Skip to main content

UPSC Rankers: యూపీఎస్‌సీ ర్యాంకర్లకు సీఎం అభినందన

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యూపీఎస్‌సీ ర్యాంకర్లను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు.
CM congratulates UPSC rankers
రాష్ట్రానికి చెందిన యూపీఎస్‌సీ ర్యాంకర్లతో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సీఎం క్యాంపు కార్యాలయంలో జూన్‌ 23న ఏపీకి చెందిన 17 మంది యూపీఎస్‌సీ(సీఎస్‌ఈ)–2022 బ్యాచ్‌ ర్యాంకర్లు సీఎం జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా ర్యాంకర్ల కుటుంబ నేపథ్యం, విద్యార్హతలు, సివిల్స్‌ ప్రిపరేషన్‌కు సంబంధించిన వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ముందుండాలని, మంచి పరిపాలనలో భాగస్వాములై ప్రజా సేవలో తనదైన ముద్ర వేయాలని వారికి సూచించారు.

చదవండి: UPSC Civils Ranker Success Story : ఈ సివిల్స్ ర్యాంక‌ర్ స్టోరీ చ‌దివితే.. కళ్లు చెమర్చక త‌ప్ప‌దు.. పేజీలు కూడా తిప్పలేని పరిస్థితి నాది.. కానీ..

CM congratulates UPSC rankers

 

సీఎంను కలిసిన వారిలో జీవీఎస్‌ పవన్‌ దత్తా–తిరుపతి (ర్యాంక్‌ 22), ఎం.శ్రీ ప్రణవ్‌–గుంటూరు (60), ఎల్‌.అంబికా జైన్‌– కర్నూలు (69), షేక్‌ హబీబుల్లా– కర్నూలు (189), కేపీఎస్‌ సాహిత్య– వైజాగ్‌ (243), బి.ఉమామహేశ్వర రెడ్డి– కదిరి (270), పి.విష్ణువర్ధన్‌ రెడ్డి– విజయవాడ (292), వి.లక్ష్మీసుజాత– మార్టూరు (311), బి.వినూత్న– ఒంగోలు (462), సి.సమీర్‌ రాజా– ఆదోని (464), ఆర్‌.నవీన్‌ చక్రవర్తి– తాళ్లచెరువు, పల్నాడు జిల్లా (550), వైయూఎస్‌ఎల్‌ రమణి– ఎదరాడ, బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా (583), టి.హేమంత్‌– చిలకలూరిపేట (593), పి.భార్గవ్‌– విజయనగరం (772), కె.శ్రీకాంత్‌ రెడ్డి– శిరిగిరిపాడు, పల్నాడు జిల్లా (801), ఎం.సుజిత్‌ సంపత్‌– నందిగామ (805), ఎన్‌.కృపాకర్‌– కడప (866) ఉన్నారు. 

చదవండి: Inspirational IAS Success Story : డబ్బు కోసం ఆ ప‌ని చేశా.. చివ‌రికి ఇలా చ‌దివి ఐఏఎస్ ఆఫీస‌ర్ అయ్యానిలా.. కానీ..

CM congratulates UPSC rankers

 

Published date : 24 Jun 2023 05:39PM

Photo Stories