Bank of Baroda Notification 2024 : స్పెషలిస్ట్ విభాగాల్లో ప్రొఫెషనల్స్ నియామకాలు.. మూడు దశల్లో ఎంపిక ప్రక్రియ!
ఎంఎంజీఎస్–2, 3, ఎస్‌ఎంజీఎస్–4 హోదాలో.. 168 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇది మేనేజ్‌మెంట్ పీజీ, సీఏ తదితర కామర్స్ ప్రొఫెషనల్ కోర్సులు పూర్తి చేసుకున్న అభ్యర్థులకు చక్కటి అవకాశం!! ఈ ఉద్యోగాలను సొంతం చేసుకోవడానికి బ్యాంక్ ఆఫ్ బరోడా నిర్వహించే ఎంపిక ప్రక్రియలో ప్రతిభ చూపాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో బ్యాంక్ ఆఫ్ బరోడా తాజా జాబ్ నోటిఫికేషన్ వివరాలు, ఎంపిక విధానం, కెరీర్ స్కోప్, ఎంపిక ప్రక్రియలో రాణించేందుకు ప్రిపరేషన్ తదితర వివరాలు..
మొత్తం పోస్టుల 168
బ్యాంక్ ఆఫ్ బరోడా తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా మొత్తం 168 పోస్టుల భర్తీకి ఎంపిక ప్రక్రియ చేపట్టనుంది. ఇందులో ఫారెక్స్ ఎక్విజిషన్ అండ్ రిలేషన్‌షిప్ మేనేజర్ (ఎంఎంజీఎస్–2)–11 పోస్టులు, ఫారెక్స్ ఎక్విజిషన్ అండ్ రిలేషన్‌షిప్ మేనేజర్ (ఎంఎంజీఎస్–3)–4 పోస్టులు, క్రెడిట్ అనలిస్ట్ పోస్టులు–80, రిలేషన్‌షిప్ మేనేజర్ (ఎంఎంజీఎస్–3)–44 పోస్టులు, రిలేషన్‌షిప్ మేనేజర్ (ఎంఎంజీఎస్–4)–22 పోస్టులు, సీనియర్ మేనేజర్ (బిజినెస్ ఫైనాన్స్) (ఎంఎజీఎస్–3)–4 పోస్టులు, చీఫ్ మేనేజర్–ఇంటర్నల్ కంట్రోల్స్ (ఎస్‌ఎంజీఎస్–4)–3 పోస్టులు ఉన్నాయి.
Various Posts at IIM Jammu : ఐఐఎం జమ్మూలో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాలు.. వివరాలు ఇలా..
అర్హతలు
ఆయా పోస్ట్‌లను అనుసరించి బ్యాచిలర్ డిగ్రీతోపాటు సంబంధిత స్పెషలైజేషన్లలో మేనేజ్‌మెంట్ పీజీ/పీజీ డిప్లొమా లేదా పీజీ ఉత్తీర్ణత లేదా సీఏ/సీఎంఏ/సీఎఫ్‌ఏ/ సీఎస్ ఉత్తీర్ణత ఉండాలి.
వయసు
అభ్యర్థుల వయసు ఆయా పోస్టులను అనుసరించి 24 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. గరిష్ట వయో పరిమితిలో ఎస్‌సీ/ఎస్‌టీలకు అయిదేళ్లు, ఓబీసీ(నాన్–క్రీమీ లేయర్) అభ్యర్థులకు మూడేళ్లు చొప్పున సడలింపు లభిస్తుంది.
అభ్యర్థులు నిర్దేశిత అర్హతలు, వయో పరిమితిని 2024, జూన్ 1 నాటికి పొంది ఉండాలి.
ఆకర్షణీయ వేతనం
ఆయా పోస్ట్‌లకు ఎంపికైన వారికి ఆర్షణీయ వేతనం లభిస్తుంది. సీనియర్ మేనేజర్ (బిజినెస్ ఫైనాన్స్), చీఫ్ మేనేజర్ (ఇంటర్నల్ కంట్రోల్) హోదాలు ముంబైలోనే ఉంటాయి. వీరికి నెలకు రూ.2.8 లక్షల నుంచి రూ.3.3 లక్షల వరకు వేతనం లభిస్తుంది. మిగతా పోస్ట్‌లకు సంబంధించి ఎంఎంజీఎస్–2 బేసిక్ పే రూ.93,960; ఎంఎంజీఎస్–3 పోస్టులకు రూ.1,05, 280 బేసిక్ పే; ఎస్‌ఎంజీఎస్–4 పోస్టులకు రూ.1,20,940 బేసిక్ పే లభిస్తుంది.
AP TET 2024 Notification : మళ్లీ టెట్ నోటిఫికేషన్ 2024
మూడు దశల ఎంపిక ప్రక్రియ
ఆయా పోస్ట్‌లలో అభ్యర్థులను నియమించే క్రమంలో మూడు దశల ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఇందులో మొదటగా రాత పరీక్ష ఉంటుంది. ఆ తర్వాత సైకో మెట్రిక్ టెస్ట్ జరుగుతుంది. చివరగా గ్రూప్ డిస్కషన్/పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటాయి.
నాలుగు విభాగాల్లో రాతపరీక్ష
ఎంపిక ప్రక్రియలో తొలిదశ రాత పరీక్షను నాలుగు విభాగాల్లో నిర్వహిస్తారు. రీజనింగ్ 25 ప్రశ్నలు–25 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ 25 ప్రశ్నలు–25 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 25 ప్రశ్నలు–25 మార్కులు, ప్రొఫెషనల్ నాలెడ్జ్ 75 ప్రశ్నలు–150 మార్కులకు ఉంటాయి. ఇలా మొత్తం నాలుగు విభాగాల్లో 150 ప్రశ్నలతో 225 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. అభ్యర్థులను తదుపరి దశకు ఎంపిక చేసే క్రమంలో ప్రొఫెషనల్ నాలెడ్జ్ విభాగంలో పొందిన మార్కులనే పరిగణనలోకి తీసుకుంటారు. ఇందులో పొందిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా రూపొందించి తదుపరి దశలకు ఎంపిక చేస్తారు. రీజనింగ్, ఇంగ్లిష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌లను కేవలం అర్హత విభాగాలుగానే నిర్దేశించారు. వీటిలో కనీస అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది.
Apprenticeship Coaching : ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో అప్రెంటిస్‌షిప్ శిక్షణలో ప్రవేశాలకు దరఖాస్తులు..
చివరగా జీడీ/పీఐ
రాత పరీక్షలో పొందిన మార్కుల ఆధారంగా.. ఒక్కో పోస్ట్‌కు అయిదుగురు లేదా ఆరుగురిని చొప్పున ఎంపిక చేసి.. వారికి చివరి దశలో గ్రూప్ డిస్కషన్(జీడీ), పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇందులో భాగంగా అభ్యర్థుల ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఆటిట్యూడ్, సామర్థ్య స్థాయిను పరిశీలిస్తారు.
తుది నియామకాలు ఇలా
తుది నియామకాలు ఖరారు చేసే క్రమంలో.. రాత పరీక్ష, జీడీ/పీఐలలో పొందిన మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. అభ్యర్థులు జీడీ/పీఐలలో కూడా కనీస అర్హత మార్కులు సాధించాలి. ఈ మేరకు జనరల్ కేటగిరీ అభ్యర్థులు కనీసం 60 శాతం, రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులు 55 శాతం మార్కులు పొందాల్సి ఉంటుంది.
సీజీఎం స్థాయికి
ఎంఎంజీఎస్–2, 3, ఎస్‌ఎంజీఎస్–4 హోదాల్లో కెరీర్ ప్రారంభించిన వారు భవిష్యత్తులో చీఫ్ జనరల్ మేనేజర్ స్థాయికి చేరుకునే అవకాశం ఉంటుంది.
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 2024, జూలై 2.
- పరీక్ష తేదీ: సెప్టెంబర్‌లో పరీక్ష నిర్వహించే అవకాశం.
- తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం.
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.bankofbaroda.in/career/currentopportunities
Contract Based Posts : ఎన్‌హెచ్‌ఏఐ-డీపీఆర్ విభాగంలో ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల్లో భర్తీకి దరఖాస్తులు..
రాత పరీక్షలో రాణించేలా
- రీజనింగ్: పరీక్షలో కీలకంగా నిలిచే ఈ విభాగంలో మంచి మార్కుల కోసం కోడింగ్–డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్, సిలాజిజమ్ విభాగాలను ప్రాక్టీస్ చేయాలి.
- ఇంగ్లిష్ లాంగ్వేజ్: ఇడియమ్స్, సెంటెన్స్ కరెక్షన్, వొకాబ్యులరీ, సెంటెన్స్ రీ అరేంజ్‌మెంట్, వన్ వర్డ్ సబ్‌స్టిట్యూట్స్‌పై అవగాహన పొందాలి. ఇంగ్లిష్ వొకాబ్యులరీ నైపుణ్యం సాధించాలి. ఇంగ్లిష్ దినపత్రికలు చదవడం, వినియోగిస్తున్న పదజాలం, వాక్య నిర్మాణంపై దృష్టి పెట్టాలి.
- క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్: ఈ విభాగం కోసం అర్థమెటిక్ అంశాలు (పర్సంటేజెస్, నిష్పత్తులు, లాభ–నష్టాలు, నంబర్ సిరీస్, బాడ్‌మాస్ నియమాలు) ప్రాక్టీస్ చేయాలి. గత పరీక్షలు, వెయిటేజీ కోణంలో డేటా ఇంటర్‌ప్రిటేషన్, అనాలిసిస్‌లపై ప్రత్యేక దృష్టిపెట్టాలి.
ప్రొఫెషనల్ నాలెడ్జ్
ప్రొఫెషనల్ నాలెడ్జ్ విభాగం ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలంటే.. అభ్యర్థులు తాము దరఖాస్తు చేసుకున్న స్పెషలైజేషన్‌కు సంబంధించి బ్యాచిలర్, పీజీ స్థాయి పుస్తకాలను అధ్యయనం చేయాలి. ముఖ్యమైన కాన్సెప్ట్‌లను అప్లికేషన్ అప్రోచ్‌తో చదవాలి. ఆయా విభాగాలకు సంబంధించి గత ప్రశ్న పత్రాలు, ఇతర పోటీ పరీక్షల ప్రశ్న పత్రాలను సాధన చేయడం కూడా ఉపయుక్తంగా ఉంటుంది.
గ్రూప్ డిస్కషన్/పర్సనల్ ఇంటర్వ్యూ
ఇందులో విజయం సాధించడానికి సమకాలీన అంశాలపై అవగాహన పెంచుకోవాలి. అదే విధంగా ఆయా అంశాలపై స్పష్టమైన అభిప్రాయం కలిగుండాలి. ఆ అభిప్రాయాన్ని సమర్థించుకునేలా భావ వ్యక్తీకరణ సామర్థ్యం పెంచుకోవాలి. అన్ని పోస్ట్‌లకు పని అనుభవం ప్రాధాన్యంగా నిలుస్తోంది. కాబట్టి ఇప్పటి వరకు తాము నిర్వహించిన విధులు, వాటి ద్వారా బ్యాంకు పురోగతి కోసం చేసిన కృషి గురించి కూడా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. వీటికి కూడా సన్నద్ధమవ్వాలి.
Degree Admissions2024: డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు నేడు నోటిఫికేషన్
Tags
- Bank of Baroda
- Job Notifications
- bank jobs
- latest job recruitments 2024
- online applications
- entrance exam for job selection
- eligibles for jobs at banks
- Bank of Baroda Notification 2024
- latest job news
- Education News
- Sakshi Education News
- Banking job vacancies
- MMGS-2 vacancies
- MMGS-3 jobs
- SMGS-4 positions
- Public sector bank jobs
- latest jobs in 2024
- SakshiEducation latest job notifications