TET Exam Arrangements: నాలుగు కేంద్రాల్లో టెట్ పరీక్షలకు ఏర్పాట్లు సిద్ధం..
ఏలూరు: ఏలూరు జిల్లాలోని 4 కేంద్రాల్లో ఏపీ టెట్ పరీక్షలకు ఏర్పాట్లు చేశామని డీఈఓ ఎస్.అబ్రహం ప్రకటనలో తెలిపారు. ఈనెల 27 నుంచి మార్చి 9 వరకు ఉదయం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ, తిరిగి మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ రెండు షిఫ్టుల్లో పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. దుగ్గిరాలలోని ఏలూరు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, వట్లూరులో సీఆర్‌ఆర్ ఇంజనీరింగ్ కళాశాల, సిద్ధార్థ క్వెస్ట్, ఆగిరిపల్లి మండలం పోతవరపాడు ఎన్‌ఆర్‌ఐ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పరీక్షలు నిర్వహిస్తారన్నారు.
Group-2 Prelims Arrangements: అత్యంత పకడ్బందీగా నిర్వహించిన గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్ష..
అభ్యర్థుల హాల్‌టికెట్‌లో అభ్యర్థి పేరు, తండ్రి పేరులో, జెండర్ తదితర మార్పులేమైనా ఉంటే పరీక్షా కేంద్రంలో మార్పు చేస్తారన్నారు. విభిన్న ప్రతిభావంతులు పరీక్ష రాయడానికి ఇంటర్ ద్వితీయ సంవత్సరం లేదా డిగ్రీ ప్రథమ సంవత్సరం విద్యార్థులను సహాయకులుగా నియమిస్తామన్నారు. అభ్యర్థులు తప్పనిసరిగా హాల్‌టికెట్, గుర్తింపు ఐడీలతో కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.