Students Goal: ప్రభుత్వ ప్రోత్సాహకమే లక్ష్యంగా..

గతేడాది, టెన్త్‌ ఇంటర్‌ విద్యార్థుల్లో అధిక మార్కులను సాధించిన విద్యార్థులకు ప్రభ్వుం ఈ విధంగా సత్కరించింది. అయితే, ఈసారి కూడా విద్యార్థులు, ఉపాధ్యాయులు అదే లక్ష్యంతో పరీక్షలకు సన్నద్ధం అవుతున్నారు. ఇంతకీ, ఆ ప్రోత్సాహకం ఏంటీ..? ఈ కింది కథనాన్ని చదవండి..

నంద్యాల: చదువుతోనే విద్యార్థుల భవిత మారుతుందని, సామాజిక ప్రగతి సాధ్యమవుతుందన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి పెద్దపీట వేసింది. పేద విద్యార్థులను చదువులో ప్రోత్సహించేందుకు అమ్మ ఒడి మొదలు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. ఈ క్రమంలో ఏటా జరిగే పదో తరగతి, ఇంటర్మీడియెట్‌ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించే విద్యార్థులకు ‘జగనన్న ఆణి ముత్యాలు’ కింద నగదు ప్రోత్సాహకాలు అందజేస్తోంది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను సత్కరిస్తోంది. పాఠశాలలకు జ్ఞాపికలు అందజేస్తోంది.

DIKSHA Course: ఉపాధ్యాయులకు దీక్షా కోర్సులు..!

దీంతో ఉత్తమ ఫలితాల సాధనకు పాఠశాల యాజమాన్యాలు పోటీ పడుతున్నాయి. ఆయా పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులను మెరికల్లా తీర్చిదిద్దుతున్నారు. మార్చి 1వ తేదీ నుంచి ఇంటర్‌, మార్చి 18వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. గతేడాది ’జగనన్న ఆణిముత్యాలు’ కింద పదో తరగతిలో ప్రతిభావంతులైన మొదటి ముగ్గురికి, ఇంటర్మీడియెట్‌లో అధిక మార్కులు సాదించిన గ్రూపునకు ఒక్కరి చొప్పున నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో నగదు అవార్డులను అందజేసింది.

SCCL Recruitment 2024: సింగరేణిలో 272 ఎగ్జిక్యూటివ్, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, చదువు చెప్పే గురువులను సత్కరించింది. పాఠశాలల పనితీరును ప్రశంసించింది. ఈ ఏడాది కూడా అదే గౌరవాన్ని పొందేందుకు, ప్రభుత్వ ప్రోత్సాహకాన్ని అంది పుచ్చుకునేందుకు విద్యార్థులు, ఉపాధ్యాయులు సమష్టిగా చదువుల యజ్ఞం సాగిస్తున్నారు. అధిక మార్కుల సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.

APPSC Group 2 Prelims Exam Result Date 2024 : గ్రూప్‌-2 ఫ‌లితాల విడుద‌ల ఎప్పుడేంటే..?

గతేడాది ఆణిముత్యాలు వీరే..

గతేడాది పదో తరగతిలో నియోజకవర్గాల స్థాయిలో అధిక మార్కులు సాధించిన వారిలో హర్షిత (587 మార్కులు, జెడ్పీహెచ్‌ఎస్‌, కోవెలకుంట్ల), సుభాన్‌ (585 మార్కులు, జెడ్పీహెచ్‌ఎస్‌, ఆత్మకూరు), సాయిసంతోషి (583 మార్కులు, జెడ్పీహెచ్‌ఎస్‌, అవుకు), రాణి (573 మార్కులు ఏపీ సోషల్‌ వెల్ఫేర్‌ స్కూల్‌, డోన్‌), కేతశోని (563 మార్కులు, ఏపీ సోషల్‌ వెల్ఫేర్‌ స్కూల్‌, ఆళ్లగడ్డ) తదితరులు ఉన్నారు.

Education Awards: ముఖ్యమంత్రి విద్యాపురస్కారాలు..

● ఇంటర్మీడియెట్‌లో అత్యధిక మార్కులు సాధించిన పూజిత (949 మార్కులు, బాలికల ప్రభుత్వ జూనియర్‌, నంద్యాల), మౌనిక (932 మార్కులు ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ, నంద్యాల), హుసేన్‌బీ (933 మార్కులు, పీఎస్సీ, కేవీఎస్సీ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, నంద్యాల), సుమలత (971 మార్కులు, శ్రీశైలం మోడల్‌ స్కూల్‌, నంద్యాల), తదితర విద్యార్థులు అవార్డులు అందుకున్నారు. వీరి స్ఫూర్తితో ఈ ఏడాది కూడా అధిక మార్కుల సాధనకు విద్యార్థులు రాత్రింబవళ్లు కష్టపడి చదువుతున్నారు.

Shiksha Award Ceremony: జిల్లా స్థాయి ముఖ్యమంత్రి శిక్షా పురస్కార ప్రదానోత్సవం

అవార్డులు ఇలా...

పదో తరగతిలో నియోజకవర్గ స్థాయిలో అధిక మార్కులు సాధించిన మొదటి ముగ్గురు విద్యార్ధులకు రూ.15 వేలు, రూ. 10 వేలు, రూ.5 వేలు చొప్పున, జిల్లా స్థాయిలో రూ.50 వేలు, రూ.30 వేలు, రూ.10 వేలు, రాష్ట్ర స్థాయిలో రూ.లక్ష, రూ.75 వేలు, రూ.50 వేలు చొప్పున నగదు బహుమతులు అందజేస్తుంది. విద్యార్థులకు మెడల్‌తో పాటు వారి తల్లిదండ్రులు, పాఠశాల హెచ్‌ఎంను సత్కరిస్తుంది. పాఠశాలకు ప్రత్యేకంగా ఓ జ్ఞాపికను అందజేస్తోంది. ఇంటర్మీడియెట్‌లో అయితే ఎంపీసీ, బైపీసీ, హెచ్‌ఎసీ, సీఈసీ/ఎంఈసీ గ్రూపుల్లో టపర్లకు నియోజకవర్గ స్థాయిలో రూ. 15 వేలు, జిల్లా స్థాయిలో రూ.50 వేలు, రాష్ట్ర స్థాయిలో రూ.లక్ష చొప్పున అందజేస్తుంది.

Jagananna Vidya Deevena: పామర్రులో ‘విద్యా దీవెన’ కార్యక్రమం.. ఎప్పుడంటే..

ప్రథమ స్థానంలో నిలుస్తాం

గతేడాది పదో తరగతి ఫలితాల్లో నంద్యాల జిల్లా రాష్ట్ర స్థాయిలో మూడవ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది వంద శాతం ఉత్తీర్ణత సాధించి జిల్లాను ప్రథమ స్థానంలో ఉండేలా చర్యలు చేపట్టాం. ప్రతి ఉన్నత పాఠశాలను అధికారులు దత్తత తీసుకున్నారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ విద్యార్థుల్లో బోధనా సామర్థ్యాలను పరీక్షిస్తున్నారు. చదువులో వెనుక బడిన విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక బోధన తరగతులు నిర్వహిస్తున్నాం.

– సుధాకర్‌రెడ్డి, డీఈఓ, నంద్యాల

#Tags