Women IAS Success Story : ఎన్నో అవరోధాలు దాటుకొని సివిల్స్ కొట్టి.. 'ఐఏఎస్' అయ్యానిలా.. కానీ..
ప్రస్తుతం కుటుంబ మద్దతు, ఆర్థిక భరోసా లేనివారు యూపీఎస్సీ సివిల్స్ గురించి ఆలోచించాలంటే.. భయపడ్డాతారు. కానీ యువతి మాత్రం ఇలాంటి ఎన్నో అవరోధాలు దాటుకొని సివిల్స్ ఎగ్జామ్స్‌లో జాతీయ స్థాయిలో 93వ ర్యాంక్ సాధించింది అందరిని ఆశ్చర్యపరిచింది. ఈమే దీపేష్ కుమారి. ఈమె ఓ వీధి వ్యాపారి కూతురు. ఈ నేపథ్యంలో 'దీపేష్ కుమారి ఐఏఎస్ ఆఫీసర్' సక్సెస్ స్టోరీ మీకోసం..
కుటుంబ నేపథ్యం :
దీపేష్ కుమారి.. రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో అటల్ బ్యాండ్ ప్రాంతానికి చెందిన వారు. తండ్రి గోవింద్. ఈయన గత 25 ఏళ్లుగా వీధుల్లో తినుబండారాలను అమ్ముతున్నారు. ఈయనకు మొత్తం ఐదుగురు పిల్లలు. ఆయన వ్యాపారంతో వచ్చే ఆధాయమే ఈ కుటుంబానికి ఏకైక ఆధారం. కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా గోవింద్ తన పిల్లల చదువు విషయంలో ఎక్కడ కూడా రాజీ పడలేదు. పిల్లలందర్నీ కష్టపడి చదివించారు.
☛ IFS Officer Success Story : ఈ కిక్ కోసమే.. IAS ఉద్యోగం వచ్చినా.. కాదనీ IFS ఉద్యోగం ఎంచుకున్నా..
ఎడ్యకేషన్ :
గోవింద్ ఐదుగురు సంతానంలో పెద్ద అమ్మాయి.. దీపేష్ కుమారి. ఈమె చిన్నతనం నుంచి చాలా తెలివైన, చురుకైన స్టూడెంట్. దీపేష్ శిశు ఆదర్శ్ విద్యా మందిర్‌లో పాఠశాల విద్యను పూర్తి చేసింది. 10వ తరగతిలో 98% మార్కులతో ఉత్తీర్ణత సాధించారు. అలాగే 12వ తరగతిలో 89% మార్కులతో పాస్ అయ్యారు. ఆ తరువాత ఆమె సివిల్ ఇంజనీరింగ్ చదవాలనుకుంది. అందుకు జోధ్‌పూర్ కాలేజీలో చేరింది. అనంతరం ఐఐటీ బాంబేలో ఎంటెక్ పూర్తి చేసింది.
ఎన్నో అవరోధాలు దాటుకొని సివిల్స్ వైపుకు..
యూపీఎస్సీ(UPSC) సివిల్స్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలని ఎంతో మంది కలలు కంటుంటారు. కానీ అది అంత సులభమైన పని కాదు. ఎందుకంటే ఎంతో కష్టపడితే కానీ యూపీఎస్సీ సివిల్స్‌లో విజయం సాధించలేరు. కుటుంబ మద్దతు, ఆర్థిక భరోసా లేనివారు సివిల్స్ గురించే ఆలోచించరు. ఎందుకంటే పుస్తకాల కోసం, మెటీరీయల్స్ కోసం ఎంతో డబ్బు వెచ్చించాల్సి ఉంటుంది. అన్నీ దాటుకుని పరీక్షలు రాసినా, అందరికీ మంచి మార్కులు రావు. ఇలాంటి ఎన్నో అవరోధాలు దాటుకొని సివిల్స్ ఎగ్జామ్స్‌లో ఆలిండియా 93వ ర్యాంక్ సాధించారు దీపేష్ కుమారి.
సాధారణంగా యూపీఎస్సీ సివిల్స్ రిజల్ట్స్ వచ్చాయంటే.. ర్యాంకులు సాధించిన వారిలో చాలా మంది విజయగాథల గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటాం. ఎందరో అభ్యర్థులు సాధించిన విజయాలు.. వారి సక్సెస్ స్టోరీలు చూశాం. వీటిలో కొన్ని విజయగాథలు మాత్రం శాశ్వతంగా గుర్తుండిపోతాయి. వాటిలో రాజస్థాన్‌కు చెందిన ఐఏఎస్ దీపేష్ కుమారి సక్సెస్ స్టోరీ ఒకటి శాశ్వతంగా గుర్తుండిపోతుంది. అలాగే ఈమె సక్సెస్ జర్నీ నలుగురికి ఆదర్శంగా ఉంటుంది.
రెండవ ప్రయత్నంలో సివల్స్ కొట్టిందిలా..
దీపేష్ కుమారి చదువుల్లో రాణించడంతో పాటు.. చాలా సింపుల్‌గా ఉద్యోగం పొందింది. అయితే సివిల్ సర్వీసెస్‌లో చేరాలనేది ఆమె కల. దీంతో ఈమె యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నిర్వహించే సివిల్స్ పరీక్షలకు ప్రిపరేషన్ ప్రారంభించింది. ఆమె కృషితో రెండవ ప్రయత్నంలోనే సివిల్స్ కొట్టింది. UPSC సివిల్స్ రిజల్ట్స్(2021)లో ఆలిండియా 93వ ర్యాంకు సాధించి ఐఏఎస్(IAS) ఉద్యోగానికి ఎంపికైంది.
వీరి సహాకారంతోనే..
దీపేష్ కుమారి.. విజయం సాధించడంలో ఆమె కుటుంబం చేసిన ప్రోత్సాహం అంతా ఇంతా కాదు. ఆమె తల్లి ఎప్పుడూ వెంట ఉంటూ ముందుకు నడిపించింది. ఎల్లప్పుడూ ఆమెను ప్రోత్సహించింది. యూపీఎస్సీ (UPSC) సివిల్స్ పరీక్షలో విజయం సాధించడానికి అవసరమైన భరోసాతో పాటు కుటుంబం మొత్తం ఈమెకు మద్దతుగా నిలిచింది.
కూతురు.. ఐఏఎస్ ఆఫీసర్ అయిన కూడా..
దీపేష్ కుమారి.. ఐఏఎస్ అయిన తర్వాత కూడా గోవింద్ తన దుకాణాన్ని కొనసాగిస్తున్నాడు. ఇప్పటికీ చిన్న ఇంట్లోనే ఉంటున్నారు. దీపేష్ కుమారి తోబుట్టువులు కూడా చదువుల్లో ముందున్నారు. ఆమె సోదరులలో ఇద్దరు బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్, బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ (MBBS) చదువుతున్నారు. ఆమె సోదరి డాక్టర్ అయింది. మరొక సోదరుడు తండ్రికి పనిలో సహాయం చేస్తున్నాడు.
Tags
- UPSC Civils Interviews
- UPSC Civils Ranker Success Story
- upsc civils ranker success story in telugu
- deepesh kumari ias
- deepesh kumari ias success story
- deepesh kumari ias inspire story in telugu
- Competitive Exams Success Stories
- Civil Services Success Stories
- Success Stories
- civils success stories
- Success Story
- Inspire
- Sakshi Education Success Stories