Skip to main content

KGBV: టీచర్ల బదిలీల షెడ్యూల్‌ విడుదల

రాష్ట్ర వ్యాప్తంగా KGBVలలో పని చేస్తున్న టీచర్ల బదిలీలకు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్ర సమగ్ర శిక్ష డైరెక్టర్‌ షెడ్యూల్‌ను విడుదల చేశారు.
KGBV
కేజీబీవీ టీచర్ల బదిలీల షెడ్యూల్‌ను విడుదల

జూలై 13 నుంచి 21 వరకు బదిలీల దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. 22 నుంచి 23 వరకు జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయంలో జిల్లా స్థాయిలో దరఖాస్తుల పరిశీలన జరుగుతుంది. 25న ఖాళీ స్థానాలకు ప్రకటన విడుదల చేస్తారు. 26న సీనియారిటీ జాబితా తయారీ, ప్రకటన ఉంటుంది. 27 నుంచి 28 వరకు వినతులు, అభ్యంతరాలను స్వీకరిస్తారు. 29న తుది సీనియారిటీ జాబితాను ప్రకటిస్తారు. అనంతరం 30 నుంచి ఆగస్టు 1 వరకు వెబ్‌ ఆప్షన్ల స్వీకరణ జరుగుతుంది. ఆగస్టు 2న బదిలీ అయిన కొత్త ప్రదేశంలో జాయినింగ్‌ అవ్వాలని షెడ్యూల్‌లో పేర్కొన్నట్లు ఆంధ్రప్రదేశ్‌ ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సామల సింహాచలం జూలై 11న ఒక ప్రకటనలో తెలిపారు.

చదవండి: 

Published date : 12 Jul 2022 01:28PM

Photo Stories