Skip to main content

12,828 Government Jobs After 10th: జీడీఎస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌.. ఎంపిక విధానం ఇలా‌..

తపాల విభాగంలో పోస్టుల భర్తీకి గ్రామీణ డాక్‌ సేవక్‌(జీడీఎస్‌) ప్రకటన విడుదలైంది. దీనిద్వారా ద్వారా దేశవ్యాప్తంగా 12,828 జీడీఎస్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే పదో తరగతిలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా నియామకం చేపట్టనున్నారు. వీటికి ఎంపికైన వారు బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌ (బీపీఎం), అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌(ఏబీపీఎం) గా విధులు నిర్వర్తిస్తారు.
12,828 Government Jobs
  • 12,828 జీడీఎస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ 
  • పదో తరగతి మార్కుల ఆధారంగా ఎంపిక
     
  • మొత్తం పోస్టుల సంఖ్య: 12,828
  • తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు: ఆంధ్రప్రదేశ్‌-118, తెలంగాణలో 96.

అర్హతలు

  • పదోతరగతి ఉత్తీర్ణత ఉండాలి. పదో తరగతిలో మ్యాథ్స్, ఇంగ్లిష్‌తోపాటు స్థానిక భాష చదివి ఉండటం తప్పనిసరి. కంప్యూటర్‌ పరిజ్ఞానంతోపాటు సైకిల్‌ తొక్కడం వచ్చి ఉండాలి. 
  • వయసు: జూన్‌ 11, 2023 నాటికి 18-40 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల గరిష్ట వయో పరిమితిలో సడలింపు లభిస్తుంది. 

చ‌ద‌వండి: 12,828 India Post Jobs: పదో తరగతి అర్హతతోనే.. పూర్తి వివ‌రాలు ఇవే..

వేతనాలు

  • బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌(బీపీఎం): ఈ పోస్టులకు ఎంపికైన వారికి రూ.12000 మూలవేతనంతోపాటు రూ.5040 డీఏ కూడా లభిస్తుంది. అంటే.. మొదటి నెల నుంచే వీరు రూ.17,040 వేతనం అందుకోవచ్చు. దీంతో పాటు ఇతర ప్రోత్సాహకాలు ఉంటాయి. ప్రతి ఆరు నెలలకు ఒక డీఏ, ఏటా ఇంక్రిమెంట్‌ వేతనంలో కలుస్తుంది.
  • అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌(ఏబీపీఎం): ఈ పోస్టులకు ఎంపికైన వారికి రూ.10,000 మూలవేతనంతోపాటు రూ.4200 డీఏ అందుతుంది. వీరు విధుల్లో చేరిన మొదటి నెల నుంచి రూ.14200 వేతనం, ఇతర ప్రోత్సాహకాలు పొందవచ్చు. వీటితో పాటు ఇండియన్‌ పోస్టల్‌ పేమెంట్స్‌ బ్యాంకుకు సంబంధించిన సేవలకు ప్రత్యేకంగా ఇన్సెంటివ్‌ రూపంలో బీపీఎం/ఐబీపీఎంలకు ప్రోత్సాహం అందిస్తారు.
  • ఆ సేవల విలువ ప్రకారం ఇన్సెంటివ్‌ చెల్లిస్తారు. స్వల్పమొత్తంలో హెచ్‌ఆర్‌ఏ కూడా దక్కుతుంది. వీరు రోజూవారీ విధులు నిర్వర్తించడానికి ల్యాప్‌టాప్‌ /కంప్యూటర్‌/స్మార్ట్‌ఫోన్‌ లాంటివి పోస్టల్‌శాఖ సమకూరుస్తుంది. 

ఎంపిక విధానం

  • అభ్యర్థులు పదోతరగతిలో సాధించిన మార్కుల మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. ప్రకటనలో ఖాళీలు ఉన్న బ్రాంచీలు, ఏ హోదాలో ఖాళీ ఉంది. రిజర్వ్‌డ్‌/అన్‌ రిజర్వ్‌డ్‌ వివరాలు పేర్కొన్నారు. వాటిని అభ్యర్థులు పరిశీలించి, తమ ప్రాధాన్యం ప్రకారం ఆప్షన్లు ఇవ్వాలి. మొదటి ప్రాధాన్యం ఇస్తే ఆప్షన్‌-1, తర్వాత దానికి ఆప్షన్‌-2.. ఇలా నింపాలి. 
  • కటాఫ్‌ అంచనా: గత రిక్రూట్‌ విధానాన్ని పరిశీలిస్తే.. ఏపీ, తెలంగాణలో జనరల్, ఓబీసీ విభాగాల్లో సుమారు 95 శాతం, ఎస్సీ, ఎస్టీలైతే 93 శాతం మార్కులు పొందిన వారికి అవకాశం దక్కింది. పోస్టుల సంఖ్యను బట్టి కటాఫ్‌లో హెచ్చుతగ్గులుంటాయి.

విధులు ఇలా
బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌ (బీపీఎం)

వీరు బ్రాంచ్‌ కార్యకలాపాలను పర్యవేక్షించాలి. పోస్టల్‌ విధులతోపాటు ఇండియా పోస్టు పేమెంట్‌ బ్యాంకు వ్యవహారాలూ చూసుకోవాలి. రికార్డుల నిర్వహణ, ఆన్‌లైన్‌ లావాదేవీలు, రోజువారీ కార్యకలాపాలు సజావుగా సాగేలా చూడటం, ఉత్తరాల పంపిణీ జరిగేలా పర్యవేక్షించాలి. పోస్టల్‌కు సంబంధించిన మార్కెటింగ్‌ వ్యవహారాలూ చక్కబెట్టాలి. బృందనాయకుడిగా సంబంధిత బ్రాంచ్‌ను నడిపించాలి. పోస్టల్‌ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి.

అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌(ఏబీపీఎం)

ఈ పోస్టులకు ఎంపికైన వారు స్టాంపులు/స్టేషనరీ అమ్మకం, ఉత్తరాల పంపిణీ, ఇండియన్‌ పోస్టు పేమెంట్స్‌ బ్యాంకుకు సంబంధించిన డిపాజిట్లు, పేమెంట్లు, పోస్టల్‌కు సంబంధించిన ఇతర వ్యవహారాలు చక్కబెట్టాలి. బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌ చెప్పిన పనులు పూర్తిచేయాలి. తపాలా స్కీముల గురించి ప్రజల్లో అవగాహన కలిగించాలి.

ముఖ్యసమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  • దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 11, 2023
  • వెబ్‌సైట్‌: https://indiapostgdsonline.gov.in

చ‌ద‌వండి: 1600 Jobs in SSC: విజయం సాధిస్తే.. గ్రూప్‌–సి హోదాలో కేంద్ర కొలువులు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Published date : 08 Jan 2024 04:34PM

Photo Stories