కొంతమంది ఖైదీల వివరాలు తెలుసుకొని ఏడ్చేసింది. ‘ఒకింత డిప్రెషన్‌కు లోనయ్యాను’ అని చెప్పింది. ఖైదీలను నాలుగు ప్రశ్నలు అడిగింది. ఏ నేరం కింద జైలుకి వచ్చారు? ఎన్నాళ్ల నుంచి ఇక్కడ ఉంటున్నారు? ఇంకా ఎన్నేళ్ల శిక్ష ఉంది? పెరోల్ మీద ఎన్నిసార్లు బయటకు వెళ్లివచ్చారు. కొంత మంది ఏ నేరం చేయకుండానే జైలుకి వచ్చామని, ఇంకొంత మంది పన్నేండేళ్ల నుంచి జైల్లోనే ఉంటున్నాం. ఒక్కసారి కూడా పెరోల్ మీద బయటకు వెళ్లలేదు అని, ఇంకొంత మందైతే ఏ జవాబూ చెప్పలేని స్థితిలో ఉన్నారట.
TSPSC Groups Success Tips: ఇలా చదివా.. గ్రూప్–1లో స్టేట్ టాపర్‌గా నిలిచా..
‘కుటుంబాలు నాశనమైన వాళ్లున్నారు, పిల్లలకు దూరమైన వాళ్లు.. నా అన్న వాళ్లను కోల్పోయిన వాళ్లు.. ఇలా ఒకొక్కరిది ఒక్కో కథ.. అవన్నీ వింటుంటే ఏడుపు వచ్చేసింది’ అని చెప్పింది రూప ఒక కన్నడ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో. అందుకే ఆమె జైలు అధికారులకు ఒకటే చెప్పింది.. ‘వాళ్లను ఖైదీలుగా కా కు ండా మనుషులుగా ట్రీట్ చేయాలి. మన శిక్ష, శిక్షణతో వాళ్లలోని నేరప్రవృత్తి మారాలి. కుటుంబం, సమాజం పట్ల సానుకూల దృక్ఫథాన్ని అలవర్చుకున్న మనుషులుగా ఇక్కడి నుంచి బయటకు వెళ్లాలి’ అని!
Groups: గ్రూప్–1&2లో ఉద్యోగం సాధించడం ఎలా ?
జైల్లో శశికళ అనుభవిస్తున్న రాజభోగాల మీద..
జైళ్లకు డిఐజిగా రావడమంటే పనిష్మెంట్‌గా భావిస్తారా అని ఆమె డిఐజి ప్రిజన్స్‌గా చార్జ్ తీసుకున్నప్పుడు ఒక టీవీ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు.. ‘లేదు.. నేను ప్రివిలేజ్‌గా భావిస్తున్నా’ అని సమాధానమిచ్చింది. వచ్చీ రావడంతోనే నియమనిబంధనలకు విరుద్ధంగా జైల్లో శశికళ అనుభవిస్తున్న రాజభోగాల మీద ఫోకస్ చేసింది. వాటిని ఆమెకు అందిస్తున్న అధికారుల మీద నిఘా పెట్టింది. అందులో భాగస్వామిగా ఉన్న తన ఇమ్మిడియెట్ సూపీరియర్ అయినా ఆమె వదిలిపెట్టలేదు. రిపోర్ట్ రాసి పై అధికారులకు పంపింది రూపా మొద్‌గల్.
Inspirational Story: కూలీ పనులు చేస్తూ చదివా.. మూడు ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టానిలా
ఉచితంగా..
జైళ్ల శాఖకు డిఐజీగా చార్జ్ తీసుకున్న మొదటి మహిళా పోలీస్ ఆఫీసర్ రూప. ఆర్థికస్థోమతలేని విచారణ ఖైదీలకు ఉచితంగా లాయర్స్‌ను నియమించే చొరవ తీసుకున్న అధికారి ఆమె. ఇందుకోసం ముగ్గురు లాయర్లను నియమించింది. అంతేకాదు ఖైదీలకు బేకరీల్లో శిక్షణ ఇప్పించే ప్రోగ్రామ్‌ను చేపట్టిన మొదటి డిఐజి కూడా. సంస్కరణలు కాగితాలకే పరిమితం కాక, అమల్లోకి రావాలని విశ్వసించే అధికారి ఆమె. మహిళా ఖైదీల కోసం కూడా తుముకూరులో బేకరీ ట్రైనింగ్ యూనిట్‌ను ప్రారంభించింది. స్త్రీ సాధికారత, స్వావలంబన, చట్టాలు, సమకాలీన రాజకీయ పరిస్థితులు, పోలీస్ ప్రోగ్రామ్స్‌కు సంబంధించి పలు కన్నడ పత్రికల్లో వ్యాసాలు కూడా రాస్తుంటుంది రూపా మొద్‌గిల్.