AP Job Calender 2025 Release Date : ఏపీ జాబ్ క్యాలెండర్ విడుదలపై... ప్రభుత్వం కీలక ప్రకటన..? ఎక్కువగా ఈ ఉద్యోగాలే...!
ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ద్వారా జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది.
2025 జనవరి 12వ తేదీన ప్రభుత్వం జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయనున్నది. అలాగే ఇప్పటికే విడుదల చేసిన 20 నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్షల నిర్వహణకు షెడ్యూల్ ప్రకటించనున్నారు. ఈ జాబ్స్ అటవీ శాఖలోనే ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. అంతేకాదు ప్రభుత్వం కీలక మరో కీలక నిర్ణయం తీసుకుంది.
ఒక్క ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌లోనే..
ఈ నెల 12వ తేదీన 866 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లు, పాత నోటిఫికేషన్ల రాత పరీక్ష వివరాలను ఏపీపీఎస్సీ ప్రకటించే అవకాశం ఉంది. ఒక్క ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌లోనే 800కు పైగా పోస్టులున్నట్లు తెలుస్తోంది. అత్యధికంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ ఆఫీసర్ ఉద్యోగాలు 650కి పైగా ఉన్నట్లు అధికార వర్గాల సమాచారం.
ఈ సారి గ్రూప్-1, 2 పోస్టులకు..
త్వరలో పూర్తి కానున్న ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా ఈ నోటిఫికేషన్లు ఇస్తామని ప్రభుత్వం తెలిపింది. నవంబర్ 2023 లో విడుదలైన గ్రూప్-1 నోటిఫికేషన్ పరీక్షలు 2025 ఏప్రిల్ తర్వాత నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2025 ఫిబ్రవరి 23న గ్రూప్-2 ప్రిలిమ్స్ నిర్వహించనున్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్, జూనియర్, డిగ్రీ కళాశాలలో లెక్చరర్ పోస్టుల భర్తీ నోటిఫికేషన్లకు రాతపరీక్షలను 2025 జూన్‌లో నిర్వహించే అవకాశం ఉంది. డీఎస్సీపై కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి సంతకంకు విలువ లేకుండా పోయింది. ఇదిగో డీఎస్సీ... అదిగో డీఎస్సీ అంటూ కాలయాపన చేస్తున్నారే కానీ.. డీఎస్సీ నోటిఫికేషన్ మాత్రం విడుదల చేయండి లేదు. ఇలాగే ఏపీ జాబ్ క్యాలెండర్ కూడా ఉంటుందని అభ్యర్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ వాయిదాల పర్వాన్ని గమనిస్తున్న నిరుద్యోగులు, విద్యారంగ నిపుణులు 2019కి ముందు టీడీపీ పాలనను గుర్తు చేసుకుంటున్నారు. గతంలోనూ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సర్వీస్ కమిషన్ నుంచి విడుదలైన పలు నోటిఫికేషన్లు వాయిదా పడ్డాయని, ప్రభుత్వంలో ఉన్నవారే పోస్టుల భర్తీని ఆలస్యం చేసేందుకు కోర్టుల్లో కేసులు వేయిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇదిగో డీఎస్సీ... అదిగో డీఎస్సీ..
ఏపీ మెగా డీఎస్సీ పేరుతో... చంద్రబాబు కుటమి ప్రభుత్వం డీఎస్సీ అభ్యర్థులకు చుక్కలు చూపిస్తోంది. ఇదిగో డీఎస్సీ... అదిగో డీఎస్సీ నోటిఫికేషన్ అంటూ ఆరు నెలలుగా ఊరిస్తూ.. నోటిఫికేషన్ మాత్రం ఇవ్వలేదు. ఇప్పటికి డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడో స్పష్టత ఇవ్వలేదు.