Uzziel Victor: ఐదున్నరేళ్లు... 11 భాషలు.. ఈ బుడతడికి వరల్డ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అవార్డ్
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బాల్ అని చదువుకునే వయసులో ఏకంగా 11 ప్రపంచ భాషల్లో వర్ణమాల అక్షర క్రమాన్ని స్పష్టంగా చెబుతూ అబ్బురపరుస్తున్నాడు నగరానికి చెందిన ఐదున్నరేళ్ల బాలుడు ఉజ్జిల్ విక్టర్.
ఆంగ్లం, రష్యన్, స్పానిష్, గ్రీక్, టర్కిష్, కాప్టిక్, హిబ్రూ, అరబిక్, జపనీస్ వంటి 11 అంతర్జాతీయ భాషల్లో వర్ణమాల అక్షర క్రమాన్ని వివరంగా చెప్పగలడు ఉజ్జిల్. తన అసాధారణ ప్రతిభతో ‘ఇన్‌ఫ్లుయెన్సర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో స్థానం సంపాదించుకున్నాడు.నగరంలోని టోలీచౌకీకి చెందిన విక్టర్, రీనా దంపతుల సంతానం ఉజ్జిల్. తల్లిదండ్రులిద్దరూ ఉపాద్యాయలుగా కొనసాగుతున్నారు. ఈ సందర్భంగా తల్లి రీనా మాట్లాడుతూ.. తమ కుమారుడు నాలుగున్నరేళ్ల వయసులోనే 50 కూడికలను 5 నిమిషాల్లో పూర్తి చేసి మొదటి వరల్డ్ రికార్డును సాధించాడని పేర్కొన్నారు.
చదవండి:
Award: బడిపిల్లల సాహిత్యానికి రాష్ట్రస్థాయి పురస్కారం
ABK Prasad: రాజా రామ్మోహన్ రాయ్ అవార్డు 2023 పురస్కార గ్రహీతగా ప్రసాద్
Published date : 07 Jun 2023 04:05PM