NFAT-2023: వినూత్న కెరీర్.. ఫోరెన్సిక్ ఎక్స్‌పర్ట్!
- నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ అడ్మిషన్ నోటిఫికేషన్
- ఫోరెన్సిక్ సైన్స్, క్రిమినాలజీ, సైబర్ సెక్యూరిటీ విభాగాల్లో కోర్సులు
- నేషనల్ ఫోరెన్సిక్ అడ్మిషన్ టెస్ట్(ఎన్‌ఎఫ్‌ఏటీ) ద్వారా ప్రవేశాలు
- ఫోరెన్సిక్ సైన్స్ కోర్సులతో ఉపాధి అవకాశాలకు మార్గం
ఫోరెన్సిక్ సైన్స్, డిజిటల్ ఫోరెన్సిక్స్, సైబర్ సెక్యూరిటీ, క్రిమినాలజీ, సైకాలజీ, బిహేవియరల్ సైన్స్ తదితర విభాగాల్లో నిపుణులను తీర్చిదిద్దే ఉద్దేశంతో నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ పలు కోర్సులు అందిస్తోంది. జాతీయ ప్రాధాన్యం గల సంస్థ(ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్) హోదా ఉన్న ఈ వర్సిటీలో కోర్సులు పూర్తి చేసుకుంటే.. విస్తృత కెరీర్ అవకాశాలు అందుకోవచ్చు.
9 క్యాంపస్‌లు.. 2,462 సీట్లు
మూడేళ్ల క్రితం ఏర్పాటైన ఎన్‌ఎఫ్‌ఎస్‌యూ.. ప్రస్తుతం తొమ్మిది(గుజరాత్, ఢిల్లీ, గోవా, త్రిపుర, భోపాల్, పుణె, గువహటి, మణిపూర్, ధర్వాడ్) క్యాంపస్‌ల ద్వారా పీహెచ్‌డీ, పీజీ, బీటెక్, బీఎస్సీ, బీఏ, ఎంబీఏ, లా, క్రిమినాలజీ, సైకాలజీ తదితర వినూత్న కోర్సులు అందిస్తోంది. ఇందులో పీహెచ్‌డీ మొదలు పీజీ డిప్లొమా వరకు.. పలు విభాగాల్లో 2,462 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
చదవండి: Career Opportunities: సైబర్ సెక్యూరిటీ.. భవితకు భరోసా!
ఇంటిగ్రేటెడ్ కోర్సులు
ఎన్‌ఎఫ్‌ఎస్‌యూ..ఇంటిగ్రేటెడ్ కోర్సులు కూడా అందిస్తోంది. అయిదేళ్ల వ్యవధిలో.. బీఎస్సీ+ఎమ్మెస్సీ(ఫోరెన్సిక్ సైన్స్), బీటెక్+ఎంటెక్ సీఎస్‌ఈ(సైబర్ సెక్యూరిటీ), బీఏ+ఎంఏ(క్రిమినాలజీ), బీబీఏ+ఎంబీఏ(ఫోరెన్సిక్ ఆడిటింగ్ అండ్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్/ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్/బిజినెస్ అనలిటిక్స్ అండ్ ఇంటెలిజెన్స్), బీబీఏ+ఎల్‌ఎల్‌బీ(ఆనర్స్), బీఎస్సీ+ఎల్‌ఎల్‌బీ(ఆనర్స్) కోర్సులను అందిస్తోంది. వీటికి ఇంటర్మీడియెట్ అర్హతగా నిర్దేశించారు. ఎల్‌ఎల్‌బీ కోర్సులకు సంబంధించి క్లాట్ ఉత్తీర్ణతను అర్హతగా నిర్దేశిస్తున్నారు.
కోర్సులు-అర్హతలు
- ఎమ్మెస్సీ: ఫోరెన్సిక్ సైన్స్, ఫోరెన్సిక్ బయో టెక్నాలజీ, మల్టీ మీడియా ఫోరెన్సిక్స్; ఎమ్మెస్సీ సైబర్ సెక్యూరిటీ, ఎమ్మెస్సీ-డిజిటల్ ఫోరెన్సిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎమ్మెస్సీ హోంల్యాండ్ సెక్యూరిటీ, ఎమ్మెస్సీ ఫుడ్ టెక్నాలజీ(ఫోరెన్సిక్ ఫుడ్ అనాలిసిస్ స్పెషలైజేషన్), క్లినికల్ సైకాలజీ, న్యూరో సైకాలజీ, ఫోరెన్సిక్ సైకాలజీ, టాక్సికాలజీ; ఎమ్మెస్సీ కెమిస్ట్రీ(ఫోరెన్సిక్ అనలిటికల్ కెమిస్ట్రీ స్పెషలైజేషన్); ఎమ్మెస్సీ ఎన్విరాన్‌మెంటల్ సైన్స్(ఎన్విరాన్‌మెంటల్ ఫోరెన్సిక్స్ స్పెషలైజేషన్); ఎమ్మెస్సీ ఫార్మాస్యుటికల్ కెమిస్ట్రీ స్పెషలైజేషన్లు.
- అర్హత: ఆయా కోర్సులను అనుసరించి బ్యాచిలర్ డిగ్రీ, బీటెక్‌లో సంబంధిత సబ్జెక్ట్‌ల్లో 55 లేదా 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత ఉండాలి.
- ఎంఏ కోర్సులు: మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం(ఫోరెన్సిక్ జర్నలిజం స్పెషలైజేషన్), పోలీస్ అండ్ సెక్యూరిటీ స్టడీస్, క్రిమినాలజీ(ఫోరెన్సిక్ సైకాలజీ స్పెషలైజేషన్); అర్హత: 55 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి.
- ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులు: బీఎస్సీ+ఎమ్మెసీ ఫోరెన్సిక్ సైన్స్; అర్హత: ఇంటర్మీడియెట్‌లో ఎంపీసీ లేదా బైపీసీ గ్రూప్‌లలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
- బీటెక్+ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (సైబర్ సెక్యూరిటీ): అర్హత: ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ గ్రూప్ సబ్జెక్ట్‌లుగా చదవడంతోపాటు కెమిస్ట్రీ/బయాలజీ/ఇన్ఫర్మేషన్ ప్రాక్టీసెస్/బయోటెక్నాలజీ/టెక్నికల్ ఒకేషనల్ సబ్జెక్ట్స్/ బిజినెస్ స్టడీస్/ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సబ్జెక్ట్‌లతో 60 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులవ్వాలి.
- బీఏ+ఎంఏ(క్రిమినాలజీ): అర్హత: 60 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత ఉండాలి.
- బీబీఏ+ఎంబీఏ(ఫోరెన్సిక్ ఆడిట్ అండ్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్/ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్/బిజినెస్ అనలిటిక్స్ అండ్ ఇంటెలిజెన్స్ స్పెషలైజేషన్స్): అర్హత: 60 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత ఉండాలి.
- బీబీఏ+ఎల్‌ఎల్‌బీ(ఆనర్స్),బీఎస్సీ+ఎల్‌ఎల్‌బీ(ఆనర్స్): అర్హత: 50 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణతతోపాటు క్లాట్ ఉత్తీర్ణత ఉండాలి.
- ఎంటెక్ ప్రోగ్రామ్‌లు: ఎంటెక్(సైబర్ సెక్యూరిటీ), ఎంటెక్-ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటాసైన్స్(సైబర్ సెక్యూరిటీ స్పెషలైజేషన్); ఎంటెక్ సివిల్ ఇంజనీరింగ్(ఫోరెన్సిక్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్); ఎంటెక్ రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్, ఎంటెక్-అప్లైడ్ డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.
- అర్హత: ఆయా కోర్సులను అనుసరించి బీటెక్(సీఎస్‌ఈ/ఐటీ/ఈసీఈ) లేదా ఎంసీఏ కోర్సులో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత ఉండాలి.
- మేనేజ్‌మెంట్ పీజీ కోర్సులు: ఎంబీఏ-ఫోరెన్సిక్ ఆడిటింగ్ అండ్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్, ఎంబీఏ-బిజినెస్ అనలిటిక్స్, ఎంబీఏ-హాస్పిటల్ అండ్ హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్, అర్హత: 55 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.
- ఎంబీఏ సైబర్ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్: అర్హత: ఐటీ/కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్‌లలో బీఎస్సీ లేదా సైబర్ ఫోరెన్సిక్/కంప్యూటర్ ఫోరెన్సిక్/సైబర్ సెక్యూరిటీ సబ్జెక్ట్‌లతో బీఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్‌లో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత ఉండాలి.
చదవండి: Tech skills: సైబర్ సెక్యూరిటీ.. కెరీర్ అవకాశాలు, అర్హతలు, నైపుణ్యాలు అందుకునేందుకు మార్గాలు
ఫార్మసీ-పీజీ కోర్సులు
- ఎం.ఫార్మసీ(ఫోరెన్సిక్ ఫార్మసీ స్పెషలైజేషన్), ఎం.ఫార్మసీ(ఫార్మాస్యుటికల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్పెషలైజేషన్); అర్హత: 55 శాతం మార్కులతో బి-ఫార్మసీ ఉత్తీర్ణత ఉండాలి; -ఎమ్మెస్సీ ఫార్మాస్యుటికల్ కెమిస్ట్రీ: అర్హత: సైన్స్/ఫార్మసీ/ మెడిసిన్/ఇంజనీరింగ్‌లలో 55 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.
'లా' ప్రోగ్రామ్స్
- ఎల్‌ఎల్‌ఎం(సైబర్ లా అండ్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్), ఎల్‌ఎల్‌ఎం(క్రిమినల్ లా అండ్ క్రిమినల్ జస్టిస్ అడ్మినిస్ట్రేషన్): అర్హత: ఎల్‌ఎల్‌బీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణతతోపాటు పీజీ-క్లాట్ ఎంట్రన్స్‌లో ఉత్తీర్ణత ఉండాలి.
- ఎల్‌ఎల్‌బీ(ఆనర్స్): అర్హత: 45 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. ఎన్‌ఎఫ్‌ఏటీ ఎంట్రన్స్‌లో ఉత్తీర్ణత ఉండాలి.
ఇతర కోర్సులు
- డిప్లొమా ఇన్ కెనైన్ సైన్సెస్: అర్హత: డిప్లొమా ఇన్ పోలీస్ డాగ్ హ్యాండ్లింగ్ ఉత్తీర్ణత లేదా 50 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణతతోపాటు డాగ్ హ్యాండ్లర్‌గా మూడేళ్ల అనుభవం ఉండాలి.
- ఎం.ఫిల్(క్రిమినల్ సైకాలజీ): అర్హత: సైకాలజీ స్పెషలైజేషన్‌తో ఎంఏ లేదా ఎమ్మెస్సీలో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత ఉండాలి.
- పీహెచ్‌డీ: ఫోరెన్సిక్స్ అండ్ అల్లైడ్ సైన్సెస్.
- వివిధ విభాగాల్లో పీజీ డిప్లొమా కోర్సులు: అర్హత: ఆయా కోర్సులను అనుసరించి బ్యాచిలర్/పీజీ స్థాయిలో..బయాలజీ, బయో కెమిస్టీ, బయోటెక్నాలజీ/ఫోరెన్సిక్ సైన్సెస్/మెడిసిన్/ఫార్మసీ/అగ్రికల్చర్ సైన్స్/ఎన్విరాన్‌మెంటల్ సైన్స్/కెమిస్ట్రీ /బీటెక్(సీఎస్‌ఈ/ఐటీ/ఈసీఈ)/ఆయుష్ కోర్సులలో 50 లేదా 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత ఉండాలి.
ఎన్‌ఎఫ్‌ఏటీ స్కోర్‌తో ప్రవేశం
- దాదాపు 60కిపైగా కోర్సులను అందిస్తున్న ఎన్‌ఎఫ్‌ఎస్‌యూ.. వీటిల్లో ప్రవేశానికి జాతీయ స్థాయిలో ఎన్‌ఎఫ్‌ఏటీ నిర్వహిస్తోంది. వంద ప్రశ్నలతో వంద మార్కులకు ఆన్‌లైన్ విధానంలో ఈ పరీక్ష ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు తగ్గిస్తారు. పరీక్ష సమయం గంటన్నర.
- పీజీ డిప్లొమా కోర్సులకు నిర్దేశిత విద్యార్హతల ఆధారంగా మెరిట్ జాబితా రూపొందించి కౌన్సెలింగ్‌కు పిలుస్తారు. ఈ కోర్సుల అభ్యర్థులు ఎన్‌ఎఫ్‌ఏటీకి హాజరవ్వాల్సిన అవసరం లేదు. ఎం.ఫిల్, పీహెచ్‌డీ కోర్సులకు ఎంట్రన్స్ టెస్ట్‌తోపాటు ఇంటర్వ్యూ కూడా నిర్వహిస్తారు.
చదవండి: Career Planning: ఒకే ఒక్క నిర్ణయం.. మీ జీవిత గమనాన్నే మార్చేస్తుంది
కొలువులు ఖాయం
- ఫొరెన్సిక్ కోర్సుల ఉత్తీర్ణులకు క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేటర్, ఫోరెన్సిక్ సైకియాట్రిస్ట్, ఫోరెన్సిక్ టాక్సికాలజిస్ట్, ఫోరెన్సిక్ స్పీచ్ ఎక్స్‌పర్ట్స్, పాథాలజిస్ట్, ఫోరెన్సిక్ ఆడిటింగ్ వంటి ఉద్యోగాలు లభిస్తాయి.
- ప్రభుత్వ రంగంలో సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీలు, ఫింగర్ ప్రింట్ బ్యూరోలు, ప్రాంతీయ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్స్, సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్, పోలీస్ డిపార్ట్‌మెంట్, సీబీఐ, ఐబీ వంటి ప్రభుత్వ శాఖల్లో కొలువులు సొంతం చేసుకోవచ్చు.
- ప్రైవేట్ రంగంలో ఫార్మాస్యుటికల్ సంస్థలు, ఆస్పత్రులు, ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీలు ప్రధాన ఉపాధి వేదికలుగా నిలుస్తున్నాయి. వీటితోపాటు విద్యా రంగంలోనూ అధ్యాపకులుగా కెరీర్ ప్రారంభించొచ్చు.
- ఫోరెన్సిక్ విభాగంలో కొలువులు సొంతం చేసుకున్న వారికి నెలకు రూ.50 వేల వరకు వేతనం లభిస్తోంది.
ముఖ్య సమాచారం
- ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: మే 29, 2023
- ఎన్‌ఎఫ్‌ఏటీ పరీక్ష తేదీ: జూలై 1, 2 తేదీల్లో
- తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.nfsu.ac.in/, https://www.nta.ac.in/