డిజిటల్‌తో పల్లెకు చేరువగా ఉన్నత విద్య
ఇందుకు సంబంధించి ఓ ప్రత్యేక వెబ్‌సైట్‌ను జూలై 29 నుంచి అందుబాటులోకి తెస్తున్నట్టు యూజీసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.జగదీష్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. భారత ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖతో కలిసి యూజీసీ ఈ–రిసోర్స్‌ను, కామన్ సర్వీస్ కేంద్రాలను (సీఎస్‌సీ), స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ) కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. దాదాపు 2.5 లక్షల కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంటాయని, దేశం మొత్తం మీద 5 లక్షల వరకు అందుబాటులోకి తెస్తున్నామని స్పష్టం చేశారు. స్థానిక ఎంటర్‌ప్రెన్యూర్స్ వీటిని నిర్వహిస్తారని, ఆన్‌లైన్ కోర్సులు పూర్తిగా ఉచితమని, సర్వీస్ కేంద్రాలు అందించే మౌలిక వసతులకు గంటకు రూ. 20, నెలకైతే రూ.500 చార్జీ ఉంటుందని తెలిపారు.
చదవండి: భారత, విదేశీ విద్యా సంస్థల.. డ్యూయల్, జాయింట్ డిగ్రీలు
ఆన్‌లైన్‌లో పీజీ, నాన్ ఇంజనీరింగ్ కోర్సులు
ఉన్నత విద్యలో గ్రామీణ మారుమూల ప్రాంతాల విద్యార్థులు వెనుకబడకుండా చూడటమే వీటి ఏర్పాటులోని ప్రధానోద్దేశమని యూజీసీ పేర్కొంది. అకడమిక్ రైటింగ్, ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్, తదితర 2300 పీజీ, 25 నాన్ ఇంజనీరింగ్ కోర్సులు తెలుగుతో సహా ఎనిమిది భాషల్లో విద్యార్థులకు అందుబాటులో ఉంటాయని వివరించింది.
చదవండి: ఒకేసారి రెండు డిగ్రీలు