Skip to main content

IAS Family Success Story: మా కుటుంబంలో ముగ్గురం 'ఐఏఎస్‌' ల‌మే.. మా విజ‌య ర‌హ‌స్యం ఇదే..

యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (UPSC) నిర్వ‌హించే ప‌రీక్ష‌ల్లో సివిల్స్ ఉత్తీర్ణ‌త సాధించాలంటే.. ఎంతో ప‌ట్టుద‌ల‌... ఉన్న‌త‌మైన కోచింగ్ ఉండాలి. సివిల్స్ విజేత అనుషా పిళ్ళై ఎంతో క‌ష్ట‌ప‌డి చ‌దివి అనుకున్న ల‌క్ష్యం సాధించారు.
అనుషా పిళ్ళై ఐఏఎస్ కుటుంబం   Anusha Pillai celebrating success in UPSC exams

ఈ నేప‌థ్యంలో సివిల్స్‌లో విజేత అనుషా పిళ్ళై ఎలా చ‌దివి.. విజ‌యం సాధించారు...? తన విజ‌యంకు కార‌ణం ఏమిటి..? మొద‌లైన విష‌యాలు మీకోసం..

మేం ముగ్గురం...

ias success story in telugu

మా అమ్మ శ్రీమతి రేణు గోనెల పిళ్ళై. ఈమె 1990 బ్యాచ్‌కి చెందిన‌ ఐఏఎస్ ఆఫీస‌ర్‌. మా అన్నయ్య అక్షయ్ పిళ్ళై. ఈయ‌న కూడా ఐఏఎస్‌. మా అన్న అక్షయ్ పిళ్ళై 2021 సివిల్స్ టాపర్‌గా నిలిచారు. ఇది నిజంగా థ్రిల్లింగ్ ఎక్స్ పీరియెన్స్ అని 2023 సివిల్స్ విజేత అనుషా పిళ్ళై అన్నారు.

☛ Civils 2023 Ranker Hanitha Inspire Success Story : కాలం కదలలేని స్థితిలో పడేస్తే.. ఈమె సంకల్పం సివిల్స్ కొట్టేలా చేసిందిలా.. కానీ..

నా సివిల్స్ ప్ర‌యాణం ఇలా..

Anusha Pillay IAS Success Story in Telugu

నేను రాయ్పూర్ ఎన్.ఐ.టి. నుంచి 2021లో ఇంజనీరింగ్ (మెటలర్జికల్) పూర్తి చేసిన చేశారు. నేను యూపీఎస్సీ సివిల్స్లో ఆంత్రోపాలజి ఆప్షనల్ సబ్జక్ట్ తీసుకోని.. జాతీయ స్థాయిలో 202 ర్యాంక్ సాధించాను. ఇది నా రెండో అటెంప్ట్. నా సివిల్స్ ప్రిపరేషన్ ప్రతి దశలోనూ ఆర్సీరెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్ కోచింగ్ నాకు హెల్ప్ అయింది. నా ప్రిప‌రేష‌న్‌ సమయంలో ఇచ్చిన హై ఇన్ఫాక్ట్ రివిజన్ కోర్స్ చాలా ఉపయోగ పడింది. మెయిన్స్‌లో ఏ ఆప్షనల్ సబ్జెక్ట్ తీసుకోవాలన్న సంశయం ఎదురైనప్పుడు ఇన్స్టిట్యూట్లో సీనియర్ ఫ్యాకల్టీతో చర్చించి, ఆంత్రోపాలజీ సబ్జెక్ట్‌ను ఆప్షనల్‌గా ఎంపిక చేసుకున్నాను. 

దీని వలన సివిల్స్‌ మెయిన్స్‌ నుంచి మంచి మార్కులు, ఫైన‌ల్‌ మంచి ర్యాంక్ వచ్చింది.  సివిల్స్ ఇంటర్వ్యూ సమయంలో ఇన్‌స్టిట్యూట్‌ల్లో మాక్ ఇంటర్వ్యూ తీసుకోవడం.. రామచంద్రారెడ్డి గారు నాకోసం వ్యక్తిగతంగా సమయం కేటాయించి ఎన్నో విలువైన సలహాలనివ్వడం నాకెంతో సహాయ పడిందని అనూష చెప్పారు. 

మా కుటుంబం మూడు తరాలుగా..

Renu Gonela Pillay IAS Family Success Story

మా కుటుంబం మూడు తరాలుగా సివిల్ సర్వెంట్స్ గా దేశానికి సేవలందిస్తూ ఉండడం విశేషం. అనూష తాతగారు ఆర్.కె. గోనెల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐ.ఏ.ఎస్. అధికారిగా పనిచేసి పదవీ నిరమణ చేసారు. ఆయన కుమార్తె రేణు గోనెల ఐ.ఏ.ఎస్. అధికారిగా ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో పని చేస్తున్నారు. రేణు గోనెల భర్త సంజయ్ పిళ్ళై సైతం ఐ.పి.ఎస్. (1998 బ్యాచ్) అధికారిగా అదే రాష్ట్రంలో పని చేస్తున్నారు. రేణు గోనెల కుమారుడు అక్షయ్ (2021 సివిల్స్ ఐ.ఏ.ఎస్) కుమార్తె అనూషా... మూడు తరాల సివిల్స్ విజయగాథలకు స్ఫూర్తిగా నిలిచారు.

డిగ్రీ చదివే రోజుల నుంచే..
డిగ్రీ చదివే రోజుల నుంచే సివిల్స్ పై అవగాహన పెంచుకుని.. కోచింగ్ లేదా మంచి గైడెన్స్ సహాయంతో ఎగ్జామ్ ఓరియెంటేషన్‌ ప్రిపేర్ అయితే మొదటి ప్రయత్నంలోనే సివిల్స్ సక్సెస్ సాధ్యమే. సివిల్స్ రాయాలని నేను ఇంజనీరింగ్ చదివే రోజుల్లోనే నిర్ణయించుకున్నా. అమ్మా, నాన్నలతో పాటు మా తాతగారి (ఆర్.కె. గోనెల, రిటైర్డ్ ఐ.ఏ.ఎస్) ప్రభావం నాపై చాలా ఉంది. సివిల్స్ రాయాలని నిర్ణయించుకున్నాక, ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చేసేప్పుడే మా తాతగారు నన్ను రామచంద్రారెడ్డి(RC Reddy)గారి దగ్గరకు తీసుకువెళ్ళారు. ఈయ‌న నాకు ప్రిపరేషన్‌కు సంబంధించిన ఎన్నో విలువైన విషయాలు చెప్పారు.

☛ UPSC Civils 1st Ranker Aditya Srivastava Story : సివిల్స్‌లో నా నెం-1కి ప్లాన్ ఇదే.. శ్రీవాత్సవ నుంచి విద్యార్థులు నేర్చుకోవాల్సిన మంచి విష‌యాలు ఇవే..

రాయ్ పూర్ ఎన్.ఐ.టి నుంచి 2017లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన అక్షయ్ పిళ్ళై 2021 సివిల్స్ ఫలితాల్లో జాతీయ స్థాయిలో 51వ ర్యాంక్‌తో ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. అక్షయ్ సోదరి అనూషా పిళ్ళై ఈ ఏడాది సివిల్స్ ఫలితాల్లో విజయం సాధించడం సివిల్స్ కలలను నిజం చేసుకోవాలనుకునే ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిచ్చే అంశం.

Published date : 13 Jun 2024 08:30AM

Photo Stories