Students Health Checkup: గురుకుల విద్యార్థుల ఆరోగ్య పరీక్ష..
కొయ్యూరు: జిల్లాలో అన్ని ఆశ్రమ, గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించేలా పీహెచ్‌సీ వైద్యాధికారులకు ఆదేశాలిచ్చామని డీఎంహెచ్‌వో జమల్‌బాషా వెల్లడించారు. ఆదివారం ఆయన కొయ్యూరు గురుకుల పాఠశాలను సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడారు. కడుపునొప్పితో బాధపడుతున్న విద్యార్థిని పరీక్షించారు.
అనంతరం వంటకాలను పరిశీలించారు. తాగునీటిని మరోసారి పరీక్ష చేయిస్తామన్నారు. మరుగుదొడ్లను పరిశీలించారు. నీరు నిల్వ లేకుండా చూడాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు సికిల్ సెల్ ఎనీమియాతోపాటు మలేరియా, టైఫాయిడ్ పరీక్షలు చేస్తారన్నారు.
10th Exams: మార్చి 4న టెన్త్ పరీక్షలపై ఫోన్ ఇన్ కార్యక్రమం
2.13 లక్షల మందికి సికిల్‌సెల్ ఎనీమియా పరీక్షలు
జిల్లాలో ఇప్పటివరకు 2.13 లక్షల మందికి సికిల్‌సెల్ ఎనీమియా పరీక్షలు నిర్వహించామని డీఎంహెచ్‌వో జమాల్‌బాషా వెల్లడించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ వీరిలో 1,88,644 మందికి నెగిటివ్ వచ్చిందన్నారు. 8,558 మందికి తక్కువగా ఉందన్నారు. 1034 మందికి వ్యాధి ఉన్నట్టుగా ప్రాథమిక పరీక్షల్లో తేలిందన్నారు. రెండో దశలో నిర్థారణ అయిన తరువాత వైఎస్సార్ పింఛను మంజూరుకు సిఫార్సు చేస్తామన్నారు.
TET Exam Arrangements: నాలుగు కేంద్రాల్లో టెట్ పరీక్షలకు ఏర్పాట్లు సిద్ధం..
జిల్లాలో 800 మందికి నెలకు రూ.10 వేల చొప్పున వైఎస్సార్ పింఛన్ ఇస్తున్నామన్నారు. ఇంకా జిల్లాలో 2.45 లక్షల మందికి పరీక్షలు చేయాల్సి ఉందన్నారు. పూర్తయిన అనంతరం వివరాలను ఐటీడీఏ పీవోకు నివేదిస్తామన్నారు. వైద్యాధికారి మనోజ్ఞ, మలేరియా సబ్ యూనిట్ అధికారి నీలకంఠం నాయుడు, ఏఎంవో సత్యనారాయణ, సీహెచ్‌వో ప్రశాంత్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
డీఎంహెచ్‌వో జమాల్‌బాషా ఆదేశం