Skip to main content

Good News: Group 2 Free Coaching గ్రూప్‌ 2లో ఉచిత శిక్షణ

BC Study Circle offers coaching for APPSC Group-2 exam, apply through Backward Classes Welfare Department.  Free Coaching in Group 2 Exams    Apply now for APPSC Group-2 exam coaching at BC Study Circle by BC Welfare Department.
Free Coaching in Group 2 Exams

వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న బీసీ స్టడీ సర్కిల్‌లో ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 పరీక్షల శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు బీసీ సంక్షేమ అధికారి ఇ.అనురాధ ఓ ప్రకటనలో తెలిపారు.

అర్హతలు కలిగిన బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 18వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు ఫారాలు బీసీ స్టడీ సర్కిల్‌, వాంబే కాలనీ, 80 ఫీట్‌ రోడ్‌, టీడీపీ భవనం వెనుక, శ్రీకాకుళంలో గల కార్యాలయంలో లభిస్తాయని పేర్కొన్నారు.

అభ్యర్థులు తప్పనిసరిగా ట్రాన్స్‌ఫర్‌ సర్టిఫికెట్‌ (టి.సి.), కుల ధ్రువీకరణ పత్రం కలిగి ఉండాలని సూచించారు. వివరాలకు 8332852106, 7382975679 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

Published date : 21 Dec 2023 07:50AM

Photo Stories