Degree Admissions2024: డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు నేడు నోటిఫికేషన్
అమరావతి: రాష్ట్రంలో డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించి ఉన్నత విద్యా మండలి సోమవారం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు అన్ ఎయిడెడ్, అటానమస్ డిగ్రీ కళాశాలల్లో సాధారణ డిగ్రీ కోర్సుల్లో ఆన్‌లైన్ ద్వారా సీట్లను భర్తీ చేయనుంది. వాస్తవానికి ఇంటరీ్మడియట్ ఫలితాలు విడుదలై రెండు నెలలు దాటినప్పటికీ డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభం కాకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందారు. తాజాగా.. ఇంటరీ్మడియెట్ సప్లిమెంటరీ ఫలితాలు కూడా ప్రకటించారు. వర్సిటీల నుంచి కళాశాలలకు అనుమతుల పొడిగింపు ప్రక్రియలో జాప్యంతోపాటు కొత్తగా బీసీఏ, బీబీఏ, బీఎంఎస్ కోర్సులు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) పరిధిలోకి వెళ్లాయి. ఫలితంగా యూజీసీ నుంచి రావాల్సిన గుర్తింపు ఏఐసీటీఈ ఇవ్వాల్సి వస్తోంది.
Also Read: SSC MTS Notification 2024 for 8326 Posts
ఈ క్రమంలో రాష్ట్రంలో సుమారు వెయ్యికి పైగా డిగ్రీ కళాశాలలు ఉండగా అందులో 800 వరకు బీసీఏ, బీబీఏ, బీఎంఎస్ కోర్సులు అందిస్తున్న కళాశాలలు వున్నాయి. వీటికి ఏఐసీటీఈ అనుమతులు వచ్చి, రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ఎన్‌ఓసీ ఇచి్చన తర్వాతే సీట్ల భర్తీ చేయాల్సి రావడంతో అడ్మిషన్లకు జాప్యం జరిగింది. వీటికి తోడు.. 43 కళాశాలలు కొత్తగా అనుమతులు కోసం దరఖాస్తు చేశాయి. వీటిలో కేవలం రెండు లేదా మూడింటికి మాత్రమే అనుమతులొచ్చే అవకాశముందని ఉన్నత విద్య వర్గాలు చెబుతున్నాయి. ఈ కళాశాలల్లో 2024–25లోనే అడ్మిషన్లకు అవకాశం కలి్పంచనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. గతేడాది జూన్ 19 నుంచి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం కాగా.. ప్రస్తుత ప్రభుత్వంలో ఆలస్యంగా జరుగుతుండటం గమనార్హం. మొత్తం సాధారణ డిగ్రీలో సుమారు 3.20 లక్షల వరకు సీట్లున్నాయి.
Tags
- Degree Admissions
- Online Admission
- andhra pradesh news
- Admissions 2024
- Online Admission 2024
- Education News
- Sakshi Education Latest News
- AmaravatiHigherEducationCouncil
- DegreeCollegeAdmissions
- OnlineAdmissionProcess
- GovernmentColleges
- PrivateColleges
- AutonomousColleges
- AndhraPradeshEducation
- HigherEducationNotification
- latest admissions in 2024
- sakshieducation latest admissions in 2024