Education: పాఠశాల నుంచేప్రయోగాత్మక విద్య
‘రాష్ట్రస్థాయి అటల్ టింకరింగ్ ల్యాబ్ హబ్‌లో ఇంజినీరింగ్ విద్యార్థులు పాఠశాల విద్యార్థులకు బోధన’ అంశంపై మూడురోజుల వర్క్‌షాప్‌ను జూన్ 6న పెనమలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో బోర్డ్ ఫర్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ త్రూ ఎడ్యుకేషన్ (బీసీడీఈ) అనే కార్యక్రమం ద్వారా యూనిసెఫ్, సమగ్ర శిక్ష, పాఠశాల విద్యాశాఖ, విజ్ఞాన్ ఆశ్రమం సంయుక్తంగా ఈ వినూత్న ప్రక్రియను చేపట్టాయి.
చదవండి: Uzziel Victor: ఐదున్నరేళ్లు... 11 భాషలు.. ఈ బుడతడికి వరల్డ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అవార్డ్
రాష్ట్రంలో ఎంపిక చేసిన ఏడు అటల్ టింకరింగ్ ల్యాబ్ హబ్ స్కూల్లో బోధించడానికి విద్యార్థులు స్వచ్ఛందంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులు ప్రయోగాత్మకవిద్యను అందిపుచ్చుకోవాలని కోరారు. దీనికోసం పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ల్యాబ్‌లను సద్వినియోగపరచుకోవాలని సూచించారు. ఈ వర్క్‌షాప్‌లో జాతీయస్థాయి విద్యానిపుణులు గణేష్ నిగమ్, శేషగిరి మధుసూదన్, దక్షిణ భారతస్థాయి విద్యానిపుణుడు డాక్టర్ దేవకుమార్ తదితరులు పాల్గొన్నారు.