Education Awards: ముఖ్యమంత్రి విద్యాపురస్కారాలు..
రాయగడ: జిల్లాలో 1800 మందికి ముఖ్యమంత్రి విద్యాపురస్కారాలను ఆదివారం గోవింద చంద్ర దేవ్ ఉన్నత పాఠశాల మైదానంలో ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆదివాసీ, హరిజన సంక్షేమ శాఖ మంత్రి జగన్నాథ సరక మాట్లాడుతూ జిల్లాలో ఇంతమందికి విద్యాపురస్కారాలు లభించడం గర్వించదగ్గ విషయమని పేర్కొన్నారు. రాయగడ ఎమ్మెల్యే మకరంద ముదులి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 5టి పథకం ద్వారా పాఠశాలలను ఆధునీకరించడంతో పాటు విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుకు దూసుకు వెళ్లాలన్న ఉద్దేశంతో అనేక పథకాలను అమలు చేస్తోందని చెప్పారు.
Students Health Checkup: గురుకుల విద్యార్థుల ఆరోగ్య పరీక్ష..
కార్యక్రమంలో ఎస్‌డీసీ చైర్మన్ అనసూయ మాఝి, జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సరస్వతి మాఝి, అమో ఒడిశా నవీన్ ఒడిశా జిల్లా సమన్వయకర్త పట్నాన గౌరిశంకరరావు, ఏడీఎం భాస్కర రైతా, జిల్లా అదనపు విద్యాశాఖ అధికారి భజన్‌లాల్ మాఝి తదితరులు పాల్గొన్నారు.