ఆ విద్యార్థులు 10 పూర్తిచేసే వరకు ఫీజు చెల్లించండి
బీఏఎస్‌ఎస్‌ను రద్దుచేస్తూ ప్రభుత్వం 2021 ఆగస్టు 27న జారీచేసిన జీవో 19ని హైకోర్టు రద్దుచేసింది. బీఏఎస్‌ఎస్ పథకం కింద అర్హత పొంది 2 నుంచి 8వ తరగతి వరకు ప్రస్తుతం విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులు 10వ తరగతి పూర్తిచేసేవరకు వారిని అవే పాఠశాలల్లో కొనసాగిస్తూ వారికి ఫీజు చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ మంతోజు గంగారావు తీర్పు చెప్పారు. ఎస్సీ, ఎస్టీల్లో ప్రతిభ ఉన్న విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల్లో చదువుకునేందుకు వీలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2008లో బీఏఎస్ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద ప్రవేశాలు పొందిన వారికి ప్రభుత్వమే ఫీజు చెల్లిస్తుంది. అయితే నాడు–నేడు కింద ప్రభుత్వ పాఠశాలల్లో అత్యున్నత మౌలిక సదుపాయాలు, మంచి విద్యాబోధన అందిస్తుండడంతో ప్రభుత్వం బీఏఎస్ పథకాన్ని రద్దుచేస్తూ 2021లో జీవో జారీచేసింది. ఈ జీవోను సవాలు చేస్తూ మాలమహానాడు ఐక్యవేదిక, మరికొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై విచారించిన జస్టిస్ గంగారావు జూలై 29న తీర్పు చెప్పారు.
చదవండి: