UPSC Civils Ranker Success Story : ఈ సివిల్స్ ర్యాంకర్ స్టోరీ చదివితే.. కళ్లు చెమర్చక తప్పదు.. పేజీలు కూడా తిప్పలేని పరిస్థితి నాది.. కానీ..
కేరళ వయనాడ్‌కు చెందిన షెరిన్ షహానా కథ వింటే కళ్లు చెమర్చక మానవు. ఐదేళ్ల క్రితం అందరిలాగానే అన్ని పనులు చేసుకునే ఆమె.. ఆ సమయంలో ఇంటి టెర్రస్‌పై నుంచి ప్రమాదవశాత్తూ కింద పడిపోయింది. దీంతో రెండుచోట్ల పక్కటెముకలు విరగడంతో పాటు వెన్నెముకకు గాయాలయ్యాయి. రెండు చేతులు, కింది శరీర భాగం పక్షవాతంతో చచ్చుబడిపోయింది.
ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లోనూ పాజిటివ్‌గా ఆలోచించింది షెరిన్. శారీరక లోపాల్ని అధిగమించి.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలనుకుంది. ఇదే సివిల్స్ సాధించాలన్న పట్టుదల తనలో పెంచిందంటోందామె.
రెండేళ్ల పాటు మంచానికే..
ప్రమాదం తర్వాత నా జీవితం పునఃప్రారంభించినట్లనిపించింది. రెండేళ్ల పాటు మంచానికే పరిమితమయ్యా. అయితే అదే సమయంలో నా శారీరక లోపాన్ని అధిగమించాలనుకున్నా.. నాకు సాధ్యమయ్యేవి, సాధ్యం కానివి విభజించుకొని ముందుకు సాగాను. ఇదే నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది.
ట్యూషన్స్ చెబుతూనే.. మరోవైపు..
పొలిటికల్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేశా. ఓవైపు పిల్లలకు ట్యూషన్స్ చెబుతూనే.. మరోవైపు యూజీసీ పరీక్ష రాశాను. సివిల్స్‌కీ సన్నద్ధమయ్యాను. నా శారీరక లోపం కారణంగా కనీసం పేజీలు కూడా తిప్పలేని పరిస్థితి. అయినా మరొకరి సహాయంతో పరీక్ష రాశాను. యూపీఎస్సీ సివిల్స్‌లో జాతీయ స్థాయిలో 913 ర్యాంకు వచ్చింది.
Success Story: కోటి జీతాన్ని వదులుకుని.. తొలి ప్రయత్నంలో ఐఏఎస్
ఇటీవలే క్యాలికట్ యూనివర్సిటీలో పీహెచ్‌డీలో చేరాను. ఉద్యోగంలో స్థిరపడ్డా నేర్చుకోవడం మాత్రం ఆపను..అంటోంది షెరిన్. మరో సారి కూడా విధి నాతో ఆడుకుందిలా.. యూపీఎస్సీ-2022 ఫలితాలొచ్చిన సమయంలోనూ కారు ప్రమాదానికి గురై ఆస్పత్రి బెడ్ పైనే ఆమె ఫలితాలు చూసుకున్నా.
అంగవైకల్యం శరీరానికే.. కానీ మన లక్ష్యానికి కాదని నిరూపించింది ఈమె
ఒక వైపు అంగవైకల్యం బాధిస్తున్న.. మరో వైపు ఒక బలమైన సంకల్పంతో యూపీఎస్సీ సివిల్స్-2022 ఫలితాల్లో ఆల్ ఇండియా 913వ ర్యాంక్ సాధించారు షెరిన్ షహానా. ఈ కథ మన అందరికి ఆదర్శం.