IAS Officer Salary: ఐఏఎస్ కి ఎంత జీతం వస్తుందంటే... ఇంకా ఇవి కూడా!!
భారతదేశంలో ఒక IAS అధికారి జీతం వారి ర్యాంక్... ఎక్స్పీరియన్స్ పై ఆధారపడి ఉంటుంది. 7th Pay Commission ప్రకారం, IAS అధికారి ప్రాథమిక వేతనం రూ. నెలకు 56,100, క్యాబినెట్ సెక్రటరీ పదవికి రూ.నెలకు 2,50,000.
ఈ కిక్ కోసమే.. IAS ఉద్యోగం వచ్చినా.. కాదని IFS ఉద్యోగం ఎంచుకున్నా..
ప్రాథమిక వేతనంతో పాటు, IAS అధికారులు డియర్‌నెస్ అలవెన్స్ (DA), ఇంటి అద్దె అలవెన్స్ (HRA), ట్రావెల్ అలవెన్స్ (TA) ఇతర ప్రత్యేక అలవెన్స్‌లు కూడా పొందుతారు. IAS అధికారి వాస్తవ జీతం, పోస్టింగ్ చేసే నగరం, రాష్ట్రం, అలాగే వారి పని తీరుపై ఆధారపడి ఉంటుంది.
వివిధ ర్యాంకుల్లో ఉన్న IAS అధికారి ప్రాథమిక వేతనం ఇలా ఉంటుంది:
- సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (SDM): రూ. 56,100
- జిల్లా మేజిస్ట్రేట్ (DM): రూ. 67,700
- డివిజనల్ కమీషనర్: రూ. 87,100
- ప్రిన్సిపల్ సెక్రటరీ: రూ. 1,12,400
- ప్రధాన కార్యదర్శి: రూ. 1,31,100
- క్యాబినెట్ సెక్రటరీ: రూ. 2,50,000
Women IAS Success Story : ఎన్నో అవరోధాలు దాటుకొని సివిల్స్ కొట్టి.. 'ఐఏఎస్' అయ్యానిలా.. కానీ..
ప్రాథమిక జీతం అనేది IAS అధికారి మొత్తం జీతంలో ఒక భాగం మాత్రమే అని గమనించడం ముఖ్యం. వారు పొందే అలవెన్సులు... ఇతర ప్రయోజనాలను బట్టి అసలు జీతం చాలా ఎక్కువగా ఉంటుంది.
IAS అధికారులు అనేక ఇతర ప్రయోజనాలను పొందుతారు, అవి:
- ప్రభుత్వ వసతి
- వైద్య వసతులు
- జీవిత బీమా, ఇతర ఆర్థిక ప్రయోజనాలు
- డ్రైవర్‌తో అధికారిక వాహనం
- భద్రత... ఇతర ప్రోత్సాహకాలు